భానోదయం

6, ఏప్రిల్ 2019, శనివారం

పవన్ కళ్యాణ్ అభిమాని

పవన్ కళ్యాణ్ సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేం. మీరు  దేవుడు సార్ దేవుడినైనా చూడడానికి జనాలు వస్తారో రారో కాని మిమ్మల్ని చూడడానికి లక్షల మంది వస్తారు.  అక్కడ స్థలం సరిపోక పోతే చుట్టూ ఉన్న చెట్లు, స్థంభాలు , హోర్డింగులు, ఆఖరికి కరెంట్ పోల్ కూడా వదలకుండ ఎక్కి చూస్తాం. కరెంట్ పోల్ లో పవర్ ఉంటుంది! షాక్ కొడుతుంది అనుకునేరు మీ పవర్ ముందు ఈ పవర్ ఎంత సార్. ఇంత కష్టపడే బదులు టీవీల్లో చూడవచ్చు కదా అంటారమో!? టీవీలో చూడటం కంటే స్థంభం ఎక్కి చూస్తే వచ్చే కిక్కే వేరప్పా..చూసారా  సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో! ఒక్కసారైనా మిమ్మల్ని ఎదురుగా చూడాలని ఎదురు చూస్తాం. అవకాశం వస్తే గట్టిగా  గట్టిగా కౌగిలించుకుంటాం ఎంత గట్టిగా అంటే  మీకు ఊపిరి ఆడనంత గట్టిగా. కౌగిలించుకునే వీలు లేకుంటే మీ  కాళ్ళనైన పట్టుకుంటాం అదికూడా గట్టిగా ఎంతలా అంటే మీరు పట్టుకున్న మైక్ విరిగిపోయి మీరు కింద పడిపోయేంతలా. మీకు ఓపిక ఉందో లేదో మాకు అనవసరం మిమ్మల్ని హత్తుకోవడమే మాకు కావాలి. మీరు పడిపోయిన, కిందపడి గిలగిల కొట్టుకున్న మాకు అనవసరం. అలా చేయడం  మీమీద మాకు ఉన్న  అ....భిమానం.


              అంతేనా సినిమా ఫంక్షన్లలో ఎవరి సినిమా అయిన పర్వాలేదు మీ పేరు వినపడితే చాలు మాకు పూనకం వచ్చేస్తుంది మా అరుపులతో హాలు దద్దరిల్లి పోవాలసిందే ఎవరు మాట్లడానికి వీలులేకుండా. అది సార్ మీరంటే మాకు అభిమానం కాదు సార్ వీరాభిమానం.

     మీరు స్టేజీపైనా పూనకం వచ్చినట్టు ఊగిపోతు ప్రసంగిస్తుంటే మాకు పూనకాలు వచ్చేస్తాయి. అప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలని ఉంటుంది కాని సెక్యూరిటీ వాళ్ళు రానివ్వరు.
 రాష్ట్రం విడిపోయినప్పుడు బాధతో మీరు ఎనిమిది రోజులు అన్నం మానేశారని తెలిసి మేము  మీకంటే పదిరెట్లు  ఎక్కువగా బాధపడ్డాం  రాష్ట్రం విడిపోయినందుకు కాదు మీరు అన్నం మానేసినందుకు!

మాకోసం మీరు ఇంత సహనం, ఓర్పుతో  రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడుతున్నారు. అయిన మీకు వచ్చే సీట్లు మాత్రం  కూడా అంకెలల్లో నైనా  వస్తాయో లేదో. మిమ్మల్ని గెలిపించడం కోసం ఏమైనా చేస్తామో చేయమో కాని మిమ్మల్ని మాత్రం గట్టిగా గట్టిగా పట్టుకోవాడాని ఏమైనా చేస్తాం.

రాజకీయాల్లో  మార్పు తీసుకురావడం పవన్ లక్ష్యం.

పవన్ పేరు చెబితే గట్టిగా అరవడం అభిమానుల లక్ష్యం.

సీఎం కావడం పవన్ లక్ష్యం.

పవన్ ను గట్టిగా పట్టుకోవడం అభిమానుల లక్ష్యం.

మీ ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు సార్..

మిమ్మల్ని గట్టిగా పట్టుకోవడానికి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాం సార్.

జై పవన్ జై పవన్ అభిమాని

                             _ఒక పవన్ అభిమాని



5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం ఎవరు

             2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుపొందే నాయకుడు ఎవరు?
ముఖ్యంగా నాలుగు పార్టీల నేతల మధ్య పోటీ నెలకొని ఉంది. చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు , పాల్ గారు. వీళ్ళందరిలో ఎవరి వైపు జనం మొగ్గు చూపుతున్నారు.

ముందుగా చంద్రబాబు గారి గురించి చూస్తే 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు.

 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు గారిదే.

ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక  కొత్త రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ కల పోలవరం ప్రాజెక్ట్ ను కూడా కట్టిస్తున్నాడు.

 ఇక కరువు సీమ అనంతపురానికి కియా కార్ల కంపెని తీసుకొచ్చాడు.

చిత్తూరు జిల్లాలో తిరుపతి సిలికాన్ సిటీగా మార్చే ప్రయత్నంలో కొన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు కూడా వచ్చాయి.

ఇన్ని అభివృద్ది పనులు చేసిన చంద్రబాబు గారు మళ్ళీ గెలిచే అవకాశం ఉందా అంటే ఈ సారికైతే లేవనే చెప్పాలి. ఇన్ని అనుకూలతలు ఉన్న ప్రతికూలతలు కూడా చాలానే ఉన్నాయి.

చంద్రబాబు గారు కేవలం కంప్యూటర్లు ఐటీ రంగం పైనే ఎక్కవగా దృష్టి పెడతారు. కాని రైతులను సామాన్యులను పట్టించుకున్న పాపాన పోలేదు ఉమ్మడి రాష్ట్రంలోనైనా ఇప్పుడైనా.

 ఆంధ్రాను సింగపూర్ చేస్తా అమరావతిని అమెరికా చేస్తా అమలాపురం ను ఆస్ట్రేలియా చేస్తా అంటాడు.  సార్ బాబు గారు ఆంధ్రాను అమెరికాలు సింగపూర్లు చెయ్యాల్సిన అవసరం లేదు అన్నదాతలను ఆదుకోండి అంతేకాని పచ్చని పంటపొలాలను అభివృద్ది పేరుతో నాశనం చేయకండి.

దేశానికే  అన్నం పెట్టె అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని అందరికి తెలుసు కాని బాబు గారు వ్యవసాయం దండగా అంటారు. అసలు చంద్రబాబుకు రైతులంటేనే అసహ్యం.

బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ ఐదేళ్ళలో.

బాబు గారు తీసుకొచ్చిన కియా మరియు ఎలక్ట్రానిక్ విడిబాగాల కంపెనీలలో వేల  ఉద్యోగాలు వచ్చాయి కదా అని అనొచ్చు కాని వాటిలో ఎక్కవగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారే ఉంటారు.  ఈ కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు ఎంత పెద్ద కంపెనీలు వస్తే ఏం లాభం వాటి వల్ల  స్థానికులకు ఉద్యోగాలు రాకపోగా బోనస్ గా కాలుష్యం మాత్రం
ఫ్రీగా వస్తుంది. కాలుష్యం స్థానికులకు ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి. ఇదేనా చంద్రబాబు గారి అభివృద్ది.

ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు.

విద్యార్థలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు.

ఆరోగ్య శ్రీ పథకాన్ని అటకెక్కించాడు.

కేవలం ఐటీ ఐటీ అనడం తప్ప రైతులకు పేదలకు చేసిందేమి లేదు.

ఎన్నికల ముందు ఎవో కొన్ని పథకాలు ప్రవేశపెట్టి డబ్బులు పంపిని చేసినంత మాత్రాన మళ్ళీ గెలుస్తానని అనుకోవడం చంద్రబాబు భ్రమ. జనాలు ఎర్రి పుష్పాలు కాదు ఐదేళ్ళ నుండి ఆయన చేసిన ఘనకార్యాలను చూస్తూనే ఉన్నారు.

ఐదేళ్ళుగా రైతులకు ఆడపడుచులకు చేయలేని సాయం కేవలం ఒక నెల రెండు నెలల ముందు చేస్తే ఏమిటి ప్రయోజనం. అప్పుడు గుర్తురాలేదా? పేదలు, రైతులపై ఎన్నికలు సమీపించగానే ఎక్కడాలేని ప్రేమ పొంగుకొస్తుంది బాబు గారికి.

 పేదలను,రైతులను ఓటు బ్యాంకుగా చూస్తాడే తప్ప ఇంకోటి కాదు.

ప్రత్యేక హోదా గురించి రోజుకో మాట మాట్లాడుతుంటాడు.

అమరావతి , పోలవరం కడుతూనే ఉన్నారు ఎప్పటి వరకు కడతారండి. సగం కట్టి ఆపేస్తారు ఎందుకో ఒక వేళ బాబుగారిని గెలిపించకపోతే అవి ఆగిపోతాయని ప్రజలను తప్పుదోవ పట్టించి మళ్ళీ గెలవాలని ప్లానింగా. రాజకీయాలలో ఇదో ఎత్తుగడ.

ఒక పనిని చేయడానికి మీకు ఐదేళ్ళు కూడా సరిపోవు దిన్ని పూర్తి చేయడానికి మళ్ళీ గెలిపించాలా. ఒక విద్యార్థి పరిక్ష కేంద్రానికి వెళ్ళడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయితేనే బయటికి గెంటివేస్తారు. అలాంటిది మీరు ఒక పనిని చేయడానికి ఐదు సంవత్సరాలైనా చేయకపోతే మిమ్మల్ని ఏం చేయాలి.

ఆంధ్రా ప్రజలు  బాబు గారికి మళ్ళీ ఓట్లేసి అసెంబ్లీకి పంపిస్తారా. లేదా రైతులను పేదలను పట్టించుకోనందుకు, ఐదేళ్ళైనా పూర్తి చేయని పనులవలన ఓడిస్తారా గెలిపిస్తారా  చూద్దాం.....

ఇక రెండో వ్యక్తి  వై యస్ జగన్ గారి గురించి చూస్తే

జగన్ గారి గురించి ప్రజల్లో అనుకూలతలు:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డైనమిక్ ముఖ్యమంత్రి జన హృదయనేత వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అవడం వలన  జనాల్లో ఆయనకు అభిమానం ఎక్కవ.

రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలు చిరస్మరణీయం దేశంలో  ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశ పెట్టని పథకాలు ప్రవేశ పెట్టి పేదలు, రైతులకు ఎంతో మేలు చేసాడు. ఆయన పుత్రుడు జగన్ గెలిస్తే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిలా పరిపాలన చేస్తాడని జనాలు భావిస్తున్నారు.

 రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.

రాష్ట్రంలోని  13 జిల్లాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజల భాధలను దగ్గరనుండి చూసి వారికి అండగా ఉంటానని హామి ఇచ్చి ప్రజలకు దగ్గగరయ్యాడు.

ఇక ప్రతకూలతల విషయానికి వస్తే

జగన్ పై ఉన్న కేసులు.

పరిపాలన అనుభవం లేకపోవడం.

ఎక్కవ శాతం ప్రజలు జగన్ వైపే   మొగ్గుచూపుతున్నారనిపిస్తుంది.

ఇక మూడో వ్యక్తి పవన్ గురించి చూస్తే

గొప్ప సినిమా స్టార్
చిరంజీవి తమ్ముడు

రాజకీయాల్లో మార్పుకోసం తపిస్తున్న వ్యక్తి.

రాష్ట్రంలో ప్రజల కష్టాలు తెలిసిన వాడు . దగ్గరుండి మరీ ప్రజల కష్టాలు ఓర్పుగా వింటాడు.

 పవన్ ప్రతికూలతలు:

2009 లో ఇలాగే రాజకీయాల్లో మార్పుకోసం చిరంజీవి పార్టీని స్థాపించి అనుకున్న  ఫలితాలు సాదించలేక పార్టీని కాంగ్రేస్ లో విలీనం చేసి చేతులు దులుపుకున్నాడు. చిరంజీవిలాగే పవన్ కూడా చేస్తాడేమోనని ప్రజల భయం.

2009  లో చిరంజీవే సీ ఎం అవుతాడని అందరు అనుకున్నారు కాని రాజశేఖర్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయింది ఆయన పార్టీ.

సినిమాలు వేరు రాజకీయం వేరు పవన్ కు
రాజకీయ అనుభవం లేదు.

పవన్ కళ్యాణ్ అంటే యువతకు మాత్రమే తెలుసు పెద్దవయసు  ఓటర్లకు పవన్ అంటే చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు పవన్ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు.

ఇక చివరగా నాలుగో వ్యక్తి కే ఏ పాల్ ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
కామెడి పీస్ బిల్డప్ బాబాయ్.
ఆయన ఏం మమాట్లాడిన జనాలు కామెడిగానే చూస్తారు.

 పాల్  గారు సీ ఎం కాదు కదా ఒక ఊళ్ళో సర్పంచ్ కూడా కాలేరు.

చివరగా నా అంచనా ప్రకారం జగనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.

 ఏ నాయకునికి ఎంత మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారంటే

 జగన్ కు 70 శాతం
 చంద్రబాబు కు 20 శాతం
 పవన్ కు 9 శాతం
 పాల్ కు 1 శాతం ప్రజలు అనుకూలంగా ఉన్నారు.

ఇది కేవలం నాకు అనిపించిన అంచనా మాత్రమే.
తుది నిర్ణయం ప్రజలు నిర్ణయిస్తారు.