పర్యావరణానికి ప్లాస్టిక్ వల్ల కలిగే ముప్పు అంత ఇంత కాదు అన్ని విదాలుగా కాలుష్యం కలిగించే ప్లాస్టక్ ను నిషేదించాలని నేను ఎన్నో రోజులుగా ఆకాంక్షిస్తున్నాను.
ఇప్పుడిప్పుడే పాలకులు దీనిపై దృష్టి సారించినట్టున్నారు
ఈ రోజు మా మున్సిపాలిటీలో నోటీసు లు అందజేసారు.
ప్లాస్టిక్ నిషేదాన్ని కఠినంగా అమలు చేస్తారా లేదా కేవలం కాగితాలకే పరిమితం అవుతుందో చూడాలి.
ఏది ఏమైనా పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పు నుండి కాపాడే మార్పు ఆరంభం అయ్యిందని సంతోషిస్తున్నాను.
ఇలా ప్రతీచోట ప్లాస్టిక్ నిషేదాన్ని అమలు పరచాలని కోరుకుంటున్నాను.
కొంచెం బద్దకాన్ని వదిలి ప్రతీ ఒక్కరు ఇంటినుండి బజారుకి కూరగాయలకి, కిరాణ కొట్టుకి వెళ్ళేటప్పుడు చేతిసంచులు తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు.
"ప్లాస్టిక్ వాడాకాన్ని నిషేదిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం"
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి