భానోదయం

21, మార్చి 2019, గురువారం

శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వారి రథోత్సవం

       ప్రతి సంవత్సరం మా ఊరిలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. శివరాత్రి తర్వాత వచ్చె నవమి రోజు కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత రెండో రోజు శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల రథోత్సవం జరుగుతుంది.  ఈ బ్రహ్మోత్సవాలను జాతర అని పిలుస్తుంటారు. ఈ ఉత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.
     


            కొండపైన ఉన్న ఆలయంలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల కల్యాణం జరుగుతుంది. ఆ తర్వాత రెండో రోజు ఊరి మద్యలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి  ఆలయం వద్ద నుండి రథోత్సవం ప్రారంభమవుతుంది. రథోత్సవం రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకల్ల  స్వామి వార్ల రథాన్ని పూలతో అందంగా ముస్తాబు చేసి శ్రీ పార్వతి పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగిస్తారు. ఇక నాలుగు గంటల నుండి రథోత్సవం ప్రారంభమవుతుంది. భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని భజనలు చేసుకుంటు రథాన్ని ఊరేగిస్తారు. ఉదయం నాలుగు గంటలకు శ్రీ ఆంజనేయ స్వామ వారి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన రథోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు  శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వార్ల ఆలయం యొక్క కొండ దిగువకు  చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రథాన్ని లాగడానికి తాడు లాంటివి కట్టి లాగరు. కేవలం చెతులతో  నెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. స్వామి వారి ఆశీస్సులతో ఇంత పెద్ధ రథాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయసనంగా ముందుకు తీసుకెళ్తున్నాం.




     ఒకప్పుడు జాతరకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చే వారు ఇప్పుడు మాత్రం జనాలు రావడం కొంచెం తగ్గిపోయింది.
        

13, మార్చి 2019, బుధవారం

ఎండాకాలంలో ఏ.సి, కూలర్ ఏది ఉత్తమం



              ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగాలి కోసం కూలరో, ఏ.సి నో వాడుతుంటారు. ఈ రెండింటిలలో ఏది ఉత్తమం.

ముందుగా కూలర్ గురించి చూద్దాం:

సామాన్యంగా కూలర్లను ఎండాకాలంలో మాత్రమే వాడుతుంటారు. మిగితా రోజులు పక్కన పెట్టేస్తుంటారు. ఏ.సీ లను గోడకు బిగిస్తాం కాబట్టీ ఎప్పుడైనాా వాడుకుంటాం. ఏ.సి లు, కూలర్ల వల్ల కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, అసౌకర్యాలు కూడా ఉన్నాయి.
అవేంటో చూద్దాం

ప్లస్ పాయింట్లు:

➡️కూలర్ విషయానికి వస్తే దీని ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది.

➡️ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జరుపుకోవచ్చు.

➡️ మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ.

➡️తక్కువ కరెంట్ బిల్ వస్తుంది

మైనస్ పాయింట్లు:

➡️కూలర్ నుండి శబ్ధం ఎక్కువగా వస్తుంది

➡️కూలర్ల వల్ల కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది

➡️నీరు అధికంగా అవసరం అవుతుంది.

➡️కూలర్ నీరు శుభ్రం చేయకపోవడం వలన శ్వాస సంబంద సమస్యలు వస్తాయి.

➡️గదిలో గాలిని కూలర్లు ఫిల్టర్ చేయలేవు కనుక కార్బన్ డై ఆక్సైడ్ గదిలో నే ఉండిపోతుంది.

➡️ కూలర్ లోపల  తేమ వలన ఇనుప పట్టీలు తుప్పు పడుతుంటాయి.

➡️కూలర్ ను తరుచుగా శుభ్రం చేస్తుండాలి లేదంటే దుర్వాసన వస్తుంది.

తప్పని పరిస్థితుల్లో కూలర్ వాడవలసి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

కూలర్ ని గదిలో కాకుండా గది బయట ఉంచితే బయట ఉన్నా మంచి గాలి కూలర్ ద్వారా గదిలోకి వస్తుంది.

రెండు మూడు రోజులకు ఒకసారి నీటిని పూర్తిగా తీసేసి శుభ్రం చేస్తుండాలి.

శుభ్రం చేసేటప్పుడు కూలర్ కరెంట్ ప్లగ్ను సాకెట్ నుండి తీసివేసిన తర్వాతే శుభ్రం చేయాలి.

 కూలర్ ఫ్యాన్ ను బిగించే పట్టీలు తుప్పు పట్టకుండా పెయింట్ వేయాలి.

ఇలా చేయడం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ఇప్పుడు ఏ.సి యొక్క సౌకర్యాలు, అసౌకర్యాల గురించి చూద్దాం.

ఏ.సి ని గదిలో గోడకు శాశ్వతంగా బిగిస్తాం కాబట్టి ఏ కాలంలో నైనా వాడుకుంటాం. దీని ఖరీదు ఎక్కువే అయిన ఆరోగ్యపరంగా కూలర్ కంటే బెటర్.

ఏ.సి యొక్క ప్లస్ పాయింట్లు:

➡️ఏ. సి వల్ల గదిలో మనకు కావలసినంత చల్లదనంగా ఉంచుకోవచ్చు.

➡️గోడకు పైన ఉంటుంది కాబట్టి కరెంట్ షాక్ వంటి ప్రమాదాలు ఉండవు.

➡️గదిలోని కర్బెన్ డై ఆక్సెడ్ ను బయటికి పంపి స్వచ్ఛమైన గాలిని గదిలోకి పంపుంతుంది.

➡️నీటి అవసరం ఉండదు


మైనస్ పాయింట్లు:

➡️ ఏ.సి ఖరీదు ఎక్కువ

➡️ఒక చోట నుండి వేరే చోటుకి జరపలేం

➡️కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది

 ధర పరంగా చూసుకుంటే కూలర్ బెటర్.
భద్రత, ఆరోగ్య పరంగా చూసుకుంటే ఏ.సీ బెటర్.


ఏ.సి ,కూలర్ల  కంటే ఇంటి ముందు కొన్ని  చెట్లు పెంచుకుంటే  ఉత్తమం.