భానోదయం: ఇప్పుడు జానపద గాయకులు సినిమాలకు పబ్లిసిటీ... సారంగదరియా...

16, మార్చి 2021, మంగళవారం

ఇప్పుడు జానపద గాయకులు సినిమాలకు పబ్లిసిటీ... సారంగదరియా...

 

     

                       సారంగదరియా పాట‌ గురించి కొన్నాళ్ళుగా వివాదం నడుస్తుంది. ఈ పాట‌ను శేఖర్ కమ్ముల  లవ్ స్టోరీ సినిమాలో తనకు చెప్పకుండానే వాడుకున్నారని జానపద గాయని కోమలి గారు ఆవేదన వ్యక్తం చేశారు.

      సారంగదరియా పాట‌ను మొదట‌గా పాడింది కోమలి. యూట‌్యూబ్ లో ఆమె పాడిన పాట‌ కూడా ఉంది. జానపద పాట‌లలో ఈ పాట‌ కొంచం ఫేమస్ సాంగే. కానీ అంత పెద్ద ఫేమస్ కాదు. కానీ ఈ వివాదం వల్ల చాలా ఫేమస్ అయ్యింది. సింగర్ కోమలి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఈ వివాదం వల్ల ఆమె అందరికి తెలిసింది. నటుడు మోహన్ బాబు ఆమెని "మొసగాళ్ళు"  సినిమా ఫంక్షన్ కి పిలిచి మోసం చేయడం గురించి ఒక పాట‌ను కూడా పాడించారు. సినిమాల్లోనూ పాట‌లు పాడే అవకాశం కల్పిస్తాను అన్నారు.  ఆ తర్వాత కోమలి గారిని సత్కరించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సారంగదరియా పాట‌ వివాదం కాకుంటే ఆమె ఇక్కడ వరకు వచ్చేదా.?
 
           మోసగాళ్ళు సినిమాకి  సింగర్ కోమలి గారిని పిలిపించి మోసం చేయడం మీద పాట‌ పాడించడం ఎందుకో....?

ఒకరు పాడిన పాటను వారికి తెలికుండా వాడుకోవడం కాపీరైట‌్ ఇష్యూ వస్తుందని సామాన్యులకు కూడా తెలుస్తుంది. కానీ శేఖర్ కమ్ముల, సుద్దాల ఆశోక్ తేజ  వంటి పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్స్ కి, రైట‌ర్స్ కి తెలియదా..? 

        ఇలా వివాదం జరిగుతుంది అని తెలిసే చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటివి చేస్తుంట‌రనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి వివాదాలే సినిమా పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు. కానీ శేఖర్ కమ్ముల వంటి మంచి దర్శకులు కూడా ఇలాంటివి చేయడం చూస్తుంటే తన సినిమా మీద తనకు నమ్మకం లేకపోవడమే అవుతుంది. 

    ఏది ఏమైనా ఈ సారంగదరియా పాట‌ వివాదం వల్ల అందరికి మంచే జరిగింది. కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం వచ్చింది. శేఖర్ కమ్ముల సినిమా కు పబ్లిసిటీ వచ్చింది.

    ఇక మోహన్ బాబు గారు కోమలి గారికి సినిమాల్లో పాట‌లు పాడే అవకాశం తప్పకుండా ఇవ్వాలి లేదంటే ఆయన కూడా ఈ వివాదాన్ని మోసగాళ్ళు సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని అర్థమవుతుంది.,,,!!

    ఈ మద్య గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన చాలామంది    గాయనీ గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు. అసలు సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేని వారు సైతం అద్భుతంగా పాడి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు.  అందులో అరవై ఏళ్ళ వయసులో సైతం "ఆడనెమలి" పాట‌తో సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు "కనకవ్వ" గారు..

    ఇలా చాలా మంది  ప్రతిభ ఉన్న గాయని గాయకులు తమ ప్రతిభతో పైకి వస్తున్నారు.

వీరి ప్రతిభను కొంతమంది  సినిమాల్లో వాడుకుంటున్నారు.

నిజంగా సినిమా వాళ్ళకు ఇలాంటి వారిపై ప్రేమ ఉంటే వారికి అవకాశాలు ఇవ్వాలి కానీ వారిని తమ సినిమా ప్రచారాల కోసమే, తాము పే....ద్ద దయాహృదయులమని ప్రజల్లో చాటుకోవడం కోసమె చేస్తున్నారే తప్ప నిజంగా వారిని పైకి తేవాలని అయితే కాదు....  అని నాకు అనిపిస్తుంది...

      ఆ మద్య 2018లో  బేబి అనే ఆవిడ చాలా బాగా పాట‌లు పాడుతుందని, ఆమెది చాలా అద్భుతమైన గొంతు అని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తంగా ఆమెని ఆకాశానికి ఎత్తేసారు... సంగీత దర్శకులు కోటి గారు, రఘుకుంచె గారు, పొగడ్తలతో ముంచెత్తారు. చిరంజీవి గారు తన ఇంటికి పిలిచి సత్కరించారు.  
బేబీ గారిని మట‌్టిలో మాణిక్యం అంటు పొగిడారు.
ఆ మట‌్టిలో మాణిక్యం ఇక సినిమాల్లో పాడుతూ బిజీగా అయిపోతుంది అనుకున్నాం... కానీ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఆమె పాడింది లేదు... అసలు ఏమైంది ఈ మట‌్టిలో మాణిక్యం..
అంత పెద్ద సినిమా స్టార్స్   పొగిడిన బేబీ గారు ఇప్పటి వరకు ఒక్క పాట‌ పాడింది లేదు...

రామ్ గోపాల్ వర్మ
అబ్బ సొత్తు కాదురా టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ... అన్నట‌్టు... టాలెంట‌్ మన దగ్గర ఉంటే ఎవరి సహాయం అవసరం లేదు. ముఖ్యంగా సినిమా రంగంలో.
           

ఈ మద్య ఎవరికైనా కొంచెం టాలెంట‌్ ఉన్న వారిని ఈ సినిమా వాళ్ళు షేర్ మార్కెట్ లో  షేర్ లాగా బాగా పైకి ఎత్తుతారు...

అప్పుడు  వీళ్ళ  పరిస్థితి ఎలా ఉంటుందంటే  ఫండమెంట‌ల్ గా , టెక్నికల్ గా అంత బలంగా లేని షేర్ అప్పర్ సర్క్యూట‌్ లోకి వెళ్ళి. ఆ తర్వాత అమాంతం ఢమాల్ న కిందపడిపోయి షేర్ మార్కెట్ నుండి  డీలిస్ట్ అయిపోయినట‌్టు ఉంటుంది..

  కాబట్టి ఎవరో పొగిడారని ఇక తమ జీవితం రంగులమయం అవుతుందని కలల లోకంలో విహరించకండి.

గొప్ప స్టార్స్  చుక్కలే చూపిస్తారు.
ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి..

అందుకే  ఎవరో పొగిడారని పొంగిపోవద్దు మనలో టాలెంటు ఉంటే మనమే పైకి వస్తాం.

ఎవరి సహాయం అవసరం లేదు.  మీలో టాలెంటు ఉంటే    

యూట‌్యూబ్ లో ఛానెల్ పెట్టి పాట‌లు పాడండి చాలు.

యూట‌్యూబ్ మిమ్మల్ని స్టార్స్ ని చేస్తుంది..

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

good suggestion