భానోదయం

13, ఏప్రిల్ 2026, సోమవారం

"యుద్ధం ఆగేలా లేదు.. గ్యాస్ వచ్చేలా లేదు! ఇక పొగ రాని కట్టెల పొయ్యి తెచ్చుకోవడమే మేలు."



ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తోంది. అమెరికా - ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం, యుద్ధ మేఘాలు మళ్ళీ కమ్ముకోవడం మనం చూస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే కాకుండా, గ్యాస్ కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. పట్టణాల్లో ఉండేవారు గ్యాస్ సిలిండర్ కోసం క్యూ కట్టాల్సి వస్తుందేమో కానీ, మనం పల్లెటూర్లలో ఉండేవారికి ఆ భయం అక్కర్లేదు!

ఎందుకంటే.. మనకు ప్రకృతి ఇచ్చిన వరాలు ఉన్నాయి. పల్లెటూరి వంటకు మించిన రుచి ఎక్కడా దొరకదు. ఇప్పుడు ఆ పాత కాలపు వంట విధానాన్ని కొత్త టెక్నాలజీతో కలిపి వాడుకుందాం రండి.


పొగ రాని 'స్మార్ట్' కట్టెల పొయ్యి!

పూర్వకాలంలో కట్టెల పొయ్యి అంటే పొగ వల్ల కళ్ళు మండుతాయి, గోడలు నల్లగా అవుతాయి అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు మార్కెట్లో "బ్లోవర్ కట్టెల పొయ్యిలు" అందుబాటులోకి వచ్చాయి.

బ్లోవర్ మ్యాజిక్: దీనికి ఒక చిన్న ఎలక్ట్రిక్ బ్లోవర్ ఉంటుంది. అది గాలిని వేగంగా పంపడం వల్ల కట్టెలు గ్యాస్ స్టౌ లాగే నీలి రంగు మంటతో మండుతాయి.

పొగ ఉండదు: మంట నిలకడగా ఉండటం వల్ల అసలు పొగ రాదు. మీ వంటిల్లు కూడా శుభ్రంగా ఉంటుంది.

ఖర్చు తక్కువ: ఒక్కసారి చిన్న ముక్కలు వేస్తే చాలు, బ్లోవర్ గాలితో గంటల తరబడి మంట వస్తుంది.

కట్టెల పొయ్యి వంట - ఆ రుచే వేరు!

గ్యాస్ మీద వండిన వంటకు, కట్టెల మంటపై వండిన వంటకు ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుంది.

అద్భుతమైన రుచి: సెగ మీద నిదానంగా ఉడికిన పప్పు అయినా, మాంసం కూర అయినా ఆ కమ్మని రుచి మరే పొయ్యి పైన రాదు.


ఆరోగ్యం: కట్టెల పొయ్యి వంటలో ఆహారంలోని పోషకాలు చక్కగా నిలబడతాయి.

గ్యాస్ బిల్లు సున్నా - కట్టెలు ఫ్రీ!

మనం పల్లెటూర్లలో ఉంటాం.. మన చేల దగ్గర, తోటల్లో ఎండిన కట్టెలు పుష్కలంగా దొరుకుతాయి. గ్యాస్ సిలిండర్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, సిలిండర్ బుక్ చేసి రోజులు తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. మన పొలం దగ్గర దొరికే కర్ర ముక్కలే మనకు ఇంధనం!


యుద్ధాలు వస్తాయో, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయో మనకు అనవసరం. ఆధునికమైన బ్లోవర్ కట్టెల పొయ్యిని తెచ్చుకుందాం.. మన చేను కాడి కట్టెలతో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటను ఆస్వాదిద్దాం. పొదుపు చేద్దాం.. పల్లెటూరి వైభవాన్ని కాపాడుకుందాం!


10, ఏప్రిల్ 2026, శుక్రవారం

నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? రమణ మహర్షి బోధించిన అద్భుత సత్యం!

 



చాలామంది మనశ్శాంతి కోసం ఊర్లు తిరుగుతుంటారు, ఆశ్రమాలకు వెళ్తుంటారు. కానీ, బాహ్య ప్రపంచంలో మార్పులు వెతికినంత కాలం మనసు ప్రశాంతంగా ఉండదు. ఇదే విషయాన్ని రమణ మహర్షి ఒక చిన్న సంఘటన ద్వారా ఎలా వివరించారో ఈ కథలో చూద్దాం.


ఆశ్రమంలో జరిగిన సంఘటన


ఒక వ్యక్తి తన ఇంట్లో మనశ్శాంతి లేక, ప్రశాంతత కోసమని రమణ మహర్షి గారి ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ కొన్నాళ్లు ధ్యానం చేస్తూ గడుపుతున్నాడు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆశ్రమ వంటశాల వైపు వెళ్ళినప్పుడు అతనికి ఒక విషయం తెలిసింది. అక్కడ వంటవాడు 30 కిలోల కూరగాయలు తెచ్చి, లెక్కల్లో మాత్రం 50 కిలోలు అని రాసి, మిగిలిన 20 కిలోల సొమ్మును తన జేబులో వేసుకుంటున్నాడు. ఇది రోజువారీ జరుగుతున్న అవినీతి అని గమనించాడు.


మహర్షి మౌనం - భక్తుడి అసహనం


ఆ భక్తుడు ఈ విషయాన్ని రమణ మహర్షి గారికి వివరించాడు. "స్వామి, మీ ఆశ్రమంలో ఇలా అన్యాయం జరుగుతోంది, ఆ వంటవాడు దొంగతనం చేస్తున్నాడు" అని చెప్పాడు. కానీ మహర్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ధ్యానంలో ఉండిపోయారు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఆయనలో చలనం లేకపోవడంతో, ఆ వ్యక్తికి ఓపిక నశించింది.

ఒకరోజు కోపంతో, "స్వామి! ఇంటి వద్ద మనశ్శాంతి లేక ఇక్కడికి వస్తే, ఇక్కడ కూడా ఇంత అవినీతి జరుగుతుంటే మీరు పట్టించుకోరేంటి? అసలు మీకు ఇవేవీ పట్టవా?" అని గట్టిగా అడిగేశాడు.

మహర్షి ఇచ్చిన జ్ఞానబోధ

అప్పుడు రమణ మహర్షి నెమ్మదిగా కళ్లు తెరిచి ఇలా అన్నారు:


"చూడు నాయనా.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? నేను ఆరోజు ఎలా ఉన్నానో, ఈరోజు కూడా అలాగే ఉన్నాను. నేను నా మట్టుకు ధ్యానం చేసుకుంటుంటే, ఎవరో వచ్చి ఈ గోడలు కట్టారు, వంటలు చేస్తున్నారు. ఇందులో ఏది నాది? అసలు ఈ ఆశ్రమం నాది అని నీకు ఎవరు చెప్పారు?"


ఆయన ఇంకా కొనసాగిస్తూ.. "నీకు మనశ్శాంతి ఎందుకు లేదో తెలుసా? నువ్వు అక్కడ (ఇంట్లో) ఏం జరుగుతుందో వెతికావు, ఇక్కడ (ఆశ్రమంలో) ఏం జరుగుతుందో వెతుకుతున్నావు. నీ మనసు లౌకిక విషయాల మీద, ఎదుటివారి తప్పుల మీద ఉంది. మనసు అనేది నీ ఇంట్లో ఉన్నా, ఇక్కడ ఉన్నా ఒకటే. ఎప్పుడైతే నీ మనసును పరమాత్మ వైపు మళ్ళించి, నీ లోపలికి నువ్వు చూసుకుంటావో.. అప్పుడే నీకు నిజమైన శాంతి లభిస్తుంది. లౌకిక విషయాల్లో పడి కొట్టుమిట్టాడితే నువ్వు ఎక్కడికి వెళ్లినా ప్రశాంతత దొరకదు." అని హితబోధ చేశారు.. అప్పుడు ఆ భక్తుడికి జ్ఞానోదయం కలిగింది..


మనం నేర్చుకోవాల్సిన పాఠం


మనం మనశ్శాంతిని ప్రదేశాల్లో వెతుకుతాం, కానీ అది మన ఆలోచనల్లో ఉంటుంది. ఎదుటివారు ఏం చేస్తున్నారు, సమాజం ఎలా ఉంది అనే విషయాల కంటే.. మన అంతరాత్మ ఏం చెబుతోంది, మనం దైవచింతనలో ఎంతవరకు ఉన్నాం అనేది ముఖ్యం. మనసు మారనంత కాలం, మనుషులు మారినా ప్రదేశాలు మారినా ప్రశాంతత అనేది దొరకదు.!

7, ఏప్రిల్ 2026, మంగళవారం

నా మద్దతు ఇజ్రాయెల్ కే🇮🇱

 అమెరికా, ఇరాన్ యుద్ధం లో మీ మద్దతు ఎవరికి..?


నా మద్దతు ఇజ్రాయెల్ కే





ఈ యుద్ధం ప్రారంభం కావడానికి అసలు కారణం ఇరాన్.


ఇజ్రాయెల్ కొత్త టెక్నాలజీ కనిపెడుతూ, అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.


ఇజ్రాయెల్ ఏ దేశంపై అన్యాయంగా దాడి చేయలేదు.

అలా చేసే దేశమైతే మిగితా ముస్లిం దేశాల్లాగా చెత్త దేశంగా తయారయ్యేది.


టెక్నాలజీ తో ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగింది.


మరి ఇరాన్ ఏం చేస్తుంది ఉగ్రవాదులను పెంచి పోషించి, ఇజ్రాయెల్ మీద పదే పదే దాడి చెయిస్తుంది.



ఇజ్రాయెల్ టెక్నాలజీని కనిపెడితే 

ఇరాన్ ఉగ్రవాదులను కనిపెట్టింది.

హెజ్ బొల్లా, హమాస్, హూతీ,ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలను పెంచి పోషించింది..


తాను అభివృద్ధి చెందదు, ఇతరులను అభివృద్ధి చెందనీయదు మతం ముసుగులో తన ప్రజలకే స్వేచ్చ లేకుండా నియంత పాలన చేస్తుంది..


తనంతట తానుగా ప్రశాంతంగా బ్రతుకుతున్న ఇజ్రాయెల్ పై పదే పదే దాడులు చేయిస్తే ఏ దేశం అయినా ఎన్ని సార్లు భరిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం యుద్ధమే అని నేరుగా యుద్ధం చేస్తుంది.


అక్టోబర్ 7, 2023 న పండుగ జరుపుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలపై ఇరాన్ పెంచి పోషించిన హమాస్ తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి 1200 మందిని చంపేసి,250 మందిని బందీలుగా తీసుకెళ్ళిన విషయం మనకు తెలిసిందే..


ఇరాన్ వద్ద అణుబాంబు లేదు, ఒకవేళ ఉంటే ఎప్పుడో ఇజ్రాయెల్ పైనా వాడేది ఎందుకంటే ఇజ్రాయెల్ ను లేకుండా చేయడం ఇరాన్ లక్ష్యం.


అందుకని ఇలా దొంగచాటున దాడులు చేసి ఇజ్రాయెల్ ప్రజలను లేకుండా చేయడం వీరి లక్ష్యం..


ఇజ్రాయెల్ ప్రజలపై ఇరాన్ తీవ్రవాదులు దాడి చేసినట్టే, మన భారతీయులపై పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాం లో దాడి చేసారు .. ఈరెండు దాడులు ఒక రకంగా జరిగాయి కారణం మతం ఇస్లాం కాని వారు ఈ భూమిమీద ఉండకూడదు ఇదే ఇస్లాం తీవ్రవాదుల లక్ష్యం..


ఇజ్రాయెల్ ఎప్పుడు ఇరాన్ పై దాడి చేయలేదు కాని ఇరాన్ కు ఇజ్రాయెల్ అంటే పడకపోవడానికి కారణం మతం. ఇస్లాం కానివారు ఉండకూడదు అనే క్రూరత్వం..


ఈ ప్రపంచం మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండాలని వారి కోరిక ..


ఎంత క్రూరులు తమ మతం కాకుంటే బ్రతకనియ్యరా..


ప్రపంచంలో మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండాలని వారి లక్ష్యం..


అందుకే ఇలాంటి ముస్లిం దేశాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉన్నాయి.. డబ్బులు మొత్తం ఉగ్రవాదులను పెంచి పోషించడానికే సరిపోతే ఇంకా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది, 


 నా మద్దతు ఎప్పుడు ఇజ్రాయెల్ కే ...🇮🇱🇮🇱

చిన్న దేశం అయినా, చుట్టూ శత్రువులే ఉన్నా, నిరంతరం దాడులు జరుగుతునే ఉన్నా, యుద్ధాలు గెలిచి పవర్ ఫుల్ దేశంగా నిలిచింది, చాలా గొప్ప ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది..


ఇరాన్ ఏం చేసింది నా దృష్టిలో ఇది ఒక చెత్త దేశం .

ఉగ్రవాదులను పెంచి పోషించి, ప్రపంచంలో శాంతి లేకుండా చేసింది.. 


ఇరాన్ లో మతతత్వ రాజకీయాలు

 అంతం అయితే తప్ప ప్రపంచంలో శాంతి ఉండదు..






6, ఏప్రిల్ 2026, సోమవారం

అమెరికా ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ మధ్యవర్తిత్వం. వెనుక అమెరికా ప్రయోజనాలు



అమెరికా ఇరాన్ యుద్ధం ఆగిపోతుందా లేదా? 45 రోజులు వాయిదా పడుతుందా?


ఈ యుద్ధం ఆగిపోవాలని ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


యుద్ధం ఆపడానికి ఏ దేశం ముందుకు రాలేదు.

ఎందుకంటే అక్కడ ఉన్నది అమెరికా, అందులోను డోనాల్డ్ ట్రంప్ ఎవరి మాట వినడు అని అందరికి తెలుసు కాబట్టి ఏ దేశం ఈ యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం చేయలేదు..


కాని ఈ యుద్ధం ఆపడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుందంటే నమ్మలేని విషయం. పాకిస్థాన్ అంటే ప్రపంచంలో ఉగ్రవాదులను ఉత్పత్తి చేసే కర్మాగారం అలాంటి దేశం యుద్ధం ఆపడానికి మధ్యవర్తిత్వం చేస్తే అమెరికా లాంటి అగ్రదేశం ఒప్పుకుంటుందా అని సందేహం..


అమెరికా లాంటి అగ్రదేశం పాకిస్థాన్ లాంటి చెత్త దేశం మాట వింటుంది అంటే అందులో  అమెరికాకు లబ్ధిపొందే అంశం ఉంది అని అర్థం అవుతుంది..


ఆసీం మునీర్, ట్రంప్ గతంలో వైట్ హౌస్ లో భేటి అయ్యారు‌ కాబట్టి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం తో యుద్ధం ముగించే అవకాశాలు ఉన్నాయి...


మొత్తం కాకపోయినా 45 రోజుల కాల్పుల ఒప్పందం కుదుర్చుకునే అవకాశం, హర్మూజ్ జలసంధిని తెరిచే అవకాశం ఉంది..


అమెరికా లాంటి దేశం పాకిస్థాన్ మాట వింటుంది అంటే అమెరికా కు పాకిస్తాన్ తో చాలా అవసరం ఉంది అని అర్థం.


ఇరాన్ పై భూతల యుద్ధం చేయడాని పాకిస్తాన్ భూభాగం నుండే అమెరికా సైనికులను ఇరాన్ సరిహద్దులు దాటింటి భూతల యుద్దానికి దిగడం..


 చైనానుండి ఆయుధాలు ఇరాన్ కు పాకిస్తాన్ భూభాగం నుండే వస్తాయి కాబట్టి వాటిని అడ్డుకోవడం.


45 రోజులు కాల్పుల విరమణ చేసి భూతల దాడులకు ప్లాన్ చేసుకుని పాకిస్తాన్ భూభాగం నుండే ఇరాన్ లోకి ప్రవేశించి యుద్ధం చేయడం. 


భవిష్యత్తులో కాశ్మీర్ అంశంపై పాకిస్తాన్ కు సపోర్ట్ చేసి భారత్ మీద యుద్దానికి పాకిస్తాన్ కు సహాయం చేసి ఆయుధాలు అమ్ముకోవడం.


ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ను అమెరికా అంగీకరించే అవకాశం ఉంది.


లేకుంటే పాకిస్తాన్ లాంటి దేశానికి ప్రపంచంలో ఏదేశం కూడా విలువ ఇవ్వదు అలాంటి అమెరికా ఇస్తుందంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మధ్యవర్తిత్వానికి ఒప్పుకునే అవకాశం ఉంది.


పాకిస్థాన్ కు అమెరికా విలువ ఇస్తుంది అనడం కంటే తమ తమ అవసరాలకు వాడుకుంటుంది అనడం సమంజసం..


పాకిస్థాన్ మాత్రం తాము యుద్ధం ఆపగలిగాం అని గొప్పగా  చెప్పుకుంటుంది. అమెరికా మా వెనకాల ఉందని మన  దేశాన్ని  హెచ్చరించండం చేస్తుంది..


కాని అమెరికా పాకిస్తాన్ ను ఒక పావుగా మాత్రమే వాడుకుంటుంది. 


పాకిస్తాన్ తో  ఇరాన్, చైనా,భారత్ వంటి దేశాలతో సరిహద్దు ఉండటం వలన అమెరికా ఆదేశాన్ని మిత్ర దేశంగా చేసుకుని తన ప్రయోజనాలు తీర్చుకుంటుంది.

అదికూడా డోనాల్డ్ ట్రంపులాంటి దుందుడుకు స్వభావం ఉన్న అధ్యక్షుడు ఉన్నంత వరకే ...

5, ఏప్రిల్ 2026, ఆదివారం

మా వి గన్ - మీ జ గన్

 ఆంధ్రప్రదేశ్,తెలంగాణ విడిపోయాక రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేసిన ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ కి సొంత రాజధాని ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా చేసుకొని తాత్కాలికంగా భవనాలు నిర్మించి పరిపాలనా సాగించారు..


రాజధాని నిర్మించాలంటే దశాబ్దాలు పడుతుంది అలాంటిది ఐదేళ్లలో నిర్మాణం సాధ్యం కాదు.

చంద్రబాబు నాయుడు గారి హాయాంలో అమరావతి రాజధానిగా పునాది వేసారు... 


ఐదేళ్ల తర్వాత అభివృద్ధి లేదని బాబు గారిని ఓడించి మహా మేధావి అయిన జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా గెలిపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు..


జగన్ గారు ఎలాగూ చంద్రబాబు గారి పనులు నచ్చవు కాబట్టి అమరావతి రాజధానని అటకెక్కించి.

మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు.

ఒక రాజధాని కట్టడమే ఎన్నో ఏళ్ళు పడుతుంది 3మూడు రాజధానులు అంటే మూడు రాజధానులు అంటే 3శతాబ్దాలు కావాలి.


మూడు రాజధానులు ప్రకటించాడు కాని అమలు చేయడం మరిచిపోయాడు, రిషికొండ తవ్వి ప్యాలెస్ కట్టాడు. రాజధాని కట్టమంటే ప్యాలెస్ కట్టాడు బహుశా రాజధాని అంటే తన సొంత ఆస్తి అనుకున్నాడేమో.


అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు 5ఏళ్ళు పోరాటం చేసినా వారిని పట్టించుకోలేదు కదా ఇబ్బందులకు గురిచేసాడు.


ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా అమోద ముద్ర వేసాక .

అమరావతి వద్దు "మా వి గన్" రాజధాని చేయాలంటాడు.


సినిమాలో కమెడియన్ చెప్పినట్టు మంచిలీపట్నం నుండి మ, విజయవాడ నుండి వి, గుంటూరు నుండి గన్ తీసుకుని మా వి గన్ అని రాజధాని పేరు పెట్టాలి అంటాడు..


దీనిపై అందరూ రకరకాల ఊర్ల పేరుతో ఆ ఊరి నుండి ఒక అక్షరం ఈ ఊరి నుంచి ఒక అక్షరం తీసుకుని చాలా హాస్యాస్పదంగా పేర్లు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మేధావి అని పొగుడుతున్నారు.


ఇంత మహా మేధావి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో నాకైతే అర్థం కాలేదు...


కాని మా వి గన్ ఆలోచనను చూసి అందరూ మాకెందుకు రాలేదు ఈ ఆలోచన అని సిగ్గుపడుతున్నారు.


జగన్ మోహన్ రెడ్డి గారు సినిమాల్లోకి వెళితే చాలా పెద్ద హాస్య నటుడు అవుతారు. 


ఆ పదాలు, ఆ ప్రాసలు మహా అద్భుతం...


మా వి గన్ - మీ జ గన్



3, ఏప్రిల్ 2026, శుక్రవారం

హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు -మందక్రిష్ణ మాదిగ

 





మతం మారితే sc హోదా, రిజర్వేషన్లు వర్తించవని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది..


దీనిని వ్యతిరేకిస్తూ మందక్రిష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి, రామాయణం,మహాభారతం , కృష్ణుడిని, హిందూ మతాన్ని కించపరూస్తూ మాట్లాడారు.


రిజర్వేషన్లకు, హిందూ దేవుళ్ళకు సంబంధం ఏమిటి.?


మందక్రిష్ణ మాదిగ గారు హిందూ మతం గురించి ఒక మాట అన్నారు. హిందూమతం ఈ దేశం దాటి ఎందుకు విస్తరించడం లేదు అని?


నేను చెబుతాను హిందూ మతం ప్రపంచంలో ఎందుకు విస్తరించడం లేదో..


1. ఇతర మతాల వారిని బలవంతంగా మతం మార్చదు.


2.ఇతర దేశాల మీద  దాడులు చేసి ఇతర మతాల వారిని,వారి సంస్కృతిని నాశనం చేయలేదు.


3.ఇప్పటికి వారి ప్రార్థన స్థలాల్లో హిందూ మతం పట్ల చాలా ద్వేషం పెంచే ప్రసంగాలు చేస్తారు.

హిందూ మతాన్ని అంతం చేయడమే వారి లక్ష్యం.


4.ఇతర దేశాలనుండి వారి మతస్తులను ఈ దేశంలోకి అక్రమంగా తీసుకొచ్చి ఆశ్రయం కల్పించి వారి జనాభా పెంచుకుంటున్నారు.

కాని హిందువులు అలా చేయడం లేదే..



5.హిందూ మతం రెండు ఎడారి  మతస్తులతో నిరంతరం పోరాడుతు ఈ దేశంలో ఇప్పటికి నిలిచింది 

లేదంటే ఈ దేశం ఎప్పుడో ఎడారి మతస్తుల దేశం అయ్యేది..


6.ఇతర దేశాల్లో విస్తరించవలసిన అవసరం హిందూ మతానికి లేదు.


7.ఈ భారతదేశం అంత గొప్ప భూమి ప్రపంచంలో లేదు..


8.హిందూధర్మాన్ని ఆచరించే శక్తి ఇతర దేశస్తులకు ఉండదు...


9.ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికంగా, 

క్రూరంగా బలంగా ఉన్న మతస్తులు ఉంటే ప్రపంచం మొత్తం విస్తరించవచ్చు.

హిందు మతానికి ఈరెండు లక్షణాలు లేవు అందుకే ప్రపంచంలో విస్తరించడం లేదు..


పనికిరాని మతాలు దౌర్జన్యంగా, క్రూరంగా ప్రపంచంలో విస్తరిస్తూ పోతే.. వాటిని గొప్ప మతాలు అనడం మీ మూర్ఖత్వం..


ఈ దేశంలో పుట్టి రిజర్వేషన్లు స్వీకరిస్తూ మళ్ళీ ఈదేశంపైనే ద్వేషం వెళ్ళగక్కుతారు మేమే చాలా తెలివైన వారమని.. మీలాంటి మేధావులు..


ప్రపంచంలో శాంతిని పంచే మతం ఏదైనా ఉందంటే అది హిందూ మతమే...🚩🚩


జై శ్రీరామ్ 🚩 🚩 

జైహింద్ 🚩🚩

జై భారత్ 🚩🚩





19, ఆగస్టు 2025, మంగళవారం

వర్షాకాలంలో కరెంట్ తో జాగ్రత్తగా ఉండాలి.

 వర్షాకాలంలో కరెంట్ తో జాగ్రత్తగా ఉండాలి.

ఫంక్షన్ లు అయినప్పుడు బయట ఫోకస్ లైట్లు లాంటివి పెట్టినప్పుడు వాటికి కనెక్ట్ చేసే వైర్లకు ఎక్కడైనా ఇన్సులేషన్ చెక్ చేసుకోవాలి.

మొన్న నేను ఒక ఫామ్ హౌస్ లో కొత్తగా కొన్ని లైట్లు పెట్టడానికి వెళ్ళాను.

అక్కడ ఒక రూమ్ కు రెండు ఫోకస్ లైట్లు పెట్టారు.

ఆ రూమ్ పైకప్పు ఇనుప పైపులు వేసి పైనా సిమెంట్ పెంకులు వేసారు.

ఆ రూమ్ పైకప్పు ఇనుప పైపులకు ఒక ఫోకస్ లైటు బెండింగ్ వైరు తో కట్టారు.

నేను ఆ ఫామ్ హౌస్ గేటు ముందు నేమ్ ప్లేట్ కోసం కనెక్షన్ ఇవ్వడానికి ప్రహారిగోడ మీదకు ఎక్కి వైరుకు క్లిప్పు లు కొడుతూ ఆ రూము పెంకులకు నా చేతులు తాకాయి షాక్ కొట్టింది.

అదేంటి సిమెంట్ పెంకులు కూడా షాక్ కొడుతుంది అని టెస్టర్ పెట్టి చూసా.

టెస్టర్ లో ఫుల్ పవర్ చూపిస్తుంది.

దీనికి కారణం ఆ గది పైకప్పు ఇనుప పైపులకు కట్టిన లైటు.

ఆ లైటు బాడికి కరెంటు వస్తుంది  అది బెండింగ్ వైరు తో గది పైకప్పు ఇనుప పైపులకు కట్టడం వలన పైకప్పు మొత్తం షాక్ కొడుతుంది. వర్షం పడటం వలన పైకప్పు సిమెంటు పెంకులకు కూడా షాక్ కొడుతుంది..

ఇది చిన్న విషయమే అయినా తడిగా ఉన్న ప్రదేశంలో కరెంట్ షాక్ కొడితే చాలా ప్రమాదం..

వర్షాకాలంలో బయట కరెంట్ వైర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి...




13, డిసెంబర్ 2024, శుక్రవారం

అరెస్ట్ చేస్తేనే ఆగమేఘలా మీద స్పందిస్తున్నా సెలెబ్రెటీలు సంధ్య థియేటర్ తొక్కిసలాట గురించి ఎందుకు స్పందించలేదు..

 ఒక హీరోని అరెస్ట్ చేస్తే చాలా మంది హీరోలు, సెలబ్రెటీలు స్పందిస్తున్నారు. అరెస్ట్ అక్రమం అంటు మాట్లాడుతున్నారు. ఒక సెలబ్రిటీని అరెస్టు చేస్తేనే పదిమంది సెలెబ్రెటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. మరీ పుష్ప 2 బెనిఫిట్ షోలో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది,ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు ఏ హీరో, సెలెబ్రెటీలు ఎందుకు స్పందించలేదు అప్పుడు సెలెబ్రెటీలు  ఎక్కడున్నారు.???


సెలెబ్రెటీల అరెస్టుకే ఇంతలా స్పందిస్తున్నారు ఒక ప్రాణం పోయింది. అప్పుడు ఎందుకు ఒక్కరు కూడా ఆ మహిళ గురించి మాట్లాడలేదు,సహాయం చేయలేదు.

సామాన్యుల ప్రాణాలకు విలువ లేదా..?


 సినిమా వాళ్ళు డబ్బు సంపాదన కోసం ప్రేక్షకులే దేవుళ్ళు మీ వల్లే ఇంత స్థాయికి ఎదిగాం అంటూ మటలు చెబుతారు కాని అదే ప్రేక్షకులకు కష్టం వస్తే ఏ హీరో ఆదుకోడు.. 


సినిమా అనేది వ్యాపారం వ్యాపారాన్ని వ్వాపారంగానే చూడాలి. అంతేకాని సినిమాల్లో చూసి హీరోలని దేవుళ్ళ లా భావించొద్దు.. వీళ్ళు ఎవ్వరిని ఉద్ధరించడానికి సినిమాలు తీయరు. వారి స్వలాభం కోసమే సినిమాలు తీస్తారు.. ప్రేక్షకులు వేల రూపాయల టికెట్  పెట్టి సినిమాలు చూసి వారికి కోట్లు సంపాదించి పెడుతున్నారు. 


సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. ఎన్ని డబ్బులు ఇస్తే మాత్రం ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు. 


ఇప్పటికైనా జనాలు అర్థం చేసుకోవాలి సినిమా హీరోలని దేవుళ్ళ లాగా ఆరాదించకండి.

వారు మనలాంటి సామాన్య మనుషులే. ఇంతకూడా మానవత్వంలేని మనుషులు.


అసలు ఏముంది సెలెబ్రెటీల మొహాల్లో..

 ఆ రంగు పూసుకున్న మొహాలను చూడ్డానికి అంతలా ఎగబడతారు ..

వారెమైనా ఆకాశం నుండి ఊడిపడ్డారా.

వాళ్ళకోసం పనులు మానుకొని ఎగబడి వెళతారు. వాళ్ళను చూడకపోతే జీవితంలో అన్ని కోల్పోతాం అని మీద మీద పడి చూస్తారు.. 


మొహానికి రంగు పూసుకుని సినిమాల్లో నీతులు చెప్ఫేవాడు కాదు హీరో. నిజ జీవితంలో పదిమందికి సహాయం చేసేవాడు హీరో..






 




11, డిసెంబర్ 2024, బుధవారం

మరీ ఇంత దిగజారి పోతున్నారు ఏంటీ మీడియా బాబులు..

 ఈమధ్య మీడియా వారు మరీ దిగజారిపోతున్నారు.

మొన్న మోహన్ బాబు గారి కుటుంబంలో ఏదో గొడవ జరిగింది. దాన్ని చూపించేందుకు మీడియా వారి ఉత్సాహం మామూలుగా లేదు. వాళ్ళు కొట్లాడకున్నా మీడియా వారు మధ్యలో దూరి వాళ్ళకు కొట్లాటలు పెట్టి దానిని వీడియో తీసి డబ్బు సంపాదించుకుందాం అని ఒకటే ఆరాటం.. 


అదేదో  రాష్ట్రనికి పెద్ద  సమస్య అయినట్టు మోహన్ బాబు గారింట్లోకి చొచ్చుకెళ్ళి మరీ వీడియోలు తీస్తున్నారు. మీరు కొట్లాడండి మేము వీడియోలు తీసుకుంటాం అని మీడియా వారు మధ్యలో దూరి పోతున్నారు.. 


మోహన్ బాబు గారు మీడియా వారిపైనా చేయి చేసుకున్నారట.  కుటుంబం అన్నాక లక్ష గొడవలు ఉంటాయి ఆ గొడవల మధ్యలో మీడియా వారు వెళితే చేయి చేసుకోకుండా సన్మానం చేస్తారా..


కొంచెమైనా బుద్ది ఉండక్కర్లేదా.. అదే మీడియా వారి కుటుంబలో గొడవలు అయితే లైవ్ టెలికాస్ట్ చేస్తారా..?


రాష్ట్రంలో వేరే సమస్యలు ఏవి లేవా.? మోహన్ బాబు గారి కుటుంబ సమస్య ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్యా..?


మరీ ఇంత దిగజారిపోతున్నారు మీడియా వారు.


గొడవ జరుగుతుంటే ఆపడం మానేసి మీరు గొడవపడండి మేము వీడియోలు తీసి డబ్బు సంపాదించుకుంటాం, మీలాంటి వారు గొడవలు పడితేనే నాలుగు రాళ్ళు సంపాదించుకుని హాయిగా బతికేస్తాం అని మీడియా వారి ఆశ,ఆత్రుత..


కుటుంబ కలహాలు జరిగినప్పుడు మధ్యలో ఎవరైనా వచ్చి వీడియోలు తీస్తేనే ఎవరికైనా చిరాకు వచ్చి చెంప పగలగట్టాలనిపిస్తుంది. అలాంటిది ఓ ఇరవై మంది కెమెరాలు మైకులు పమట్టుకుని వచ్చి మీద పడిపోతే  కొట్టకుండా ఉంటారా.‌..?


రాష్ట్రంలో వేరే ఏ సమస్యలు లేనట్టు ఒక కుటుంబం గొడవ పడుతుంటే మీద పడిపోయి వీడియోలు తీస్తున్నారు. ఇలా తయారయ్యారేంటి మీడియా బాబులు.. నైతిక విలువలు పాటించండి. పరిధులు దాటి ప్రవర్తించంకండి.





6, డిసెంబర్ 2024, శుక్రవారం

అంత పిచ్చి ఎందుకు సినిమా అంటే ?

అంత పిచ్చి ఎందుకు సినిమా అంటే? టికెట్ ధర ఎంతున్నా కొని చూస్తున్నారు. పుష్ప 2 సినిమా టికెట్ ధర 1100 రూపాయలు అదికూడా అర్దరాత్రి షోలు ఒక ఫ్యామిలి సినిమాకు వెళ్తే 5000/- అవుతుంది.ఇంత డబ్బు ఖర్చుపెట్టి రాత్రి సమయంలో సినిమా చూడవలసిన అవసరం ఏముంది. అంత ఆగమేఘాల మీద ఈ సినిమా చూడాల్సిన అవసరం ఏముంది.

 ఇంత టికెట్ ధర పెట్టి సినిమా చూడ్డానికి జనాలు వెళ్తున్నారంటే జనాల్లో సినిమా పిచ్చి మామూలుగా లేదుగా. సినిమా కోసం ఏమైనా చేసేలా ఉన్నారు. వీళ్ళనే ఫ్యాన్సు అంటారేమో.. అందుకే సినిమా హీరోలు నాఫ్యాన్సు నాకు దేవుళ్ళు అంటూ ఉంటారు. నిజమే కదా మరి ఫ్యాన్సు దేవుళ్ళు సినిమా చూడ్డానికి ఎంత టికెట్ ధర ఉన్న సినిమా చూస్తారు రాత్రి పగలు తేడా లేకుండా..

 హీరోలు బాగానే సంపాదించుకుంటారు కాని ఫ్యాన్సు జేబులు గుల్ల చేసుకుంటారు.. 

 నాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఈ పుష్పం2 సినిమాలో అంతగా ఏముందని జనాలు వెర్రెక్కి పోతున్నారు..

 ఒక గంధం చెక్కల దొంగను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు.. ప్రభుత్వం కూడా నేషనల్ అవార్డు ఇచ్చింది ఈ సినిమా హీరోకి. అంటే ఇతన్ని ఆదర్శంగా తీసుకుని గంధం చెక్కల దొంగలు కావాల్నా. 

 అటు ప్రభుత్వానికి బాధ్యత లేదు, ఇటు ప్రజలకు బుద్ది లేదు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడానికి...

18, నవంబర్ 2024, సోమవారం

ఉత్తరాదిలో పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా!!!

 పుష్ప-2 ట్రైలర్ లాంచ్ బీహార్లో ఎందుకు చేసారు?



మన తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అయ్యింది దేశంలో ఎక్కడా తెలుగు సినిమా ఈవెంట్ చేసినా జనం ఎగబడి వస్తారు ఇప్పుడు. ఉదాహరణకు నిన్న బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో జరిగిన పుష్ప-2 ఈవెంట్ కి ఊహించని రీతిలో జనం భారీగా తరలివచ్చారు. అక్కడ ప్రభుత్వం కూడా 1200మంది పోలీసులతో బందోబస్తు కల్పించింది..

ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది...

మన తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేసిన అంత జనం వచ్చేవారు కాదేమో...


ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం పుష్ప కు ఉన్న క్రేజ్.. పుష్ప సినిమా పాటలు,కథ,హీరో మ్యానరిజం ఇవన్ని ఉత్తరాది ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి..

ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎర్ర చందనం స్మగ్లర్ అని తెలుస్తుంది (నాకు తెలియదా అంటే ట్రైలర్, ఎవరో చెబితే విన్నా తప్పితే నేను సినిమా చూడలేదు ఎందుకంటే 3గంటలు సినిమా చూసేంతా సమయం నాకు లేదు కాబట్టి నేను చూడలేదు వీలైతే అప్పుడప్పుడు సీరియల్ చూసినట్టు చూస్తాను)..

ఈ రోజుల్లో హీరో క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉంటే జనాలకి అంతగా కనెక్ట్ అవుతాడు సినిమా హిట్టవుతుంది..

అందుకే పుష్ప క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యింది.

ఉత్తరాదిలో ముఖ్యంగా బీహార్ అంటే మనకు గుర్తు వచ్చేది స్మగ్లర్లు,రౌడీలు, కూలీలు ఎక్కువ అభివృద్ధి తక్కువ. అందుకే బీహార్ ప్రజలు దేశంలోని అన్ని ప్రాంతాలకు వలస వెళుతుంటారు.. దేశంలో ఎక్కడ చూసినా బీహార్ కూలీలే ఉంటారు. అలాగే కిరాయి రౌడీలు కూడా బీహార్ వాళ్ళే ఉంటారు చాలా వైల్డ్ గా ఉంటారు... తమ జీవితాలకు పుష్ప కథ దగ్గరగా ఉండటంతో అక్కడ బాగా క్రేజ్ ఏర్పడింది.. 


ఇది నేను పుష్ప సినిమాని తక్కువ చేసి మాట్లాడటం లేదు.. సినిమాకు ఉన్న క్రేజ్ ఎలా వచ్చింది అని చెప్పానంతే ఫ్యాన్స్ ఏమనుకోవద్దు...


తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్టవుతే ఒక తెలుగు వాడిగా గర్వపడుతాను.. 


మరో విషయం చెప్పాలి పుష్ప సినిమా షూటింగ్ మా ఊళ్ళో జరిగింది... 

డైరెక్టర్ సుకుమార్ నా ముందునుండి వెళుతున్నాడు నేను గమనించలేదు. ఆయన వెనకాల ఓ ఐదారుగురు ఉన్నారు ఎవరో అనుకున్నా మా ఊరు అబ్బాయి డైరెక్టర్ సుకుమార్ వెళుతున్నాడు అన్నా అన్నాడు. అరే అవును నాముందు నుండే వెళ్ళాడు గుర్తు పట్టలేదు. సెల్ఫీ దిగుదాం అన్నాడు వద్దులే తమ్ముడు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పనిని మనం డిస్టర్బ్ చేయకూడదని నా పనికి నేను వెళ్ళాను... 


వాళ్ళు ఊరంతా తిరిగి ఒక మంచి పాత ఇంటి కోసం వెతుకుతున్నారు షూటింగ్ చేయడానికి.

వాళ్ళను ఆపి సెల్ఫీలు అడగడం బాగుండదు ఎవరి పని వారిని చేసుకోనియాలి. మన పని మనం చేయాలి అనుకుంటూ నాపనికి నేను వెళ్ళాను...


ఈ సారీ పుష్ప-2 భారీ విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు..


మన తెలుగు సినిమాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సూపర్ హిట్టవుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్.. 


17, నవంబర్ 2024, ఆదివారం

గాడిద పాల బిజినెస్ లక్షల్లో లాభాలు. మా ఫ్రాంచైజీ తీసుకోండి కోట్లు సంపాదించండి.

 గాడిద పాల బిజినెస్ లక్షల్లో లాభాలు... 




గాడిద పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. మెడిసిన్, కాస్మోటిక్స్ లో వాడుతున్నారు.. ఇప్పుడు గాడిద పాలకు చాలా డిమాండ్ ఉంది. లీటరు గాడిద పాలు 1600/- రూపాయలు. ముందు ముందు 2000/- ఇంకా 7000/- వేల వరకు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ బిజినెస్ చేసి నెలకు లక్షల్లో సంపాదించండి. 


గాడిదలు మాదగ్గరే ఉంటాయి కొనండి ఒక గాడిద వచ్చేసి 150000/- మాత్రమే. ఎన్ని గాడిదలు కొంటె అంతలాభం. 50 కొంటె ఒక రోజుకి 50లీ ×1600=80,000/- నెలకి 24,00,000/- మీ పెట్టుబడి రెండు నెలల్లో తీరిపోయి మూడో నెల నుండి అంతా లాభమే.


మా ఫ్రాంచైజీ తీసుకునెందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి.

అదేంటంటే:-


*మా ఫ్రాంచైజీ ఫీజు 5లక్షలు

*మా దగ్గర ఒకేసరి 50గాడిదలు కొనాలి 

*గాడిదల కోసం ఆధునిక షెడ్డు లు నిర్మించుకోవాలి 

*పాలను నిల్వ చేయడానికి ఫ్రీజర్ లు ఉండాలి

*గాడిదలను మేపడానికి,పాలు పితకడానికి ట్రైనింగ్ ఇచ్చి పని వాళ్ళను మేమే  పంపిస్తాం 

*ఫాం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.

*గాడిదల ఫాం మేమే నిర్మించి ఇస్తాం అందుకు డబ్బు కట్టండి...


ఇవి కండీషన్లు


ఇది విని ఒకాయన 50 గాడిదలు కొంటే,,,,

లాభం లెక్క వేసుకున్నాడు

రోజుకు 50గాడిదలు 50లీ పాలు×1600=80,000/-

నెలకి 80,000×30=24,00,000/-

సంవత్సరానికి 2 కోట్ల 88 లక్షలు..


వెంటనే క్లాస్ కు వెళ్ళాడు 50వేలు కట్టాడు.

ఫ్రాంచైజీ కీ 5,50,000/- కట్టాడు.

35,00,000/- కట్టి 50 గాడిదలు తీసుకున్నాడు.

గాడిదల ఫాం, ఫ్రీజర్ లు, కెమెరాలు,హంగులు అన్నింటికి కలిపి 70 లక్షలు వెచ్చించాడు,.


70+35+5.5+.5=1 కోటి 11 లక్షలు పెట్టుబడి పెట్టాడు.


పనివారు వాళ్ళు గుజరాత్ వాళ్ళంట వారికి వసతి భోజనం కల్పించి నలుగురికి నెలకి 50వేలు 


మొదటి రెండు నెలల్లో రెండుసార్లు మాత్రమే పాలు తీసుకెళ్ళారు. కాని డబ్బులు వేయలేదు. సరే ఇస్తారులే నమ్మకస్తులే ఇంత పెట్టుబడి పెట్టాం అని అలా 11 నెలలు చూసారు. పితికిన పాలు అలానే ఉన్నాయి. పని వాళ్ళకు మరో 5 లక్షలు ఫాం మెయింటెనెన్సికి కలిపి మొత్తంగా 1కోటి 30 లక్షలు అయ్యింది..


పాలు తీసుకెళ్ళడం లేదు ఫోన్లో సంప్రదిస్తే సమాధానం లేదు. ఇక లాభం లేదనుకుని తమిళనాడులోని అతని ఆఫీసుకి వెళ్ళి అడిగితే వారంలో ఇస్తాను అని అన్నాడు.  వారం తర్వాత అతని జాడలేదు 

అప్పుడు తెలిసింది ఏంటంటే పోయాం... మోసం..

కోట్ల రూపాయలు మోసపోయారు..


ఒక పది రూపాయలు  పేదవాడికి దానం చేయడానికి పదిసార్లు ఆలోచిస్తారు ఈరోజుల్లో. లక్షల, కోట్ల రూపాయలు ఇలా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించారా??


ఈ రోజుల్లో మనిషికి ఆశ కాదు అత్యాశ విపరీతంగా పెరిగిపోయింది.. డబ్బు,డబ్బు లాభాలు, లాభాలు కోట్లకు పడగెత్తాలి పెద్ద పెద్ద బంగళాలు కట్టాలి,పెద్ద కార్లలో తిరగాలి. అందరిలో కంటే మనమే గొప్పగా బ్రతకాలి ఇలా అత్యాశకు పోయి ఉన్నదంతా ఊడ్చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు.


ఆశకు హద్దు ఉండాలి. మోసం చేసిన వాడిది తప్పే. కాని మీ అత్యాశే వాడి లాభం... లాభాల లెక్కలేసుకుని గాల్లో తెలిపోతారే తప్ప అది ఎంత వరకు సాద్యం ఆలోచించరు.

ఇలాంటి స్కాం లు ఎన్ని జరిగినా దురాశపరులు మోసపోతూనే ఉంటారు...


12, నవంబర్ 2024, మంగళవారం

పచ్చని ప్రకృతిని నాశనం చేసే ఫార్మా సిటీలు ఎందుకు?? రైతుల ఆగ్రహం అందుకే..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో

నవంబర్12 సోమవారం అంటే నిన్న వికారాబాద్ కలెక్టర్,సబ్ కలెక్టర్,ఇతర అధికారులపై రైతులు దాడి చేసారు.

ఫార్మా సిటి కోసం భూసేకరణ చేయడానికి రైతులతో మాట్లాడాటానికి వెళ్ళిన అధికారులపై రైతులు దాడి చేసారు. రాళ్ళతో కార్ల అద్దాలు ధ్వంసం చేశారు.

 అధికారలపైనే రైతులు దాడి చేసారంటే అందులోను జిల్లా కలెక్టర్ పై దాడి. రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. 

వాళ్ళ ఆగ్రహం మాత్రమే అందరికి కనిపిస్తుంది ఆ ఆగ్రహం వెనక వారి ఆవేదన ఎంతమందికి తెలుస్తుంది.??


రైతుల కోపానికి కారణం ఏంటంటే

ఫార్మా కంపెనీలు వస్తే ఆ ప్రాంతం అంతా కాలుష్యమవుతుంది.గాలి,నీరు,భూమి అన్ని కలుషితమవుతాయి. పచ్చని ప్రకృతి ని నాశనం చేసే ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


తరతరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రైతుల భూములు లాక్కుని ఫార్మా కంపెనీలు కడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు.


భూముల ధరలు కోట్లలో పలుకుతుంటే లక్షలో పరిహారం ఇస్తామంటే ఎవరు ఊరుకుంటారు.


భూములు లాక్కుంటే రైతుల ఉపాధి సంగతి ఏంటి?

వారు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి.


ఆ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి అంటారు వారు స్థానికులకు ఇచ్చే ఉద్యోగాలు స్వీపర్,లేబర్ ఉద్యోగాలే వెట్టి చాకిరి చేయిస్తారు. అందులో చాలి చాలని వేతనం మనవాళ్ళు ఇలాంటి పని చేయలేక మానేస్తారు వాళ్ళు బిహార్ వాళ్ళను పనిలో పెట్టుకుంటారు రోజుకు 12గంటలు పని చేయించుకుంటారు. స్థానిక ప్రజలు వలసలు వెళ్ళాల్సిందే.


ఉద్యోగాలు పోని భూమికి పరిహారమైనా తగిన విధంగా ఇస్తారా అంటే అదీలేదు. 

ప్రభుత్వం ఎకరా భూమికి ఇచ్చే పరిహారంతో బయట ఎక్కడా 100 గుంట భూమి రాదు.


చాలిచాలని ఆదాయంతో బ్రతుకుతున్న రైతులకు ఎలాంటి సహాయం చేయకపోగా వారి  భూములు లాక్కుని వారి పొట్ట కాడుతాం అంటే ఎవరు ఊరుకుంటారు??


 టి ఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ ను గెలిపించారు రైతులు.

గెలిపించిన పాపానికి ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా మీ భూములు లాగేసుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారు? 


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాల వల్ల ఏడాది గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది.

కేసీఆర్ పాలనే బాగుండే అనవసరంగా రేవంత్ రెడ్డిని గెలిపించాం అని జనాలు ఇప్పుడు బాధ పడుతున్నారు.

మరీ ముఖ్యంగా రైతులు.


రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేరలేదు

రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు.


ఒక్క బస్ టికెట్,గ్యాస్ సిలిండర్ తప్ప ఏ హామి నెరవేరలేదు. 


సరే ఇవేమి అక్కర్లేదు ఇవ్వకున్నా పర్వాలేదు. కానీ మా భూములు గుంజుకుని అరకొర పరిహారం ఇచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తే తిరగబడక ఏం చేస్తారు...


ఏ ప్రభుత్వమైనా కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేవే కాని రైతులు బాగుండాలి వారికి లాభం చేకురాలని ఏప్రభుత్వం, ఏ నాయకుడు ఆలోచించడు.


 రైతుల భూములు లాక్కోవాలి వారిని తరిమి వేయాలి అని చూస్తారే తప్పా వారికి మంచి చేయరు. ఎందుకంటే రైతులు బలహీనులు వారి తరపున అడిగే వారు ఎవరు ఉండరు అందుకే రైతులపై పడి వారి పొట్ట కొడతారు మన గొప్ప నాయకులు..


ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం ఒక ఏడాది గడవకముందే...




10, నవంబర్ 2024, ఆదివారం

హోటల్లో ఆహారం అంత టేస్టీగా ఎందుకుంటాయబ్బా.?

 ఈ రోజు సండే హోటల్లో తిందాం . ఆ హోటల్లో రుచి చాలా టేస్టీగా ఉంటుంది...

ఇంట్లో కంటే హోటల్లో వంటలు అంత టేస్టీగా ఎందుకుంటాయబ్బా...


ఎందుకంటే 

కుళ్ళిపోయిన కూరగాయలు,..

బూజు పట్టిన అల్లంవెల్లుల్లి,..

గడువు తీరిన మసాలాలు,..

జిడ్డుపట్టిన వంటపాత్రలు,..

తారు లాంటి మంచి నూనె,.. 

బొద్దింకలు, ఎలుకలు స్వైర విహారం చేసే వంటగది,..

పాన్ పరాగ్ నములుతూ...  వంట చేసే వంట మాస్టార్...


ఇవన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తే బాయట పడ్డ టేస్టీ సీక్రెట్స్...


ఇంత కళాత్మకంగా చేయడం వల్లే బయట హోటల్లో ఆహారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇలా చేయడం సాధ్యం కాదు కాబట్టి.

జనాలు హోటల్లో ఎగబడి తింటారు..


ఇలా అన్ని హోటల్లో ఉంటుందని కాదు కొన్ని హోటల్ వాళ్ళు చాలా శుభ్రంగానే చేస్తారు.

4, నవంబర్ 2024, సోమవారం

ఓలా నాణ్యత డొల్లా

 ఓలా అంటే ఒకప్పుడు క్యాబ్ సర్వీస్ అందించే సంస్థ.ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ లను తయారు చేసే కంపెనీ. 

ఓలా మొదట్లో క్యాబ్ సర్వీసులను అందించి బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకుంది. జనాల నోళ్ళలో ఓలా పేరు మారుమోగింది. ఓలా ఓ పెద్ద బ్రాండ్ అయ్యింది. ఒక కంపెనీ బ్రాండ్ ఇమేజ్ వచ్చాక ఇక ఏరంగంలో ప్రవేశించిన తిరుగుండదు. అది అనుభవం లేని రంగం అయినా..

అలా క్యాబ్ సర్వీస్ అందించే ఓలా బ్రాండ్ ఇమేజ్ వచ్చాక

అంటే "జనాల నోళ్ళలో ఒక పేరు నానింది అంటే అదే బ్రాండ్ ఇమేజ్". అది ఓలాకు వచ్చింది ఒక కంపెనీకి బ్రాండ్ ఇమేజ్ వచ్చాక ఊరుకుంటుందా విస్తరించుకోవాలని ఇతర రంగాల్లో ప్రవేశించాలని చూస్తుంది. అలా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారి రంగంలోకి వచ్చింది. 


బ్రాండ్ ఇమేజ్ వచ్చాక పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడతాయి. బ్రాండ్ వచ్చేవరకే కష్టపడాలి ఒకసారి వచ్చిందంటే ఇక పెట్టుబడులకు తిరుగుండదు. అలా ఓలా కు కూడా పెట్టుబడులకు కొదవలేదు.


వెనువెంటనే ఎలక్ట్రిక్ స్కూటర్ తయారి రంగంలోకి దూకి విదేశీ స్కూటర్ కంపెనీని కొనేసి చెన్నై లో ప్లాంటు రెడి చే‌సి ఉత్పత్తి ప్రారంభించి మార్కెట్లో విడుదల చేసారు.బ్రాండు మహిమ జనాలు విరగబడి కొన్నారు.

తర్వాత ఓలా స్కూటర్లు లో ఒక్కో సమస్య రావడం ప్రారంభం అయ్యింది. స్కూటర్ ముందు చక్రం విరిగిపోవడం,బ్యాటరీలో మంటలు రావడం, సాంకేతిక సమస్యలతో ఆగిపోవడం ఇలా పలు రకాల సమస్యలతో వినియోగదారులు ఇబ్బందులకు గురి అయ్యారు.


తమ సమస్య పరిష్కారం కోసం ఓలా కంపెనీని సంప్రదిస్తే సరైనా పరిష్కారం లభించక కోపంతో స్కూటర్లు తగలబెట్టడం,షోరూం ను కూడా తగులబెట్టారు. ఇంత జరిగినా ఓలా కంపెనీ సరైనా పరిష్కారం చూపలేదు.

వీళ్ళకి కేవలం బ్రాండ్ ఇమేజ్ తప్ప క్వాలిటీ లేదు అంతా డొల్లా..


ఈ రోజుల్లో ఎలాగోలా చేసి ఒక కంపెనీ పెట్టీ బ్రాండ్ సంపాదిస్తున్నారు దాని ద్వారా పెట్టుబడులు ఆకర్షించి ఇంకా పెద్ద స్థాయికి ఎదగాలని చూస్తున్నారు. ఇలా చేయడం తప్పుకాదు కానీ మనం ఉత్పత్తి చేసే వస్తువు నాణ్యమైనదిగా ఉండాలి, ఆలాగే మన సేవలు వినియోగదారులకు అందుబాటులో ఎప్పుడూ ఉండాలి.అంతేకాని ఒక బ్రాండ్ సంపాందించి ఏదో చెత్త అమ్మిన జనాలు కొంటారు అనే భ్రమలో ఉండొద్దు ఇలా అయితే చివరకు బ్రాండ్ బైజూస్ అవుతుంది అంటే కనుమరుగై పోతుంది.


నా అభిప్రాయం ప్రకారం అసలు ఓలా స్కూటర్ను చూస్తేనే తెలుస్తుంది అందులో నాణ్యత లేదని,అలాగే ఆ డిజైన్ బాగుండదు అసలు జనాలు ఎలా కొంటారో వీటిని అంతా బ్రాండ్ మహిమ. అసలు ఎలక్ట్రికల్ వాహనాలు 100శాతం ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మరో పది సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఇంకా వీటిపైనా ప్రయోగాలు చేసి సమస్యలు పరిష్కరించి అప్పుడు మార్కెట్లోకి వదలాలి. అంతేకాని ఏదో చైనా నుంచి విడిభాగాలు తెప్పించి ఇక్కడ అతికించి మేడిన్ ఇండియా ఓలా అంటే నాణ్యత డొల్లే అవుతుంది.



ఇప్పుడు ఓలా కూడా మరో బైజూస్ అవుతుంది ఇందులో సందేహం లేదు..

3, నవంబర్ 2024, ఆదివారం

గానుగ నూనెలే వాడాలి

 మనం తినే వంటనూనెలు అంతా కల్తీయేనా??

నేను చాలాసార్లు దీని గురించి విన్నా..

ఒక లీటరు వేరుశనగ నూనె ప్రస్తుతం 150/- రూపాయలు

ఒక లీటరు వేరుశనగ నూనెకోసం ఎన్ని కిలోల వేరుశనగలు అవసరం అవుతాయి..

దాదాపు 4కిలోల వేరుశనగలు మరపట్టిస్తే ఒక లీటరు నూనె వస్తుంది. 

ఒక కిలో వేరుశనగలు 150 రూపాయలు, 4కిలోలకి 600 రూపాయలు అయితే, 600 రూపాయలకు లీటరు నూనె ఉండాలి మరి 150రూపాయలకు ఎలా అమ్ముతున్నారు.?

గానుగ నుండి తీసిన తవుడు అమ్ముకున్నా 500 రూపాయలన్నా ధర ఉండాలి. కాని 150కే ఎలా అమ్ముతున్నారు..? అది మంచినూనె నా లేదా ఇంకేమైనా కలుపుతున్నారా..?


ఇవన్ని ఎవరు పట్టించుకోరు మనకెందుకులే అని వదిలేస్తుంటారు. అందరు అలాగే తింటున్నారు మనం అలాగే తిందాం అంటారు. మరికొందరు మనం చెబితే ఎవరు వింటారు అని కొంచెం జాగ్రత్తగా మంచి ఆహారం తింటారు.

నిజమే ఎవరు చెబితే ఎవరూ వినరు.

మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే వంటనూనెల విషయంలో జాగ్రత్త వహించాలి. మనమే స్వయంగా వేరుశనగలు కొని గానుగ లో వేయించి నూనె తీసుకోవాలి అప్పుడే మనకు స్వచ్ఛమైన మంచి నూనె లభిస్తుంది.

ఈ కల్తీ నూనెలు తిని ఆరోగ్యం పాడుచేసుకునే బదులు కొంచెం కష్టమైనా దగ్గరుండి గానుగ లో నూనెలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది..


ఒక్క నూనె విషయంలోనే కాదు తినే ఆహారపదార్థాలు అన్నింటిని దగ్గరుండి మర పట్టించాల్సిందే. పిండి,కారం,పసుపు,అల్లం వెల్లుల్లి ఇలా అన్ని మనం దగ్గరుండి మర పట్టించాల్సిందే..