మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. ఈ ఒక్క మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఒంట్లో వచ్చే రోగాల్లో 70% మలబద్ధకం వల్లే వస్తాయి. అందులో పైల్స్, ఫిషర్, ఫిస్టులా, IBS, IBD, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వ్యాధులు మలబద్ధకం వల్లే వస్తాయి కదా..
ఈ సమస్యను చాలా మంది పట్టించుకోరు. దీనివలన ముందు ముందు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నివారించుకోవాలి. మలబద్దకం ఉందని డాక్టర్ వద్దకు వెళితే డాక్టర్లు ఏవో ట్యాబ్లెట్స్, టానిక్ లు ఇచ్చి పంపిస్తారు. అవి వాడినన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత మళ్ళీ ఈ సమస్య వస్తుంది. పైగా ఈ ట్యాబ్లెట్లు వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకొందరు ప్రకృతి వైద్యులు చెబుతుంటారు నీళ్ళు ఎక్కువగా తాగితే మలబద్దకాన్ని జాడిచ్చి తన్నుతుంది అని చెబుతుంటారు. ఉదయం లేవగానే 1¼లీటరు గోరు వెచ్చని నీరు తాగి పది నిమిషాలు నడిస్తే మోషన్ ఫ్రీగా అవుతుంది అని చెబుతుంటారు. నేను ఇలాగే చేసాను కానీ మోషన్ రాలేదు కాని వికారం, తల నొప్పి మాత్రం వచ్చాయి. పది నిమిషాల తర్వాత మూత్రం వచ్చింది కాని మోషన్ రాలేదు. ఇలా ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం వలన మోషన్ అందరికి రాకపోవచ్చు. మరి అలాంటి వారు ఏం చేయాలి?
మలబద్ధకం పోవాలంటే పీచు పదార్థాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అంటారు. ఆ పీచు అంటే ఏమిటో , అంది ఎందులో ఉంటుందో చాలా మందికి తెలియదు. పీచు ఉండే పదార్థాలు, పండ్లు వెతికి తెచ్చుకుని తినాలంటే అంత ఆర్థిక స్థోమత అందరికి లేకపోవచ్చు. మరి అలాంటి వారు ఏమి చేయాలి??
నేను ఓ డాక్టరను కాను, ప్రకృతి వైద్యున్ని కాను, సైంటిస్ట్ ని కాను కాని నాకు కలిగిన అనుభవం ప్రకారం చెబుతున్నాను మలబద్ధకానికి చాలా చవకైన మందు ఉంది ఇది ప్రతీ ఊళ్ళో ఉంటుంది. దీన్ని రైతులు, కూలీలు ప్రతీరోజు తాగుతూనే ఉంటారు. ఇప్పటికే అది ఏంటో మీకు అర్థం అయి ఉండొచ్చు. అదేనండి "కల్లు". కల్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్యే కాదు అసలు ఎలాంటి రోగం కూడా రాదు. ఎందుకు చెబుతున్నానంటే ప్రతిరోజు కల్లు తాగే వారు ఆసుపత్రికి వెళ్ళడం నేను ఎప్పుడు చూడలేదు. కల్లు తాగే వారు చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. నేను కల్లు తాగే వారిని చూస్తే కోప్పడేవాడిని. కల్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పేవాడిని. కల్లు అంటే అసహ్యించుకునే వాడిని. ఇప్పుడు మలబద్ధకం సమస్య వల్ల నేను బాధపడుతుంటే కల్లు తాగితే తగ్గుతుందని చెబితే అయిష్టంగానే తాగాను. ఆశ్చర్యంగా ఉదయం లేవగానే మోషన్ ఫ్రీగా అయ్యింది. ఎన్నో రోజులుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను కల్లు తాగగానే నాకు ఈ సమస్య తగ్గిపోయింది. నేను అందరికి చెప్పేది ఏంటంటే మీకు మలబద్ధకం సమస్య ఉంటే కల్లు తాగండి. ఈ కల్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
తాటికల్లు |
ఈ కల్లులో ఈతకల్లు, తాటికల్లు, మామూలు కల్లు వంటివి ఉంటాయి కదా. అందులో ఈతకల్లు, తాటికల్లు ఎంతో శ్రేష్టమైనవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి అందుబాటులో లేనివారు ఊళ్ళలో దొరికే మామూలు కల్లు తాగవచ్చు సమస్య తగ్గేవరకు. మా గ్రామాల్లో చాలా వరకు ఈతకల్లు కొంతవరకే లభిస్తుంది. మొత్తంగా మామూలు కల్లు మాత్రమే లభిస్తుంది. దీనిని మందుకల్లు అంటారు. ఈ కల్లు ప్రతిరోజు తాగేవారిని నేను చూస్తాను వీళ్ళకు ఎలాంటి అనారోగ్యాలు లేవు ఆరోగ్యంగా ఉన్నారు.
నేను అందరికి చెప్పేది ఏంటంటే ఒక్క మలబద్ధకం వల్లే 70% రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీనిని తగ్గించుకుంటే ఏ రోగాలు రావు. ఇది రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ కల్లు తాగండి. రోజు తాగడం వీలుకాకుంటే సమస్య వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా తాటి కల్లు లేదా ఈతకల్లు తాగండి.
మలబద్ధకం తో బాధపడే వారు నేను చెప్పినట్టు ఈతకల్లు, తాటికల్లు తాగి చూడండి. తప్పకుండా మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. మీకు ఈ సమస్య ఉంటే కల్లు తాగి చూడండి మళ్ళీ నాకు మీ సమస్య తగ్గిందో లేదో మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి..
నేను చెప్పినట్టు ట్రై చెసి చూడండి మలబద్దకాన్ని వదిలించుకోండి. తప్పకుండా మీ అభిప్రాయం తెలియజేయండి..