గోధుమ గడ్డి |
గోధుమ గడ్డి పెంచే విధానం:-
ఒక కప్పు గోధుమలు తీసుకుని కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి 12 గంటలు నానబెట్టాలి.
12 గంటలు నానిన తర్వాత నీళ్ళు ఒంపేసి ఒకసారి కడిగి ఒక కాటన్ గుడ్డలో మూటకట్టి ఒకరోజు ఉంచాలి.
తర్వాత ఒక ప్లాస్టిక్ ట్రే తీసుకుని దానికి అడుగు భాగంలో రంధ్రాలు చేయాలి. అందులో సగం వరకు మట్టిని పోయాలి. ఈ మట్టిలో వర్మీ కంపోస్టు ఎరువు కలుపుకుంటే గడ్డి బాగా వస్తుంది.
మట్టి పోసిన తర్వాత మొలకెత్తిన గోధుమలను ప్లాస్టిక్ ట్రే లో ఒత్తుగా వేయాలి. అలా వేసిన తర్వాత పైనుండి గోధుమలు మునిగేలా మట్టిని పోసి నీళ్ళు పొయ్యాలి.
ఈ ట్రేను నీడలో ఉంచాలి.
ఉదయం సాయంత్రం వేళల్లో నీటిని చిలకరించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి