భానోదయం: బంధాల బాధ్యత - ఒక చేదు నిజం

17, ఏప్రిల్ 2026, శుక్రవారం

బంధాల బాధ్యత - ఒక చేదు నిజం

 


కొందరి జీవితాలు చూస్తే ఎంత హృదయవిదారకంగా ఉంటాయంటే వారిని చూస్తే చాలా  బాధ కలుగుతుంది.


రాత్రి 10 అవుతుంది. చుట్టుపక్కల ఇళ్ళవారు అందరూ పడుకున్నారు.


మంచం మీద నుండి పక్కకు కూడా మరలలేని శరీరం. వెళ్ళెకిలా పడుకున్న ఆయనకు పక్కకు తిరిగి పాడుకుందామంటే రావడం లేదు. ఆయనకు సేవలు చేసే కూతురు పైన అంతస్తులో పడుకుంది.. ఆయన అరిచి అరిచి అలసిపోయాడు.


ఆయన కళ్ళు, చెవులు,నోరు మాత్రమే పనిచేస్తున్నాయి చేతులు కూడా పనిచేయవు ఒక కాలు లేదు, భారీ కాయం ఆయన ఎంత సేపటి నుండి అరుస్తున్నాడో తెలియదు. నేను టాయిలెట్ కోసం బయటకు వచ్చా ఆయన అరుపులు వినిపిస్తున్నాయి. "ఓయమ్మా.., ఓయమ్మా.., మమ్మీ .., మమ్మీ" అని అరుస్తున్నాడు.


ఆయన మంచం పక్కనే షెటర్ ఉంది దాన్ని తడుతున్నాడు .. "దేవుడా నాకు చావు ఇవ్వు" అని దీనంగా ఏడుస్తున్నాడు.. 


నేను ఆ షెటర్ దగ్గరకు వెళ్ళి ఏమైంది స్వామి అని అడిగా ఏమి అనలేదు. బహుశా ఆయనకు వినపడలేదేమో అనుకుని నేను మా ఇంట్లోకి వెళ్దామనుకున్నా. 


ఇంతలో మళ్ళీ గట్టిగా మమ్మీ , ఓయమ్మా అని మళ్ళీ అరుస్తున్నాడు..


నేను షెటర్ దగ్గరకు వెళ్ళి ఏమైంది స్వామి అని రెండు  సార్లు పిలిచాను. ఆయన పలకడం లేదు ఆయనకు చెవులు వినపడవేమో అని వెళ్ళిపోదాం అని వస్తున్నా .

ఇంతలో శేఖర్ , శేఖర్ అని పిలిచాడు షెటర్ దగ్గరకు వెళ్ళి అడిగా ఏమైంది స్వామి అని.


నాకు ఎలాగో అవుతుంది ఉదయం నుండి తినలేదు పండ్లు అయిపోయాయి. వెళ్ళికిలా పడుకోవడం వలన ఎలాగో అవుతుంది అన్నాడు మమ్మీని  పిలవాలా అని అడిగా, షెటర్ తీయు అన్నాడు షెటర్ పైకి  లేపాను .. 


ఆయన వెళ్ళికిలా పడుకొని ఉన్నాడు ఎదురుగా కూలర్ తిరుగుతుంది. బాగా గాలి వస్తుంది..

ఆ గాలికి ఊపిరి ఆడటం లేదో, ఎక్కువ సేపు వెళ్ళికిలా పడుకోవడం వలన శరీరం మొద్దుబారి పోవచ్చు.. 


శేఖర్ నన్ను ఒక పక్కకు లాగు అన్నాడు.

సరే అని పక్కకు లాగాడానికి ప్రయత్నించా. కొంచెం కష్టమైన ఆయనను పక్కకు జరిపా.


ఆయనది భారీశరీరం నేను చాలా బక్కగా ఉంటాను ఎలాగోలా ఒక పక్కకు జరిపాను..


ఇప్పుడు ఒక పక్కకు తిరిగి పడుకున్నాడు ఇప్పుడు కొంచె పర్లేదు బాగుంది అన్నాడు. స్వామి నీళ్ళు తాగుతారా అని అడిగా ఇప్పుడు వద్దు తర్వాత తాగుతా మా అమ్మాయి పక్కన పెట్టింది అన్నాడు..


ఇక పడుకుంటా షెటర్ కిందకు వేయమన్నాడు.

షెటర్ కిందకు వేసి వచ్చేసా..


నాకు ఆయన పరిస్థితి చూస్తుంటే అర్థమయ్యింది.


ముందుగా 


"ఆరోగ్యమే మహాభాగ్యము"


మనకు సంపదలు, డబ్బులు,ఆస్తులు, అంతస్తులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే, మన శరీరం మనకు సహకరించకపోతే ఎన్ని సంపదలు ఉన్నా దండగే.


ఆరోగ్యమే లేకపోతే


బంధువులు,స్నేహితులు, తోడబుట్టిన వారు, చివరకు కన్న బిడ్డలు కూడా పట్టించుకోరు.. 


ఒకవారం మహా అయితే ఒక నెల నీ బాధను భరిస్తారు తర్వాత వదిలేస్తారు.. అప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం.


ఈ ప్రపంచంలో నీ ఆరోగ్యం పాడయ్యి నీ శరీరం కూడ కదలలేని స్థితిలో ఉండి కేవలం మాట్లాడడం, చూడటం తప్పితే ఒకరి సహాయం లేకుండా తినకుండా, ఒకరి సహాయం లేకుండా మలమూత్ర విసర్జన చెయ్యలేకపోతే బతికున్న జీవచ్ఛవంలా అయిపోతుంది జీవితం..


ఇలాంటి దీనిమైన స్థితిలో ఉంటే 


బంధువులు,స్నేహితులు, కన్నబిడ్డలు ఇంటికి రావడమే మానేస్తారు..


ఈ స్వామి విషయంలో ఇదే జరిగింది ఆయనను చూడటానికి ఎవరు రారు, ఆయన పెద్దకూతురు పెళ్లి చేసుకోలేదు ఆవిడే ఆయన బాగోగులు చూసుకుంటుంది. ఆమె మాత్రం ఎన్ని రోజులు భరిస్తుంది.. అందరు తప్పించుకున్నారు ఆమె కూడా ఎటో వెళ్ళిపోయేది కాని జన్మనిచ్చిన తన తండ్రి రుణం తీర్చుకుంటుంది అనుకోవాలి..


స్వామి గారి కొడుకు సిటీ వెళ్ళిపోయి బ్రతుకుతున్నాడు.

తండ్రి బాగోగులు పట్టించుకోడు.

ఆయన ఫ్యామిలి తో బయట ఆయన బ్రతుకుతున్నాడు. ఈ పరిస్థితుల్లో  తండ్రికి ఎక్కడికైనా తీసుకెళ్ళి కనీసం ఆయన తనంతట తాను నడుస్తూ, తన పనులు తాను చేసుకునేవిధంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తే బాగుండేది కాని బాద్యతల నుండి తప్పుకుని దూరంగా వెళ్ళిపోయాడు..


మళ్ళీ ఆయన చేసే పని పౌరోహిత్యం..

దేవుడు కూడా వీళ్ళను ఎలా క్షమిస్తాడో మరీ..


ఇలాంటి కొడుకులు ఉండి ఏం ప్రయోజనం..


వాళ్ళ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియవు కాని ఒక కొడుకుగా కనీసం బాధ్యత నిర్వర్తించాలి..


ఆయన అన్ని విధాలా ప్రయత్నించి ఇక తన తండ్రి నడవలేడు అని ఆయన పరిస్థితి చూడలేక  వెళ్ళిపోయాడో, డబ్బులు ఖర్చవుతాయనో మొత్తానికి దూరంగా వెళ్ళిపోయాడు..



జీవితంలో కొన్ని సంఘటనలు మనకు కొన్ని జీవిత పాఠాలు నేర్పిస్తాయి. నాకు ఈరోజు ఈ సంఘటన ఒక పాఠం నేర్పింది...


ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల శ్రేయస్సు కోసం చిన్నప్పటినుండి శ్రమిస్తారు, కాని వారు అనారోగ్యంతో బాధపడుతుంటే సేవ చేయాల్సింది పోయి దూరంగా వెళ్ళిపోవడం చూస్తే ...


సమాజం చాలా స్వార్థమైనది అని అనుకుంటాం కాని నీ కన్న బిడ్డలే స్వార్థపరులైపోతున్నారు...


చిన్నప్పటి నుంచి పిల్లలకు పెద్దల పట్ల గౌరవం, సేవ చేసే గుణం,బందాలు, బాధ్యతలు పట్ల  వివరించాలి లేదంటే యుక్త వయసు రాగానే బాధ్యతలు నుంచి తప్పుకుని తమదారి తాము చూసుకుంటూ వెళ్ళిపోతారు..



ఈ ప్రపంచంలో ఎవరూ ఏ సంపదలు వచ్చేటప్పుడు తీసుకుని రారు, పోయేటప్పుడు తీసుకుపోరు..


కాని ఆ సంపద కోసం ఉరుకులు,పరుగులు.

ఆ సంపదకోసం మోసాలు, యుద్ధాలు.

సంపద ఉంటేనే సమాజంలో గౌరవం అని, లేకపోతే హీనంగా చూస్తారని ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని పరుగులు తీస్తుంటారు.


ఎవరి కోసమైతే సంపాదన పరుగులో పడి అనారోగ్యం పాలైతావో చివరకు  వారు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు..


 

పిల్లలకు ఆస్తులు, అంతస్తులు కాదు ఇవ్వాల్సింది.

మంచి విద్య,విలువలు,ఆప్యాయతలు,అనురాగాలు ఇవి చాలు జీవితంలో హాయిగా మీతో బ్రతికేస్తారు...















కామెంట్‌లు లేవు: