భానోదయం: డిసెంబర్ 2024

13, డిసెంబర్ 2024, శుక్రవారం

అరెస్ట్ చేస్తేనే ఆగమేఘలా మీద స్పందిస్తున్నా సెలెబ్రెటీలు సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి ఎందుకు స్పందించలేదు..

 ఒక హీరోని అరెస్ట్ చేస్తే చాలా మంది హీరోలు, సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అరెస్ట్ అక్రమం అంటు మాట్లాడుతున్నారు. ఒక సెలబ్రిటీని అరెస్టు చేస్తేనే పదిమంది సెలెబ్రెటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మరీ పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది,ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు ఏ హీరో, సెలెబ్రెటీలు ఎందుకు స్పందించలేదు అప్పుడు సెలెబ్రెటీలు  ఎక్కడున్నారు.???


సెలెబ్రెటీల అరెస్టుకే ఇంతలా స్పందిస్తున్నారు ఒక ప్రాణం పోయింది. అప్పుడు ఎందుకు ఒక్కరు కూడా ఆ మహిళ గురించి మాట్లాడలేదు,సహాయం చేయలేదు.

సామాన్యుల ప్రాణాలకు విలువ లేదా..?


 సినిమా వాళ్ళు డబ్బు సంపాదన కోసం ప్రేక్షకులే దేవుళ్ళు మీ వల్లే ఇంత స్థాయికి ఎదిగాం అంటూ మటలు చెబుతారు కాని అదే ప్రేక్షకులకు కష్టం వస్తే ఏ హీరో ఆదుకోడు.. 


సినిమా అనేది వ్యాపారం వ్యాపారాన్ని వ్వాపారంగానే చూడాలి. అంతేకాని సినిమాల్లో చూసి హీరోలని దేవుళ్ళ లా భావించొద్దు.. వీళ్ళు ఎవ్వరిని ఉద్ధరించడానికి సినిమాలు తీయరు. వారి స్వలాభం కోసమే సినిమాలు తీస్తారు.. ప్రేక్షకులు వేల రూపాయల టికెట్  పెట్టి సినిమాలు చూసి వారికి కోట్లు సంపాదించి పెడుతున్నారు. 


సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు. 


ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి సినిమా హీరోలని దేవుళ్ళ లాగా ఆరాదించకండి.

వారు మనలాంటి సామాన్య మనుషులే. ఇంతకూడా మానవత్వంలేని మనుషులు.


అసలు ఏముంది సెలెబ్రెటీల మొహాల్లో..

 ఆ రంగు పూసుకున్న మొహాలను చూడ్డానికి అంతలా ఎగబడతారు ..

వారెమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా.

వాళ్ళకోసం పనులు మానుకొని ఎగబడి వెళతారు. వాళ్ళను చూడకపోతే జీవితంలో అన్ని కోల్పోతాం అని మీద మీద పడి చూస్తారు.. 


మొహానికి రంగు పూసుకుని సినిమాల్లో నీతులు చెప్ఫేవాడు కాదు హీరో. నిజ జీవితంలో పదిమందికి సహాయం చేసేవాడు హీరో..






 




11, డిసెంబర్ 2024, బుధవారం

మరీ ఇంత దిగజారి పోతున్నారు ఏంటీ మీడియా బాబులు..

 ఈమధ్య మీడియా వారు మరీ దిగజారిపోతున్నారు.

మొన్న మోహన్ బాబు గారి కుటుంబంలో ఏదో గొడవ జరిగింది. దాన్ని చూపించేందుకు మీడియా వారి ఉత్సాహం మామూలుగా లేదు. వాళ్ళు కొట్లాడకున్నా మీడియా వారు మధ్యలో దూరి వాళ్ళకు కొట్లాటలు పెట్టి దానిని వీడియో తీసి డబ్బు సంపాదించుకుందాం అని ఒకటే ఆరాటం.. 


అదేదో  రాష్ట్రనికి పెద్ద  సమస్య అయినట్టు మోహన్ బాబు గారింట్లోకి చొచ్చుకెళ్ళి మరీ వీడియోలు తీస్తున్నారు. మీరు కొట్లాడండి మేము వీడియోలు తీసుకుంటాం అని మీడియా వారు మధ్యలో దూరి పోతున్నారు.. 


మోహన్ బాబు గారు మీడియా వారిపైనా చేయి చేసుకున్నారట.  కుటుంబం అన్నాక లక్ష గొడవలు ఉంటాయి ఆ గొడవల మధ్యలో మీడియా వారు వెళితే చేయి చేసుకోకుండా సన్మానం చేస్తారా..


కొంచెమైనా బుద్ది ఉండక్కర్లేదా.. అదే మీడియా వారి కుటుంబలో గొడవలు అయితే లైవ్ టెలికాస్ట్ చేస్తారా..?


రాష్ట్రంలో వేరే సమస్యలు ఏవి లేవా.? మోహన్ బాబు గారి కుటుంబ సమస్య ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్యా..?


మరీ ఇంత దిగజారిపోతున్నారు మీడియా వారు.


గొడవ జరుగుతుంటే ఆపడం మానేసి మీరు గొడవపడండి మేము వీడియోలు తీసి డబ్బు సంపాదించుకుంటాం, మీలాంటి వారు గొడవలు పడితేనే నాలుగు రాళ్ళు సంపాదించుకుని హాయిగా బతికేస్తాం అని మీడియా వారి ఆశ,ఆత్రుత..


కుటుంబ కలహాలు జరిగినప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి వీడియోలు తీస్తేనే ఎవరికైనా చిరాకు వచ్చి చెంప పగలగట్టాలనిపిస్తుంది. అలాంటిది ఓ ఇరవై మంది కెమెరాలు మైకులు పమట్టుకుని వచ్చి మీద పడిపోతే  కొట్టకుండా ఉంటారా.‌..?


రాష్ట్రంలో వేరే ఏ సమస్యలు లేనట్టు ఒక కుటుంబం గొడవ పడుతుంటే మీద పడిపోయి వీడియోలు తీస్తున్నారు. ఇలా తయారయ్యారేంటి మీడియా బాబులు.. నైతిక విలువలు పాటించండి. పరిధులు దాటి ప్రవర్తించంకండి.





6, డిసెంబర్ 2024, శుక్రవారం

అంత పిచ్చి ఎందుకు సినిమా అంటే ?

అంత పిచ్చి ఎందుకు సినిమా అంటే? టికెట్ ధర ఎంతున్నా కొని చూస్తున్నారు. పుష్ప 2 సినిమా టికెట్ ధర 1100 రూపాయలు అదికూడా అర్దరాత్రి షోలు ఒక ఫ్యామిలి సినిమాకు వెళ్తే 5000/- అవుతుంది.ఇంత డబ్బు ఖర్చుపెట్టి రాత్రి సమయంలో సినిమా చూడవలసిన అవసరం ఏముంది. అంత ఆగమేఘాల మీద ఈ సినిమా చూడాల్సిన అవసరం ఏముంది.

 ఇంత టికెట్ ధర పెట్టి సినిమా చూడ్డానికి జనాలు వెళ్తున్నారంటే జనాల్లో సినిమా పిచ్చి మామూలుగా లేదుగా. సినిమా కోసం ఏమైనా చేసేలా ఉన్నారు. వీళ్ళనే ఫ్యాన్సు అంటారేమో.. అందుకే సినిమా హీరోలు నాఫ్యాన్సు నాకు దేవుళ్ళు అంటూ ఉంటారు. నిజమే కదా మరి ఫ్యాన్సు దేవుళ్ళు సినిమా చూడ్డానికి ఎంత టికెట్ ధర ఉన్న సినిమా చూస్తారు రాత్రి పగలు తేడా లేకుండా..

 హీరోలు బాగానే సంపాదించుకుంటారు కాని ఫ్యాన్సు జేబులు గుల్ల చేసుకుంటారు.. 

 నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ పుష్పం2 సినిమాలో అంతగా ఏముందని జనాలు వెర్రెక్కి పోతున్నారు..

 ఒక గంధం చెక్కల దొంగను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు.. ప్రభుత్వం కూడా నేషనల్ అవార్డు ఇచ్చింది ఈ సినిమా హీరోకి. అంటే ఇతన్ని ఆదర్శంగా తీసుకుని గంధం చెక్కల దొంగలు కావాల్నా. 

 అటు ప్రభుత్వానికి బాధ్యత లేదు, ఇటు ప్రజలకు బుద్ది లేదు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడానికి...