ఏప్రిల్ 1 అంటే అందరికి తెలుసు ఏప్రిల్ ఫూల్ డే. అసత్య కథనాలతో అందరూ ఆటపట్టిస్తూ ఫూల్ చేస్తుంటారు. ఇలా ఆటపట్టించడం సరదాగానే ఉంటుంది కాని కొందరు నిజమే అనుకుని కంగారుపడుతుంటారు. ఇలాంటివి చేయడం కొందరికి సంతోషం కలిగిన ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా అందరిని ఫూల్స్ చేసామని సంతోషిస్తుంటారు. ఏప్రిల్ 1 ఫూల్స్ డే ఇదొక్క రోజే ఫూల్స్ ని చేయడం అనుకుంటారు. ప్రతిరోజు చాలా మంది ఫూల్స్ని చేస్తునే ఉంటారు.
ఇలా కొత్తగా ఒకరోజు ఫూల్స్ చేయడం ఏంటి ప్రతిరోజు కొందరు కొందరిని ఫూల్స్ చేస్తూనే ఉంటారు.
ఉదా: కాలేజికి వెళ్ళిన విద్యార్థులు సినిమాలకి షికారులకు వెళ్ళి తల్లిదండ్రులను ఫూల్స్ చేస్తుంటారు.
ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులు ఒక రోజులో అయిపోయే పనులు చేయడానికి రోజుల తరబడి తిప్పుతూ ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.
ఎన్నికల్లో రాజకీయ నాయకులు హామీలిచ్చి ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.
విత్తన కంపెని వాడు నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను ఫూల్స్ చేస్తాడు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ కు వెళితే ధళారులు రైతులను ఫూల్స్ చేస్తారు.
- కొందరు డాక్టర్లు రోగులను ఫూల్స్ చేస్తారు.
దొంగ బాబాలు అమాయక భక్తులను ఫూల్స్ చేస్తారు.
కొందరు క్రైస్తవ ఫాదర్ లు తమ గారడీలతో ప్రజలను ఫూల్స్ చేస్తుంటారు.
ఆకరికి రోడ్లమీద పండ్లు అమ్మేవారు కూడా వినియోగదారులకు మంచి పండ్లు చూపించి పాడైపోయిన పండ్లు ఇచ్చి ఫూల్స్ చేస్తుంటారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏప్రిల్ ఫూల్ డేనే ఇంకా కొత్తగా ఎందుకండి ఏప్రిల్ ఫూల్ డే.
సరే ఈ విషయాలన్ని వదిలేయండి ఇవి రోజు జరిగేవే వీటిని ఎవరు మార్చలేరు. ఎందుకంటే మనది భారతదేశం.
మనకు సంవత్సరమంతా ఏప్రిల్ ఫూల్స్ డేనే కనుక ఈ ఒక్కరోజు అయిన అందరూ ఒక మొక్క నాటి
"ఏప్రిల్ ఫూల్ కాదు ఏప్రిల్ కూల్ చేద్దాం".
4 కామెంట్లు:
మంచి మెసేజ్.
🌱👍👌
🌱🌱 🙏🙏
Thank you rao garu
కామెంట్‌ను పోస్ట్ చేయండి