ఇంత టికెట్ ధర పెట్టి సినిమా చూడ్డానికి జనాలు వెళ్తున్నారంటే జనాల్లో సినిమా పిచ్చి మామూలుగా లేదుగా.
సినిమా కోసం ఏమైనా చేసేలా ఉన్నారు. వీళ్ళనే ఫ్యాన్సు అంటారేమో.. అందుకే సినిమా హీరోలు నాఫ్యాన్సు నాకు దేవుళ్ళు అంటూ ఉంటారు. నిజమే కదా మరి ఫ్యాన్సు దేవుళ్ళు సినిమా చూడ్డానికి ఎంత టికెట్ ధర ఉన్న సినిమా చూస్తారు రాత్రి పగలు తేడా లేకుండా..
హీరోలు బాగానే సంపాదించుకుంటారు కాని ఫ్యాన్సు జేబులు గుల్ల చేసుకుంటారు..
నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ పుష్పం2
సినిమాలో అంతగా ఏముందని జనాలు వెర్రెక్కి పోతున్నారు..
ఒక గంధం చెక్కల దొంగను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు.. ప్రభుత్వం కూడా నేషనల్ అవార్డు ఇచ్చింది ఈ సినిమా హీరోకి. అంటే ఇతన్ని ఆదర్శంగా తీసుకుని గంధం చెక్కల దొంగలు కావాల్నా.
అటు ప్రభుత్వానికి బాధ్యత లేదు, ఇటు ప్రజలకు బుద్ది లేదు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడానికి...
9 కామెంట్లు:
మూడేళ్ళు ఆగిన వాళ్ళు మూడు వారాలు అగలేరా?
OTT లో చూడవచ్చు కదా!
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అంతే చూడకపోతే చాలా నష్టపోతారు జీవితంలో..
అసలు ఈ పుష్పం2 సినిమాలో అంతగా ఏముందని జనాలు వెర్రెక్కి పోతున్నారు..
డబ్బుల్స్ ఖర్చెట్టేసుకుని చూస్తే తెలుస్తదండి.
10రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కి 10రూపాయలే పెట్టి కొనాలి 100రూపాయలు కాదు .. 100రూ టికెట్ 1000రూ అవసరమా...
ఎర్రచందనం దుంగలు స్మగ్లర్ కథ పుష్ప సినిమా. త్వరలో డాకూ మహారాజ్ అనే సినిమా వస్తుంది. యానిమల్ సినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది. ప్రస్తుతం తామసిక బీభత్స భయానక జుగుప్స కథల సినిమాలు బాగా పోతున్నాయి.
ఫాన్స్ తో పాటు చాలా మంది ఎగబడి చూస్తున్నారు.
బోనగిరి గారు. AA చెప్పిన మాటను తిరిగి సూపర్ గా చెప్పారు. 👌
అంతేగా మరీ.. కోట్ల రూపాయలు ఉన్నోళ్ళే పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కు పది రూపాయలకంటే ఒక్క రూపాయి ఎక్కువ పెట్టి కొనం అన్నప్పుడు సామాన్య జనం 100 రూ. టికెట్ 1000 పెట్టి ఎందుకు కొనాలి..
ఈ సినిమా మీద ఆవేశంగా, లాజిక్ లతో చేస్తున్న కామెంట్స్, డిబేట్స్ చూశాను. అందులో సమాజంలో ప్రముఖులుగా, తెలివైన వాళ్లుగా ప్రచారం పొందుతున్న వాళ్ళూ ఉన్నారు. అందరూ చేసే ప్రధాన విమర్శ - ఒక స్మగ్లర్ ని హీరోగా చూపిస్తే యువత ఏమి నేర్చుకుంటుంది? తప్పకుండా పాడై పోతుంది అని. పైపైన చూస్తే మంచి లాజిక్ . ఇది ఒక సినిమా. నచ్చితే చూస్తాం. లేకపోతే లేదు. కానీ నిజ జీవితంలో జరుగుతున్నదేమిటి? అక్రమ మైన్స్ తో స్వాతంత్రం వచ్చినప్పటి నించీ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న నేరస్థులు, నేతల్ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? ఎర్ర చందనం స్మగ్లర్లు కొంతమంది టీటీడీ మెంబర్లు కూడా అయ్యారని వార్తలు వచ్చాయి. అప్పుడు ఏమయ్యారు ఈ మేధావులు? లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా కుటుంబాలు రాజకీయాల్లో చక్రం తిప్పి సీఎంలు అవుతుంటే, అన్నీ తెలిసిన “మేధావులు”, టీచర్లు, అధికారులు,పోలీసులు పిల్లలకి గత కొన్ని దశాబ్దాలుగా ఆ నేతల గురించి ఏమి చెప్తున్నారు - గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మహా నేత, రైతు బంధు, విజనరీ, సంక్షేమ ప్రదాత…ఇలాంటి మాటలు పిల్లలతో పాఠశాలల కార్యక్రమాల్లో చెప్పిస్తున్నారు. అది ఈ మేధావులకి కనపడడం లేదా? లేక భయమా? కల్పిత పాత్ర ఏదో ప్రభావితం చేస్తుంది అని బోలెడు బాధ పడుతున్నవారు - సీబీఐ కేసుల్లో బెయిలు మీద ఉన్న వారికి, హత్య కేసుల్లో నిందితులకు స్కూలు పిల్లలకి “నిజాలు” చెప్పకుండా ఉండడం ఏ రకం ఆత్మవంచన?
తెరమీద హీరోయిజం చూపించేవారినే యువత ఫాలో అవుతారు. పుష్ప పాత్రను ఎందరో చిన్నారులు,యువత తమకు తాము పుష్పాల ఊహించుకుని రీల్స్ చేస్తున్నారు. ఈ పాత్ర సమాజంలో ఒక బలమైన ముద్ర వేసింది. కారణం మంచి కంటే చెడుకే ప్రాధాన్యత ఇస్తారు జనాలు.. మంచి సినిమా పాత్రలు అంతగా జనాలను ఆకర్షించవు. పైగా ఇలాంటి సినిమాలకు జాతీయ అవార్డు ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చెసుకుంటారంటే స్మగ్లింగ్ అనేది తప్పు కాదు అనుకుంటారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి