భానోదయం: పచ్చని ప్రకృతిని నాశనం చేసే ఫార్మా సిటీలు ఎందుకు?? రైతుల ఆగ్రహం అందుకే..

12, నవంబర్ 2024, మంగళవారం

పచ్చని ప్రకృతిని నాశనం చేసే ఫార్మా సిటీలు ఎందుకు?? రైతుల ఆగ్రహం అందుకే..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో

నవంబర్12 సోమవారం అంటే నిన్న వికారాబాద్ కలెక్టర్,సబ్ కలెక్టర్,ఇతర అధికారులపై రైతులు దాడి చేసారు.

ఫార్మా సిటి కోసం భూసేకరణ చేయడానికి రైతులతో మాట్లాడాటానికి వెళ్ళిన అధికారులపై రైతులు దాడి చేసారు. రాళ్ళతో కార్ల అద్దాలు ధ్వంసం చేశారు.

 అధికారలపైనే రైతులు దాడి చేసారంటే అందులోను జిల్లా కలెక్టర్ పై దాడి. రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 

వాళ్ళ ఆగ్రహం మాత్రమే అందరికి కనిపిస్తుంది ఆ ఆగ్రహం వెనక వారి ఆవేదన ఎంతమందికి తెలుస్తుంది.??


రైతుల కోపానికి కారణం ఏంటంటే

ఫార్మా కంపెనీలు వస్తే ఆ ప్రాంతం అంతా కాలుష్యమవుతుంది.గాలి,నీరు,భూమి అన్ని కలుషితమవుతాయి. పచ్చని ప్రకృతి ని నాశనం చేసే ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల భూములు లాక్కుని ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


భూముల ధరలు కోట్లలో పలుకుతుంటే లక్షలో పరిహారం ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు.


భూములు లాక్కుంటే రైతుల ఉపాధి సంగతి ఏంటి?

వారు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి.


ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అంటారు వారు స్థానికులకు ఇచ్చే ఉద్యోగాలు స్వీపర్,లేబర్ ఉద్యోగాలే వెట్టి చాకిరి చేయిస్తారు. అందులో చాలి చాలని వేతనం మనవాళ్ళు ఇలాంటి పని చేయలేక మానేస్తారు వాళ్ళు బిహార్ వాళ్ళను పనిలో పెట్టుకుంటారు రోజుకు 12గంటలు పని చేయించుకుంటారు. స్థానిక ప్రజలు వలసలు వెళ్ళాల్సిందే.


ఉద్యోగాలు పోని భూమికి పరిహారమైనా తగిన విధంగా ఇస్తారా అంటే అదీలేదు. 

ప్రభుత్వం ఎకరా భూమికి ఇచ్చే పరిహారంతో బయట ఎక్కడా 100 గుంట భూమి రాదు.


చాలిచాలని ఆదాయంతో బ్రతుకుతున్న రైతులకు ఎలాంటి సహాయం చేయకపోగా వారి  భూములు లాక్కుని వారి పొట్ట కాడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు??


 టి ఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ను గెలిపించారు రైతులు.

గెలిపించిన పాపానికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మీ భూములు లాగేసుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారు? 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాల వల్ల ఏడాది గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.

కేసీఆర్ పాలనే బాగుండే అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించాం అని జనాలు ఇప్పుడు బాధ పడుతున్నారు.

మరీ ముఖ్యంగా రైతులు.


రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేరలేదు

రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు.


ఒక్క బస్ టికెట్,గ్యాస్ సిలిండర్ తప్ప ఏ హామి నెరవేరలేదు. 


సరే ఇవేమి అక్కర్లేదు ఇవ్వకున్నా పర్వాలేదు. కానీ మా భూములు గుంజుకుని అరకొర పరిహారం ఇచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తే తిరగబడక ఏం చేస్తారు...


ఏ ప్రభుత్వమైనా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవే కాని రైతులు బాగుండాలి వారికి లాభం చేకురాలని ఏప్రభుత్వం, ఏ నాయకుడు ఆలోచించడు.


 రైతుల భూములు లాక్కోవాలి వారిని తరిమి వేయాలి అని చూస్తారే తప్పా వారికి మంచి చేయరు. ఎందుకంటే రైతులు బలహీనులు వారి తరపున అడిగే వారు ఎవరు ఉండరు అందుకే రైతులపై పడి వారి పొట్ట కొడతారు మన గొప్ప నాయకులు..


ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం ఒక ఏడాది గడవకముందే...




12 కామెంట్‌లు:

sarma చెప్పారు...

పరిశ్రమలు (కార్పొరేట్లు)-ప్రభుత్వం-ప్రజలు-భూమి ఇదొక వలయం. దీనిమీద చర్చోపచర్చలు చేసేసేరు,మేధావులు,అతిమేధావులు,మహామేధావులు,పార్టీలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే జరుగుతున్నది కాని మార్పు రావటం లేదు. సమస్య ఒక చోటినుంచి మరో చోటికి మారుతోందేమో,అంతే!
ఇప్పుడు ఈ సమస్య కూడా ఆ చర్చలోకొచ్చే ఒక భాగమేననుకుంటా. నేను పైన పేర్చొకొన్నవారిలో ఎవరినీ కాను.
ప్రస్థుతం కలక్టర్ భూసేకరణ కోసం ప్రజలతో మాట్లాడడానికి వచ్చినట్టుంది. అప్పటికే ఎంతో కొంత గ్రంధం జరుగుంటుంది. దాని గురించి తెలియదు. ఇక రైతుల ఆగ్రహం లో అర్ధం ఉంది,కాదనలేని సత్యం, కాని కలక్టర్ మరియు ఉద్యోగుల మీద దాడి,ప్రభుత్వ ఆస్థికి నష్టం చేయడం హర్షనీయమా? అన్నది కూడా చర్చించలేను. కాని రైతులు ఒక సమస్యనుంచి మరొక సమస్యలో కూరుకుపోతున్నట్టుంది. కలక్టర్పై దాడి చేసినంతలో భూసేకరణ ఆగుతుందా? ఇది సాకుగా చూపి మరికొంత ముందు కెళుతుంది. సమస్య మరుగున పడుతుంది. ప్రభుత చూస్తూ ఊరుకోదు, పోలిస్ కేసులు, ఆపై కోర్టులు, కేసులపై మరల ఆందోళన ఇదొక విష వలయం ఐ పోవచ్చు. కొంతమంది ఆందోళన జీవులకు ఇదే కావాలి. ఆ ఆందోళన జీవుల వలలో రైతులుగాని చిక్కుకుని ఉంటే ఆపైవాడే రక్ష.

అజ్ఞాత చెప్పారు...

అభివృద్ధి, పరిశ్రమలు, రహదారులు, కొత్త నగరాలు, విమానాశ్రయాలు, - ఇలా అనేక మార్గాలలో వ్యవసాయ భూములను కోల్పోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత సంభవించే ప్రమాదం ఉంది.

Conversion of fertile lands in the name of development, industries, new cities etc should be done only if absolutely necessary. We are a country of 1.5 billion people. Protection of agricultural lands and food safety must be given top priority.

Once agricultural land is lost, very difficult to reclaim it.

అజ్ఞాత చెప్పారు...

When Jagan didn't bring any industries to AP, people criticized him for not bringing the industries and employment. When Revanth is trying to bring industries, he is being criticized. We can't bring only IT industries always and everywhere. Didn't we build nuclear power plants knowing that they can cause problems? You can't have your cake and eat it too.

భానోదయం చెప్పారు...

ఇండస్ట్రీలు పెట్టాలి ఉపాధి కల్పించాలి కాదనట్లేదు. పచ్చని పంట పొలాలను కాకుండా రాళ్ళు భూముల్లో కంపెనీలు పెట్టాలి. మరియు భూములు కోల్పోయిన రైతులకు వేరేచోట అంతే భూమి ఇవ్వాలి లేదా అలా ఇవ్వకుండా కేవలం ఓ పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ఆ పది లక్షల్లో ఎలా బ్రతుకుతారు...

sarma చెప్పారు...

భానోదయం గారు,
నా సందేహాలకి సమాధానాలు లేవు.
నేల,నీరు,కరంటు అందుబాటులో ఉంచుతామని కార్పొరేట్లని పరిశ్రమలు పెట్టమని ప్రభుతలు కోరుతున్నాయి. రాళ్ళ భూమిలో నీళ్ళుండవు. అటువంటి చోట పరిశ్రమకి సిద్ధమైన ఒక వ్యాపారవేత్తను ఆందోళన జీవులు పెట్టిన బాధలు దగ్గరగా చూసాను.
భూ సేకరణకు కేంద్రం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టమే మెరుగైనది అని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఆ చట్టాన్ని ఈ రాష్ట్రం ఆమోదించిందా?
ఇదంతా అనవసరం పచ్చటిపొలాల్లో పరిశ్రమ పెట్టకూడదు, ఇదే మా మాట ఫైనల్,ఎవరొచ్చినా దాడి చేస్తాం అంటారా? సమస్య ఆందోళన జీవుల చేతిలోకి పోయింది. కాలమే పరిష్కారం చెబుతుంది.
ఇంతతో నా మాట విరమిస్తున్నా!
శలవు.

sarma చెప్పారు...

భానోదయం గారు,
నా సందేహాలకి సమాధానాలు లేవు.
నేల,నీరు,కరంటు అందుబాటులో ఉంచుతామని కార్పొరేట్లని పరిశ్రమలు పెట్టమని ప్రభుతలు కోరుతున్నాయి. రాళ్ళ భూమిలో నీళ్ళుండవు. అటువంటి చోట పరిశ్రమకి సిద్ధమైన ఒక వ్యాపారవేత్తను ఆందోళన జీవులు పెట్టిన బాధలు దగ్గరగా చూసాను.
భూ సేకరణకు కేంద్రం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టమే మెరుగైనది అని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఆ చట్టాన్ని ఈ రాష్ట్రం ఆమోదించిందా?
ఇదంతా అనవసరం పచ్చటిపొలాల్లో పరిశ్రమ పెట్టకూడదు, ఇదే మా మాట ఫైనల్,ఎవరొచ్చినా దాడి చేస్తాం అంటారా? సమస్య ఆందోళన జీవుల చేతిలోకి పోయింది. కాలమే పరిష్కారం చెబుతుంది.
ఇంతతో నా మాట విరమిస్తున్నా!
శలవు.

sarma చెప్పారు...

వ్యాఖ్య మీకు చేరలేదేమోనని మరల వేస్తున్నాను. ప్రచురించడం మానెయ్యడమన్నది మీ ఇష్టం,ప్రచురించాలని బలవంతం చేయను. మీకు సమస్య తెలిస్తే చాలును అన్నదే నా మాట.
శలవు

భానోదయం చెప్పారు...

ఈరోజు వేరే ఊరు వెళ్ళడం వలన మీ వాఖ్యలు చూడలేదు..

భానోదయం చెప్పారు...

దాడి కావాలని ఎవరు చేయరు వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళన. ఇంతకు ముందు కెసీఆర్ ప్రభుత్వం లో కూడా ప్రాజెక్టుల కోసం ఊళ్ళను ఖాళీ చేయించి అరకొర సాయం చేసి పంపించారు...

అజ్ఞాత చెప్పారు...

According to a govt. site, https://irrigationap.cgg.gov.in/wrd/static/approjects/polavaramnew.html:
Under the Reservoir a total number of 222 Revenue Villages will get submerged, in Andhra Pradesh. 10 villages in Chhattisgarh and 7 villages in Odisha will be protected by Flood Banks.

భానోదయం చెప్పారు...

https://youtu.be/AIr0-lpmnE4?si=fszsKZHP4R9GUasf

భానోదయం చెప్పారు...

https://youtu.be/AIr0-lpmnE4?si=fszsKZHP4R9GUasf