జ్యూట్ బ్యాగ్ |
నిత్యవసరసర వస్తువులకోసం కిరాణస్టోర్, సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు వస్తువులను ప్లాస్టిక్ కవర్లో వేసి ఇస్తారు అదికూడా 5 రూపాయలు కవర్ కు ఛార్జ్ చేస్తారు. అలా మనం ఇంటికి తెచ్చిన ప్లాస్టిక్ కవర్ మళ్ళీ మార్కెట్ కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడదు. బయట పారేస్తాం ఇలా పారవేయడం వలన పర్యావరణానికి అది ఎంత నష్టమే మనకు తెలుసు .
కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్లో వస్తువులు తీసుకురాకుండా ఇంటినుంచే జ్యూట్ బ్యాగులను మార్కెట్ కు తీసుకెళ్దాం. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్ వాడటం మానేసి పర్యావరణానికి మేలు చేసిన వారమవుదాం దాంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది. మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి కవర్ కొనాలి అదే ఈ జ్యూట్ బ్యాగ్ ఒక్కసారి కొంటే సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు.
ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మేం ఒక్కరం ప్లాస్టిక్ వాడటం మానేస్తే పర్యావరణం బాగుపడుతుందా అని అనుకోవచ్చు. ఒక్కరమే కదా అని అందరూ అనుకుంటే మార్పు రాదు. మార్పు అనేది మన నుండే ప్రారంభం కావాలి. ఒక్కటే కవర్ కదా అని పారేస్తే అది ఎక్కడో చోట తగలబడి కాలుష్యాన్ని వెదల్లుతుంది. అది మీదాక రాకుండా ఉండదు.
మీరు ఎప్పుడైనా నగర శివార్లలో గాని, పట్టణ శివారులో చూస్తే ప్లాస్టిక్ కవర్లను పెద్ద పెద్ద గుట్టలుగా పోసి తగలబెడుతుంటారు. అక్కడ మనం ఒక్క క్షణమైన ఉండగలమా ఆ పొగకి ఉక్కిరిబిక్కిరి అవుతాం. అలాంటిది ఆ కలుషితమైన గాలిని రోజు పీల్చే ఆ ప్రాంతంలో నివసించే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి ఈ భూమిపై నివసించడానికి దేవుడు మనకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించి ఇచ్చాడు. అభివృద్ధి పేరుతో మనం దానిని నాశనం చేసి పీల్చేగాలి త్రాగే నీరు కలుషితం చేసి రోగాలబారిన పడేలా చేస్తున్నారు. కాబట్టి ప్లాస్టిక్ కవర్ల వాడకం మానేసి పర్యావరణాన్ని కాపాడండి..
జ్యూట్ బ్యాగులను వాడండి ...
ఏమంటారు ఒకసారి ఆలోచించండి...🤔🤔
జ్యూట్ బ్యాగులను ఇక్కడ క్లిక్ చేసి కొనండి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి