వర్షాకాలంలో కరెంట్ తో జాగ్రత్తగా ఉండాలి.
ఫంక్షన్ లు అయినప్పుడు బయట ఫోకస్ లైట్లు లాంటివి పెట్టినప్పుడు వాటికి కనెక్ట్ చేసే వైర్లకు ఎక్కడైనా ఇన్సులేషన్ చెక్ చేసుకోవాలి.
మొన్న నేను ఒక ఫామ్ హౌస్ లో కొత్తగా కొన్ని లైట్లు పెట్టడానికి వెళ్ళాను.
అక్కడ ఒక రూమ్ కు రెండు ఫోకస్ లైట్లు పెట్టారు.
ఆ రూమ్ పైకప్పు ఇనుప పైపులు వేసి పైనా సిమెంట్ పెంకులు వేసారు.
ఆ రూమ్ పైకప్పు ఇనుప పైపులకు ఒక ఫోకస్ లైటు బెండింగ్ వైరు తో కట్టారు.
నేను ఆ ఫామ్ హౌస్ గేటు ముందు నేమ్ ప్లేట్ కోసం కనెక్షన్ ఇవ్వడానికి ప్రహారిగోడ మీదకు ఎక్కి వైరుకు క్లిప్పు లు కొడుతూ ఆ రూము పెంకులకు నా చేతులు తాకాయి షాక్ కొట్టింది.
అదేంటి సిమెంట్ పెంకులు కూడా షాక్ కొడుతుంది అని టెస్టర్ పెట్టి చూసా.
టెస్టర్ లో ఫుల్ పవర్ చూపిస్తుంది.
దీనికి కారణం ఆ గది పైకప్పు ఇనుప పైపులకు కట్టిన లైటు.
ఆ లైటు బాడికి కరెంటు వస్తుంది అది బెండింగ్ వైరు తో గది పైకప్పు ఇనుప పైపులకు కట్టడం వలన పైకప్పు మొత్తం షాక్ కొడుతుంది. వర్షం పడటం వలన పైకప్పు సిమెంటు పెంకులకు కూడా షాక్ కొడుతుంది..
ఇది చిన్న విషయమే అయినా తడిగా ఉన్న ప్రదేశంలో కరెంట్ షాక్ కొడితే చాలా ప్రమాదం..
వర్షాకాలంలో బయట కరెంట్ వైర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి...