భానోదయం: అరెస్ట్ చేస్తేనే ఆగమేఘలా మీద స్పందిస్తున్నా సెలెబ్రెటీలు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గురించి ఎందుకు స్పందించలేదు..

13, డిసెంబర్ 2024, శుక్రవారం

అరెస్ట్ చేస్తేనే ఆగమేఘలా మీద స్పందిస్తున్నా సెలెబ్రెటీలు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గురించి ఎందుకు స్పందించలేదు..

 ఒక హీరోని అరెస్ట్ చేస్తే చాలా మంది హీరోలు, సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అరెస్ట్ అక్రమం అంటు మాట్లాడుతున్నారు. ఒక సెలబ్రిటీని అరెస్టు చేస్తేనే పదిమంది సెలెబ్రెటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మరీ పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది,ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు ఏ హీరో, సెలెబ్రెటీలు ఎందుకు స్పందించలేదు అప్పుడు సెలెబ్రెటీలు  ఎక్కడున్నారు.???


సెలెబ్రెటీల అరెస్టుకే ఇంతలా స్పందిస్తున్నారు ఒక ప్రాణం పోయింది. అప్పుడు ఎందుకు ఒక్కరు కూడా ఆ మహిళ గురించి మాట్లాడలేదు,సహాయం చేయలేదు.

సామాన్యుల ప్రాణాలకు విలువ లేదా..?


 సినిమా వాళ్ళు డబ్బు సంపాదన కోసం ప్రేక్షకులే దేవుళ్ళు మీ వల్లే ఇంత స్థాయికి ఎదిగాం అంటూ మటలు చెబుతారు కాని అదే ప్రేక్షకులకు కష్టం వస్తే ఏ హీరో ఆదుకోడు.. 


సినిమా అనేది వ్యాపారం వ్యాపారాన్ని వ్వాపారంగానే చూడాలి. అంతేకాని సినిమాల్లో చూసి హీరోలని దేవుళ్ళ లా భావించొద్దు.. వీళ్ళు ఎవ్వరిని ఉద్ధరించడానికి సినిమాలు తీయరు. వారి స్వలాభం కోసమే సినిమాలు తీస్తారు.. ప్రేక్షకులు వేల రూపాయల టికెట్  పెట్టి సినిమాలు చూసి వారికి కోట్లు సంపాదించి పెడుతున్నారు. 


సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు. 


ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి సినిమా హీరోలని దేవుళ్ళ లాగా ఆరాదించకండి.

వారు మనలాంటి సామాన్య మనుషులే. ఇంతకూడా మానవత్వంలేని మనుషులు.


అసలు ఏముంది సెలెబ్రెటీల మొహాల్లో..

 ఆ రంగు పూసుకున్న మొహాలను చూడ్డానికి అంతలా ఎగబడతారు ..

వారెమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా.

వాళ్ళకోసం పనులు మానుకొని ఎగబడి వెళతారు. వాళ్ళను చూడకపోతే జీవితంలో అన్ని కోల్పోతాం అని మీద మీద పడి చూస్తారు.. 


మొహానికి రంగు పూసుకుని సినిమాల్లో నీతులు చెప్ఫేవాడు కాదు హీరో. నిజ జీవితంలో పదిమందికి సహాయం చేసేవాడు హీరో..






 




13 కామెంట్‌లు:

phani చెప్పారు...

I feel like it's a publicity stunt.Not sure though.

భానోదయం చెప్పారు...

Why more publicity?

అజ్ఞాత చెప్పారు...

మన దేశం లో తొక్కిసలాట సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. ఇరుకుగా ఉన్న వెన్యూస్, గేట్లు మూసి ఒక్కసారి తెరవడం, క్యూ లైన్లు, రాజకీయ, సాంఘిక, మత, సినిమా ఈవెంట్లు, ధియేటర్లు ఇలా అనేక చోట్ల తొక్కిసలాట జరగడానికి అవకాశం ఉంది.

