అయ్యా చంద్రబాబు మీరు లేకపోతే ఎట్లాగయ్యా మా బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. అన్నదాత సుఖీభవ రద్దు చేశామంటున్నారు. రుణమాఫీ చేయమంటున్నారు ఇట్లగయితే మేం ఎలా వ్యవసాయం చేసేది అంటూ రైతులు చంద్రబాబు వద్ద గొల్లున ఏడుస్తున్నారు. అయ్యా చంద్రబాబు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు భూములరేట్లు పడిపోయాయి ఇలాగయితే మేం బతికెదెట్ల అంటూ
రాజధాని చుట్టు పక్కల ప్రాంత ప్రజలు చంద్రబాబు వద్ద వాపోతున్నారు.
సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని చూసే మేము బీటెక్ చదువుకున్నాం రెపోమాపో జాబ్ వస్తుంది అనుకున్నాం. కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే మాకు జాబు వచ్చేలా లేదు అంటూ నిరుద్యోగులు బోరున విలపిస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు మిమ్మల్ని ఆధర్శంగా తీసుకునే మా పిల్లల్ని చదివిస్తున్నాం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంటీ? మీరు ఓడిపోయిన తర్వాత ఇక ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావట, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతాయట ఇలాగయితే మా పిల్లల భవిష్యత్ ఏంటని చంద్రబాబు గారి వద్ద పిల్లల తల్లిదండ్రులు బోరున విలపించారట. రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకుని తమ కష్టాలను చెప్పుకుని బోరున విలపించారు.
బాబుగారు...
మళ్ళీ మీరొస్తేనే భూముల రేట్లు పెరుగుతాయి, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి,
కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి,
రైతులకు అన్నదాత సుఖీభవ వస్తుంది,
రైతులకు రుణమాఫీ అవుతుంది,
మా పిల్లల భవిష్యత్ బాగుంటుంది మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలని, తమ కష్టాలను తీర్చాలని ప్రజలు నిన్న చంద్రబాబు వద్ద బోరున విలపించారట.