భానోదయం

12, నవంబర్ 2024, మంగళవారం

పచ్చని ప్రకృతిని నాశనం చేసే ఫార్మా సిటీలు ఎందుకు?? రైతుల ఆగ్రహం అందుకే..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో

నవంబర్12 సోమవారం అంటే నిన్న వికారాబాద్ కలెక్టర్,సబ్ కలెక్టర్,ఇతర అధికారులపై రైతులు దాడి చేసారు.

ఫార్మా సిటి కోసం భూసేకరణ చేయడానికి రైతులతో మాట్లాడాటానికి వెళ్ళిన అధికారులపై రైతులు దాడి చేసారు. రాళ్ళతో కార్ల అద్దాలు ధ్వంసం చేశారు.

 అధికారలపైనే రైతులు దాడి చేసారంటే అందులోను జిల్లా కలెక్టర్ పై దాడి. రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 

వాళ్ళ ఆగ్రహం మాత్రమే అందరికి కనిపిస్తుంది ఆ ఆగ్రహం వెనక వారి ఆవేదన ఎంతమందికి తెలుస్తుంది.??


రైతుల కోపానికి కారణం ఏంటంటే

ఫార్మా కంపెనీలు వస్తే ఆ ప్రాంతం అంతా కాలుష్యమవుతుంది.గాలి,నీరు,భూమి అన్ని కలుషితమవుతాయి. పచ్చని ప్రకృతి ని నాశనం చేసే ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల భూములు లాక్కుని ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


భూముల ధరలు కోట్లలో పలుకుతుంటే లక్షలో పరిహారం ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు.


భూములు లాక్కుంటే రైతుల ఉపాధి సంగతి ఏంటి?

వారు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి.


ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అంటారు వారు స్థానికులకు ఇచ్చే ఉద్యోగాలు స్వీపర్,లేబర్ ఉద్యోగాలే వెట్టి చాకిరి చేయిస్తారు. అందులో చాలి చాలని వేతనం మనవాళ్ళు ఇలాంటి పని చేయలేక మానేస్తారు వాళ్ళు బిహార్ వాళ్ళను పనిలో పెట్టుకుంటారు రోజుకు 12గంటలు పని చేయించుకుంటారు. స్థానిక ప్రజలు వలసలు వెళ్ళాల్సిందే.


ఉద్యోగాలు పోని భూమికి పరిహారమైనా తగిన విధంగా ఇస్తారా అంటే అదీలేదు. 

ప్రభుత్వం ఎకరా భూమికి ఇచ్చే పరిహారంతో బయట ఎక్కడా 100 గుంట భూమి రాదు.


చాలిచాలని ఆదాయంతో బ్రతుకుతున్న రైతులకు ఎలాంటి సహాయం చేయకపోగా వారి  భూములు లాక్కుని వారి పొట్ట కాడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు??


 టి ఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ను గెలిపించారు రైతులు.

గెలిపించిన పాపానికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మీ భూములు లాగేసుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారు? 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాల వల్ల ఏడాది గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.

కేసీఆర్ పాలనే బాగుండే అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించాం అని జనాలు ఇప్పుడు బాధ పడుతున్నారు.

మరీ ముఖ్యంగా రైతులు.


రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేరలేదు

రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు.


ఒక్క బస్ టికెట్,గ్యాస్ సిలిండర్ తప్ప ఏ హామి నెరవేరలేదు. 


సరే ఇవేమి అక్కర్లేదు ఇవ్వకున్నా పర్వాలేదు. కానీ మా భూములు గుంజుకుని అరకొర పరిహారం ఇచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తే తిరగబడక ఏం చేస్తారు...


ఏ ప్రభుత్వమైనా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవే కాని రైతులు బాగుండాలి వారికి లాభం చేకురాలని ఏప్రభుత్వం, ఏ నాయకుడు ఆలోచించడు.


 రైతుల భూములు లాక్కోవాలి వారిని తరిమి వేయాలి అని చూస్తారే తప్పా వారికి మంచి చేయరు. ఎందుకంటే రైతులు బలహీనులు వారి తరపున అడిగే వారు ఎవరు ఉండరు అందుకే రైతులపై పడి వారి పొట్ట కొడతారు మన గొప్ప నాయకులు..


ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం ఒక ఏడాది గడవకముందే...




10, నవంబర్ 2024, ఆదివారం

హోటల్లో ఆహారం అంత టేస్టీగా ఎందుకుంటాయబ్బా.?

 ఈ రోజు సండే హోటల్లో తిందాం . ఆ హోటల్లో రుచి చాలా టేస్టీగా ఉంటుంది...

ఇంట్లో కంటే హోటల్లో వంటలు అంత టేస్టీగా ఎందుకుంటాయబ్బా...


ఎందుకంటే 

కుళ్ళిపోయిన కూరగాయలు,..

బూజు పట్టిన అల్లంవెల్లుల్లి,..

గడువు తీరిన మసాలాలు,..

జిడ్డుపట్టిన వంటపాత్రలు,..

తారు లాంటి మంచి నూనె,.. 

బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేసే వంటగది,..

పాన్ పరాగ్ నములుతూ...  వంట చేసే వంట మాస్టార్...


ఇవన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తే బాయట పడ్డ టేస్టీ సీక్రెట్స్...


ఇంత కళాత్మకంగా చేయడం వల్లే బయట హోటల్లో ఆహారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇలా చేయడం సాధ్యం కాదు కాబట్టి.

జనాలు హోటల్లో ఎగబడి తింటారు..


ఇలా అన్ని హోటల్లో ఉంటుందని కాదు కొన్ని హోటల్ వాళ్ళు చాలా శుభ్రంగానే చేస్తారు.