ఈమధ్య మీడియా వారు మరీ దిగజారిపోతున్నారు.
మొన్న మోహన్ బాబు గారి కుటుంబంలో ఏదో గొడవ జరిగింది. దాన్ని చూపించేందుకు మీడియా వారి ఉత్సాహం మామూలుగా లేదు. వాళ్ళు కొట్లాడకున్నా మీడియా వారు మధ్యలో దూరి వాళ్ళకు కొట్లాటలు పెట్టి దానిని వీడియో తీసి డబ్బు సంపాదించుకుందాం అని ఒకటే ఆరాటం..
అదేదో రాష్ట్రనికి పెద్ద సమస్య అయినట్టు మోహన్ బాబు గారింట్లోకి చొచ్చుకెళ్ళి మరీ వీడియోలు తీస్తున్నారు. మీరు కొట్లాడండి మేము వీడియోలు తీసుకుంటాం అని మీడియా వారు మధ్యలో దూరి పోతున్నారు..
మోహన్ బాబు గారు మీడియా వారిపైనా చేయి చేసుకున్నారట. కుటుంబం అన్నాక లక్ష గొడవలు ఉంటాయి ఆ గొడవల మధ్యలో మీడియా వారు వెళితే చేయి చేసుకోకుండా సన్మానం చేస్తారా..
కొంచెమైనా బుద్ది ఉండక్కర్లేదా.. అదే మీడియా వారి కుటుంబలో గొడవలు అయితే లైవ్ టెలికాస్ట్ చేస్తారా..?
రాష్ట్రంలో వేరే సమస్యలు ఏవి లేవా.? మోహన్ బాబు గారి కుటుంబ సమస్య ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్యా..?
మరీ ఇంత దిగజారిపోతున్నారు మీడియా వారు.
గొడవ జరుగుతుంటే ఆపడం మానేసి మీరు గొడవపడండి మేము వీడియోలు తీసి డబ్బు సంపాదించుకుంటాం, మీలాంటి వారు గొడవలు పడితేనే నాలుగు రాళ్ళు సంపాదించుకుని హాయిగా బతికేస్తాం అని మీడియా వారి ఆశ,ఆత్రుత..
కుటుంబ కలహాలు జరిగినప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి వీడియోలు తీస్తేనే ఎవరికైనా చిరాకు వచ్చి చెంప పగలగట్టాలనిపిస్తుంది. అలాంటిది ఓ ఇరవై మంది కెమెరాలు మైకులు పమట్టుకుని వచ్చి మీద పడిపోతే కొట్టకుండా ఉంటారా...?
రాష్ట్రంలో వేరే ఏ సమస్యలు లేనట్టు ఒక కుటుంబం గొడవ పడుతుంటే మీద పడిపోయి వీడియోలు తీస్తున్నారు. ఇలా తయారయ్యారేంటి మీడియా బాబులు.. నైతిక విలువలు పాటించండి. పరిధులు దాటి ప్రవర్తించంకండి.
3 కామెంట్‌లు:
మీడియా సగం పంది సగం కుక్క మాదిరి. అదే బురదలో అందరినీ దొర్లమంటుంది. ఎన్ని సుద్దులు చెప్పినా కుక్క తోక మాదిరి దాని వంకర మారదు.
ప్రస్తుతం మీడియా వల్ల ఉపకారం కన్న అపకారం ఎక్కువ గా ఉంది. పైగా ఎదుటివారికి నీతులు చెప్పడం లో ముందుంటారు. 24 గంటలు న్యూస్ చానల్స్ వచ్చినప్పటి నుంచి పరిస్థితి దిగజారి పోయింది.
Well said
కామెంట్‌ను పోస్ట్ చేయండి