సినిమా అంటే సామాజిక స్పృహ ఉండి సమాజానికి మంచి సందేశం అందించాలి. కాని ఇప్పుడు సినిమా అనేది వ్యాపారం. ఇప్పుడనే కాదు పౌరాణిక సినిమాల నుండి సాంఘిక సినిమాలకు ఎప్పుడైతే సినిమా ప్రవేశించిందో అప్పటి నుండి సినిమా వ్యాపారమే కాని అప్పటి దర్శక నిర్మాతలు మరీ ఇంత దిగజారిపోయి సినిమాలు తీసేవారు కాదు. అలాగే సినిమాలు ప్రచారం చేసుకోవడానికి ఇంత దిగజారిపోయెవారు కాదు.
పూరీ జగన్నాథ్, విజయ్ దెవరకొండ ఇద్దరు టాలీవుడ్లో ఉద్దండులే. ఒకరు పోకిరి, దేశముదురైతే ఇంకొకరు అర్జున్ రెడ్డి..
ఒకాయన సినిమాలో డ్రగ్స్, డాన్లు, గన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి.
ఇంకొకాయన అర్జున్ రెడ్డి ఈయన ఆయనకంటే ఒక డోసు ఎక్కువే. మందు, డ్రగ్స్, రొమాన్స్, పవర్ ఫుల్ బూతులు..
వీళ్ళ సినిమాలు పెద్ద హిట్స్ ఉన్నాయి..
ఇంత పెద్ద హిట్టు సినిమాలు తీసిన ఈ ఉద్దండులు ఇద్దరు కలిసి సినిమా తీస్తే టాలీవుడ్, బాలివుడ్, కోలివుడ్ ఆ వుడ్ ఈ వుడ్ అన్ని వుడ్లు సాలా ఉ...
పోసుకోవల్సిందే...
అలాంటిది ఏంటిది మరీ ఇంత చీప్ గా ప్రమోషన్స్ ఆ పోస్టర్ ఏంటీ.? ఈ లైగర్ సినిమాలో అదొక్కటే ఉందా..
బాక్సింగ్ నేపథ్యం అంటున్నారు బాక్సింగ్ లో ఇలా మొత్తం నగ్నంగా ఉంటారా..ఏంది?
ఇలాంటి బాక్సింగ్, కబడ్డీ లాంటి సినిమాలు చాలానే ఉన్నాయి మళ్ళీ ఎందుకో ఈ సినిమా..
నాకు తెలిసి ఇది ఫ్లాప్ సినిమా జనాల్లో పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలాంటి చెత్త, కాంట్రవర్సీ పోస్టర్స్ రిలీజ్ చేసినట్లున్నారు..
టాలెంట్ ఉంటే మంచి సినిమాలు తీయండి ఇలాంటి చెత్త ప్రచారాలు చేసి సినిమాలు పబ్లిసిటీ చేయకండి...
ఇలా దరిద్రపు ప్రచారం వల్ల సినిమాలు హిట్లు కావు సినిమాలో మంచి కథ ఉండాలి. నువ్వు ప్రచారం చేయకపోయినా సినిమా హిట్టవుతుంది.
నాకు అనిపిస్తుంది అసలు పూరి జగన్నాథ్ సినిమాల్లో కథ ఉంటుందా అని... ఆయన సినిమాలు ఎలా హిట్టు అయ్యాయో అర్థం కాదు..
ఈ సినిమాలో కూడా కథ ఉండదు అర్జున్ రెడ్డి ని, మైక్ టైసన్ ని పెట్టిన సినిమా ఆడదు..
ఆ విషయం ముందే పూరీ కి తెలిసి ఇలాంటి చెత్త పోస్టర్స్ ని రిలీజ్ చేసి పబ్లిసిటీ చేస్తున్నాడు.
సినిమా విజయం సాధించాలంటే ఇలాంటి చెత్త పబ్లిసిటీ కాదు. కథ బాగుంటే ప్రేక్షకులే పబ్లిసిటీ చేస్తారు.
కె.జి.ఎఫ్ సినిమా విడుదలకు ముందు అసలు ఎవరికి అంతగా తెలియదు విడుదలైన తర్వాత ప్రేక్షకుల పబ్లిసిటీ తో ఘన విజయం సాధించింది. సినిమా అంటే కెజిఎఫ్ లా ఉండాలి. అంతేకాని సరైన కథ లేదు తోటకూర కట్ట లేదు అన్నట్టు ఇలాంటి సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు అందుకే ఈ నగ్న పోస్టర్స్ విడుదల చేసి చీప్ పబ్లిసిటీ చేస్తున్నారు..
ఏమయ్యా పూరి ఎందుకయ్యా నీ సినిమాలు ఎవడికి ఉపయోగం....
సమాజాన్ని రెచ్చగొట్టే సినిమాలు కాదు, సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయ్యు. ఎందుకంటే సినిమా అనేది ఒక బలమైన ప్రచార సాధనం దాన్ని ఇలా చెత్తగా ఉపయోగించకండి. యువత మీరు తీసే సినిమా హీరోల మాదిరి తయారవుతారు. మీ సినిమాల్లో హీరోలు చేసినట్లు బయట ప్రపంచంలో చేస్తుంటారు హీరోయిజం చూపిస్తుంటారు... మీరు చూపించే వెర్రి వెకిలి చేష్టలనే హీరోయిజం అనుకుని బయట జనాలను ఇబ్బందులు పెట్టి ఇబ్బందులు పడుతుంటారు...
కాబట్టి చేతనైతే మంచి సినిమాలు తియ్ లేదంటే....
నీ ఇష్టం ఇగా... నేనేం చెప్పలేను ఎందుకంటే ఎవ్వడి మాట వినద్దు మనిషి మాట అస్సలు వినద్దు అంటావ్....
ఇప్పుడు ఇలాంటి pk లాంటి పోస్టర్స్ అదేనండి అమీర్ ఖాన్ పీకే సినిమా పోస్టర్స్ లా విడుదల చేసారు.
ఇక ముందు ముందు ఎలాంటి చిత్రాలు చూపిస్తారో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి