భానోదయం: సామజవరగమన సిద్ శ్రీరామ్

1, అక్టోబర్ 2019, మంగళవారం

సామజవరగమన సిద్ శ్రీరామ్


 

             కొందరు గాయకులు పాడిన పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది. వారు ఏ పాట పాడిన వినసొంపుగా ఉంటుంది. అలాంటి వారిలో "సిద్ శ్రీరామ్" ఒకరు. ఇంతకు ముందు ఈయన పాడిన పాటలు పెద్ద హిట్టయ్యాయి. అందులో
నువ్వుంటే నా జతగా,
ఉండిపోరాదే గుండె నీదేలే,
ప్రేమ ఓ ప్రేమ,
వెళ్ళిపోమాకే,
మాటే వినదుగా,
ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే, లాంటి పాటలు ఎంత హిట్టయ్యాయో మనకు తెలుసు.
ఇప్పుడు "సామజవరగమన" అంటు మళ్ళీ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు.

      సామజవరగమన పాట చాలా బాగుంది. ఈ పాట ఇంత బాగా రావడానికి కారణం ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్. ఈయన ఏపాట పాడిన మాధుర్యంగా ఉంటుంది. ఆయన గాత్రంలో పాట వింటుంటే ఎవరైనా మైమరచిపోవలసిందే. సామజవరగమన పాట కూడా చాలా బాగా పాడారు సిద్ శ్రీరామ్ గారు.
ఈ పాట బాగా రావడానికి కారణమైన ఇంకో వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.  ఒక్క పదం ఇతర భాషా పదాలను ఉపయోగించకుండా అచ్చతెలుగులో,అర్థవంతమైన తేలిక పదాలతో అద్భుతంగా ఈ పాట రాశారు.

ఇక తమన్ సంగీతం గురించి చెప్పనక్కర్లేదు. లౌడ్ స్పీకర్ మోత మోగినట్టు తమన్ సంగీతం ఎవరికి అర్థం కాకపోయినా... సిద్ శ్రీరామ్, సీతారామశాస్త్రి గారి వల్ల ఈ పాట చాలా బాగా వచ్చింది.



 సామజవరగమన

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఏదో విదేశీ భాషలో పాడినట్టుగా ఉంది. సిద్ధు శ్రీరాం మంచి గాయకుడే కానీ సినిమా పాటలకు అతని గొంతు బాగుండదు. ఎడతెరిపిలేకుండా గుక్కతిప్పుకోకుండా ఉండే పాట బాణీ వల్ల సాహిత్యం శ్రోతలకు అర్థం కాకుండా పోతుంది. పాట పదాల మధ్యలో విరామం సంగీతం బిట్లు ఉంటేనే పాటకి అందం.

భానోదయం చెప్పారు...

పాటలకు బాణీలు అందించేది సంగీత దర్శకుడు.గాయకుడు కాదు...