మనం తినే వంటనూనెలు అంతా కల్తీయేనా??
నేను చాలాసార్లు దీని గురించి విన్నా..
ఒక లీటరు వేరుశనగ నూనె ప్రస్తుతం 150/- రూపాయలు
ఒక లీటరు వేరుశనగ నూనెకోసం ఎన్ని కిలోల వేరుశనగలు అవసరం అవుతాయి..
దాదాపు 4కిలోల వేరుశనగలు మరపట్టిస్తే ఒక లీటరు నూనె వస్తుంది.
ఒక కిలో వేరుశనగలు 150 రూపాయలు, 4కిలోలకి 600 రూపాయలు అయితే, 600 రూపాయలకు లీటరు నూనె ఉండాలి మరి 150రూపాయలకు ఎలా అమ్ముతున్నారు.?
గానుగ నుండి తీసిన తవుడు అమ్ముకున్నా 500 రూపాయలన్నా ధర ఉండాలి. కాని 150కే ఎలా అమ్ముతున్నారు..? అది మంచినూనె నా లేదా ఇంకేమైనా కలుపుతున్నారా..?
ఇవన్ని ఎవరు పట్టించుకోరు మనకెందుకులే అని వదిలేస్తుంటారు. అందరు అలాగే తింటున్నారు మనం అలాగే తిందాం అంటారు. మరికొందరు మనం చెబితే ఎవరు వింటారు అని కొంచెం జాగ్రత్తగా మంచి ఆహారం తింటారు.
నిజమే ఎవరు చెబితే ఎవరూ వినరు.
మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే వంటనూనెల విషయంలో జాగ్రత్త వహించాలి. మనమే స్వయంగా వేరుశనగలు కొని గానుగ లో వేయించి నూనె తీసుకోవాలి అప్పుడే మనకు స్వచ్ఛమైన మంచి నూనె లభిస్తుంది.
ఈ కల్తీ నూనెలు తిని ఆరోగ్యం పాడుచేసుకునే బదులు కొంచెం కష్టమైనా దగ్గరుండి గానుగ లో నూనెలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది..
ఒక్క నూనె విషయంలోనే కాదు తినే ఆహారపదార్థాలు అన్నింటిని దగ్గరుండి మర పట్టించాల్సిందే. పిండి,కారం,పసుపు,అల్లం వెల్లుల్లి ఇలా అన్ని మనం దగ్గరుండి మర పట్టించాల్సిందే..
8 కామెంట్‌లు:
అయ్యా! ఇంట్లో వంట చేసుకోడానికే తీరుబడి లేక బయటి నుంచి పాచిపోయిన కూడు/ఎంగిలి కూడు/చద్ది కూడు మళ్ళీ వేడి చేసి తెచ్చి ఇస్తే తినే రోజుల్లో నూనె గానుగు ఆడించుకోమని చెబితే వినేవారు లేరు సార్! మనల్ని పిచ్చివాళ్ళలా చూస్తారు. నేను చెప్పి,చెప్పి అలసిపోయి మానేసాను, సరే మీ ప్రయత్నం చెయ్యండి, శుభమస్తు.
ఇలా అన్నానని ఏమనుకోవద్దూ!
మన ప్రయత్నం మనం చేద్దాం సార్.. వింటే మంచిది వినకపోతే ఎవరి ఖర్మ వారిది.
ఇప్పుడు అంతా స్విగ్గి,జోమాటో కాలం తినడానికే సమయం లేదు ఇక వంట చేసుకోవడానికి సమయం ఎక్కడిది అంటారు..
మనం తినే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది దానిమీద శ్రద్ద లేకుంటే ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది.
కోటి విద్యలు కూటి కొరకే అన్నారు..మంచి కూటికోసం సమయం కేటాయించకుంటే ఎలా??
పిచ్చోల్లు
మన ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం,మానసిక ఆరోగ్యం, మసుంటుంది, మనసును బట్టి మన చర్యలుంటాయి. చర్యల్ని బట్టి ఫలితాలుంటాయి.సత్వ,రజస్,తమో గుణాలు తీసుకునే ఆహారాన్ని బట్టి ఏర్పడతాయి. కల్తీ రోజులు సార్!
ఆహారం పట్ల అవగాహన లేని వారు పిచ్చివాల్లే..
డబ్బు వ్యామోహంలో పడి ప్రతీది కల్తీ చేస్తున్నారు. జనాలు సమయం లేదు అని ఏది పడితే అదే తింటున్నారు..
ఉత్తర భారత దేశం లో కచ్చీ ఘనీ తేల్ అని గానుగ పట్టిన ఆవనూనె వంటలలో ఉపయోగిస్తున్నారు.
మీరు చెప్పింది నిజం. గానుగ ఆడించిన వేరుశనగా నూనే శ్రేష్ఠం. అయితే ధర ఎక్కువ కాబట్టి అందరూ ప్యాకెట్ నూనే వాడుతున్నారు. అందులో ఇతర నూనెలు కలుపుతారు అని వినికిడి.
తక్కువ ధరలో వస్తుందని కల్తీ నూనెలు వాడి తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి