కొన్ని సినిమాలు ఎందుకు హిట్ అవ్వావో అర్థం కాదు. ప్రతినిత్యం సమాజంలో నిత్యావసర పదార్థాలను ఎలా కల్తీ చేస్తారో చూపించిన మంచి సినిమాలను జనాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. అలాంటి సినిమాల్లో ఒక సినిమా సిద్దార్థ్ నటించిన "వదలడు". ఈ సినిమాలో ఇప్పుడు మార్కెట్లో లభించే వంటనూనెలు, టీ పొడి, డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ వంటి వాటిని ఎలా కల్తీ చేస్తారో చూపించారు. ఇది 100% నిజం.
ఇలాంటి కల్తీల గురించి మాకు తెలుసు అనుకోవచ్చు. కాని ఇది కొందరికే తెలుసు. నిరక్షరాస్యులు, పేదవారు ఈ కల్తీల గురించి పట్టించుకోరు. మంచి నూనె కల్తీ గురించి ఎవరు పట్టించుకోరు డబ్బాలో కల్తీ నూనె బయట మాత్రం బ్రాండెడ్ కంపెనీల పేర్లను కొద్దిగా అటు ఇటు మార్చి ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి కల్తీనూనెలను నేను చూసాను అందులో నుండి చెత్తా చెదారం, నూనెలో వేయించిన పిండిపదార్ధాలు కూడా వచ్చాయి. అలాగే టీ పొడిని, వాటర్ బాటిల్స్ కల్తీ కూడా నిజం...
ఆహార పదార్థాలు ఎలా కల్తీ చేస్తారో ఈ కింది వీడియోలో చూడండి...
https://youtu.be/DyJSBfWakAc
2 కామెంట్‌లు:
కల్తీ నూనెలతో కల్తీ పదార్ధాలతో బయటి తయారుచేసే బజ్జీలు, పాని పూరి, బర్గలు, పిజలు ఆబగా తినే వారిని చూస్తే జాలి వేస్తుంది.
ఆరోగ్యం పాడయ్యేవరకు ఎవరు ఇలాంటివి తినడం మానరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి