పవన్ కళ్యాణ్ సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేం. మీరు దేవుడు సార్ దేవుడినైనా చూడడానికి జనాలు వస్తారో రారో కాని మిమ్మల్ని చూడడానికి లక్షల మంది వస్తారు. అక్కడ స్థలం సరిపోక పోతే చుట్టూ ఉన్న చెట్లు, స్థంభాలు , హోర్డింగులు, ఆఖరికి కరెంట్ పోల్ కూడా వదలకుండ ఎక్కి చూస్తాం. కరెంట్ పోల్ లో పవర్ ఉంటుంది! షాక్ కొడుతుంది అనుకునేరు మీ పవర్ ముందు ఈ పవర్ ఎంత సార్. ఇంత కష్టపడే బదులు టీవీల్లో చూడవచ్చు కదా అంటారమో!? టీవీలో చూడటం కంటే స్థంభం ఎక్కి చూస్తే వచ్చే కిక్కే వేరప్పా..చూసారా సార్ మీరంటే మాకు ఎంత అభిమానమో! ఒక్కసారైనా మిమ్మల్ని ఎదురుగా చూడాలని ఎదురు చూస్తాం. అవకాశం వస్తే గట్టిగా గట్టిగా కౌగిలించుకుంటాం ఎంత గట్టిగా అంటే మీకు ఊపిరి ఆడనంత గట్టిగా. కౌగిలించుకునే వీలు లేకుంటే మీ కాళ్ళనైన పట్టుకుంటాం అదికూడా గట్టిగా ఎంతలా అంటే మీరు పట్టుకున్న మైక్ విరిగిపోయి మీరు కింద పడిపోయేంతలా. మీకు ఓపిక ఉందో లేదో మాకు అనవసరం మిమ్మల్ని హత్తుకోవడమే మాకు కావాలి. మీరు పడిపోయిన, కిందపడి గిలగిల కొట్టుకున్న మాకు అనవసరం. అలా చేయడం మీమీద మాకు ఉన్న అ....భిమానం.
అంతేనా సినిమా ఫంక్షన్లలో ఎవరి సినిమా అయిన పర్వాలేదు మీ పేరు వినపడితే చాలు మాకు పూనకం వచ్చేస్తుంది మా అరుపులతో హాలు దద్దరిల్లి పోవాలసిందే ఎవరు మాట్లడానికి వీలులేకుండా. అది సార్ మీరంటే మాకు అభిమానం కాదు సార్ వీరాభిమానం.
మీరు స్టేజీపైనా పూనకం వచ్చినట్టు ఊగిపోతు ప్రసంగిస్తుంటే మాకు పూనకాలు వచ్చేస్తాయి. అప్పుడు కూడా గట్టిగా పట్టుకోవాలని ఉంటుంది కాని సెక్యూరిటీ వాళ్ళు రానివ్వరు.
రాష్ట్రం విడిపోయినప్పుడు బాధతో మీరు ఎనిమిది రోజులు అన్నం మానేశారని తెలిసి మేము మీకంటే పదిరెట్లు ఎక్కువగా బాధపడ్డాం రాష్ట్రం విడిపోయినందుకు కాదు మీరు అన్నం మానేసినందుకు!
మాకోసం మీరు ఇంత సహనం, ఓర్పుతో రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడుతున్నారు. అయిన మీకు వచ్చే సీట్లు మాత్రం కూడా అంకెలల్లో నైనా వస్తాయో లేదో. మిమ్మల్ని గెలిపించడం కోసం ఏమైనా చేస్తామో చేయమో కాని మిమ్మల్ని మాత్రం గట్టిగా గట్టిగా పట్టుకోవాడాని ఏమైనా చేస్తాం.
రాజకీయాల్లో మార్పు తీసుకురావడం పవన్ లక్ష్యం.
పవన్ పేరు చెబితే గట్టిగా అరవడం అభిమానుల లక్ష్యం.
సీఎం కావడం పవన్ లక్ష్యం.
పవన్ ను గట్టిగా పట్టుకోవడం అభిమానుల లక్ష్యం.
మీ ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు సార్..
మిమ్మల్ని గట్టిగా పట్టుకోవడానికి ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాం సార్.
జై పవన్ జై పవన్ అభిమాని
_ఒక పవన్ అభిమాని

6 కామెంట్‌లు:
ఈ పవన్ కల్యాణ అభిమానిని చూసి జాలిపడండి!
పవన్ కళ్యాణ ముఖ్యమంత్రి పదవిని గట్టిగా పట్టుకుంటాడు.
అభిమానులు పవన్ కళ్యాణ గారిని గట్టిగా పట్టుకుంటారు.
డబ్బుపిచ్చీ, అధికారం పిచ్చీ పవన్ కళ్యాణ్‍ను గట్టిగా పట్టుకుంటాయి.
అష్టదరిద్రాలూ అంద్రప్రజానీకాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాయి.
పవనయ్యకు పూనకం వచ్చిందంటే పంచలు ఊడి పోతాయి.రెండు చోట్ల చిత్తుగా ఓడి పోతాడు. పాపం ఆతన్ని చూస్తే జాలి వేస్తుంది.
ఎవరి పంచలు ఊడిపోతాయండి.? పవనయ్య కూడా పంచెలు కడుతున్నాడు.!
కాపులందరూ గ్లాసుకే ఓటువేసామని చెపుతున్నారు. రెండుచోట్లా ఓడిపోతారంటారా ?
అష్టదరిద్రాలూ అంద్రప్రజానీకాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాయి.
😭😭😭
కామెంట్‌ను పోస్ట్ చేయండి