బొంబాయి లో లోకల్ ట్రెయిన్స్ లో ఎక్కి దిగే వారిని చూస్తే గుండె ఆగిపోతుంది. నిజానికి మరిన్ని తొక్కిసలాటలు జరగ కుండా దైవ శక్తి కాపాడుతోంది అనిపిస్తుంది.

ఇందులో అనేక మంది బాధ్యత ఉంది. It may sound unpleasant but the fact is our society is yet to grow out of primitive mindset which surfaces occasionally.

భానోదయం చెప్పారు...

మనదేశంలో జనాలకు బాధ్యత లేదు. రూల్స్ పాటించరు అది అందరికి తెలిసిన విషయమే. ఇది తెలిసి సెలెబ్రెటీలు రోడ్లమీదకు వచ్చి షో చేయకూడదు. వారిని చూడడానికి జనాలు పెద్ద ఎత్తున వస్తారు తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసి కూడా రావడం వారి బాధ్యతరాహిత్యానికి నిదర్శనం..

అజ్ఞాత చెప్పారు...

Celebrities dee badyata rahituam emundi, they come with their personal security and taking full badyatha for their own security, siggu lekunda valla chanka nakataniki vellina valladi badyatha

Rajesh చెప్పారు...

Ee Kalam lo vunnaru mastaaru meeru, there is no value to common man or his family ani meeku inka ardham kaaledha or teliyadha

Rajesh చెప్పారు...

And tana Life kee tanu responsibility teesuloni vaniki pakkanodu responsible Enduku feel avaali or avuthadu - I am referring to people who went there on first day to watch movie as if they die if they watch it after one week

భానోదయం చెప్పారు...

ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలి నిజమే. అలాంటి చోటుకు మహిళలు,పిల్లలు వెళ్ళడం తప్పే కానీ .. ఒక జనాదరణ కలిగిన వ్యక్తి రోడ్ మీదకో, ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ఆలోచించాలి.. జై ఎగబడతారు వారికి ఏమైనా జరిగితే అని ఆలోచించాలి..

భానోదయం చెప్పారు...

అసలు ఏముంది సెలబ్రీటీలలో అంతలా ఎగబడతారు జనాలు నాకు అర్థం కాదు. వాళ్ళు మనలాంటి మనుషులే కదా..

Rajesh చెప్పారు...

Celebrities are human and they have brain(only few have heart though)too but people who go there on first day to see them are mountain red sheep 😀 in the form of humans

అజ్ఞాత చెప్పారు...

celebrities are humans with brain ( very few will have to heart to think about others safety), but entities that go their on first day are not humans - they are mostly mountain red sheep

అజ్ఞాత చెప్పారు...


సినిమా సూపర్ స్టార్లు తమను తాము ఎక్కువ గా ఊహించుకోవడం తగ్గితే బాగుంటుంది.

ఒక సామాన్య పౌరుడు అరెస్టు అయితే బెయిల్ రావడానికి ఎంత సమయం పడుతుంది ? అని ఒక సందేహం వస్తుంది.

నిజానికి ఆంధ్ర ప్రాంతం లో సినిమాల పట్ల స్టార్ల పట్ల ఉన్న క్రేజ్ తెలంగాణాలో తక్కువ. అది మంచి విషయం. అభిమానం వెర్రి తలలు వేయడం తక్కువే.

సామాన్య ప్రజలు ఈ సినిమా హైప్ మాయలో పడకూడదు.

భానోదయం చెప్పారు...

కేవలం అరెస్టు చేసి 4గంటలు జైలులో ఉంటేనే చాలామందికి భావోద్వేగాలు పొంగిపోతున్నాయి. ఓ మహిళ చనిపోతే కనీసం సానుభూతి లేదు వీళ్ళకి. సామాన్యుల ప్రాణాలకు విలువ లేదు ..