భానోదయం

23, మే 2019, గురువారం

నరేంద్ర మోది, రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని..??

భారతదేశ ప్రధానిగా ఎవరు గెలిచేదెవరు..,

ఈ ఎన్నికల్లో బిజేపి కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటి
ఒక వైపు నరేంద్ర మోది మరో వైపు రాహుల్ గాంధీ ఇద్దరిలో గెలుపెవరిది. ఈ దేశ ప్రజలు ఎవరికి ప్రధానమంత్రిగా పట్టం కట్టబోతున్నారు.

జస్ట్ మరికొన్ని గంటల్లో ఫలితం తేలబోతుంది.
ఇక నరేంద్ర మోది మరియు రాహుల్ గాంధీ ఇద్దరి పట్ల జనాల్లో ఉన్న అనుకూలతలు ప్రతికూలతలు చూద్దాం.

నరేంద్ర మోది:

  ఛాయ్ అమ్మే వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త నుండి ఈ దేశాన్ని పాలించే స్థాయికి ఎదిగాడు.

అందరి నాయకుల్ల అవినీతికి పాల్పడి వేల కోట్లు దోచుకోవడానికి ఆయనకు కుటుంబం లేదు.

కుటుంబ పాలనకు దూరం.

ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక వాతావరణం నెలకోల్పాడు.

మోది వచ్చాక గడిచిన ఐదేళ్ళలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అదే కాంగ్రెస్ పాలనలో అయితే  దేశంలో ఎప్పుడు బాంబు దాడులతో అల్లకల్లోలంగా ఉండేది.

ఏ ప్రధాని చేయలేని సాహసం మోది చేసారు. అసలు ఎవరు కలలో కూడా ఊహించని విధంగా నోట్లరద్దు చేసాడు.

జిఎస్టీని అమలు పరిచాడు.

పాకిస్థాన్  ఉగ్రవాదులపై  రెండు సార్లు సర్జికల్ దాడులు చేసి తగిన గుణపాఠం చెప్పాడు.

మోది వల్ల ఈ దేశం కొంచెం ప్రశాంతంగా ఉంది.

దేశంలో ప్రాంతీయ పార్టీలన్ని కలిసి నరేంద్రమోడిని ఓడించాలని చూస్తున్నారు. 22 పార్టీలు ఒక వైపు బిజెపి ఒక వైపు. ఈ పార్టీలన్ని ఒకటైనప్పుడే అనిపిస్తుంది ఒక్కడిని ఓడించడానికి అందరూ కలిసారు అంటే వీరికి దేశ ప్రయోజనాలకంటే మోడిని ఓడించడమే ముఖ్యం. ఇది మోడి గారికి కలిసొచ్చే అంశం. ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

ప్రతికూలతలు:

నోట్లరద్దు అంశం ఈ నోట్లరద్దు వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురయ్యారు. నోట్లరద్దు వల్ల నల్లధనం బయటికి రాకపోగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

జీఎస్టీ వల్ల సామాన్యులకు ఒరిగిందేమి లేదు.

మోడి హాయంలో జవాన్ లపై దాడులు పెరిగిపోయాయి.

మేకిన్ ఇండియా లాంటివి  ప్రగతి సాదించలేకపోయాయి.

మోది హిందు పక్షపాతి అని  ఇతర పార్టీల వాళ్ళ ఆరోపణ.

రాహుల్ గాంధీ:

మాజీ ప్రధాని కుమారుడు.

దేశపాలనలో ఉన్నప్పుడే ప్రాణాలు అర్పించిన నాయకుల వారసుడు.

తను ప్రధాని అయ్యే అవకాశం ఉన్న త్యాగం చేసి మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని ని చేసిన సోనియా గాంధీ గారు ఈ సారి ఆయన కుమారుడిని ప్రధానిగా చూడాలనుకుంటున్నారు.

ప్రతికూలతలు :

పరిపాలన అనుభవం లేకపోవడం.

దేశ సమస్యలపై కాస్తైన అవగాహన రాహుల్ గాంధీకి లేదు. కేవలం ఈ ఐదేళ్ళలో ఒకే ఒక అంశాన్ని పట్టుకుని వేళాడాడు అదే రాఫెల్ అంశం.
రాహుల్ గాంధీ గారికి రాఫెల్ అనే అంశం తప్పితే దేశంలో ఇంక వేరే సమస్యలు ఏవి కనిపించలేవు.

ఇలాంటి వారు ప్రధాని అయితే దేశాన్ని ఏం పాలిస్తారు. కాంగ్రెస్ ప్రధానులు రబ్బర్ స్టాంపు ప్రధానులని పేరు దీనికి రాహుల్ మినహయింపేమి కాదు.

ఇక పదేళ్ళు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రేస్ హాయాంలో  వెలుగు చూడని కుంభకోణం లేదు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలు కుంభకోణాలంటే కాంగ్రేస్ పార్టీ అనే విధంగా రోజుకో కుంభకోణాలు వెలుగుచూసాయి  వారి హాయాంలో. అలాంటి పార్టీకి మళ్ళీ జనాలు పట్టం కడుతారా అంటే డౌటే..

ఇక ఈ సారి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి కాబట్టి దేశ సమస్యలపై కనీస అవగాహన లేని రాహుల్ గాంధీ ప్రధాని అయితే సమర్థవంతంగా ఆయన ఈ దేశాన్ని సమర్థవంతంగా పాలించగలడని నమ్మకం జనాలకు లేదు. కాబట్టి ఆయన ప్రధాని అయ్యే అవకాశం లేదు.


నోట్లరద్దు, జీఎస్టీ లాంటి వాటి వల్ల జనాలు ఇబ్బందులకు గురి అయిన , సర్జికల్ దాడులు వంటి సహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న అవి  దేశ ప్రయోజనాల కోసమే కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకునే మోడినే మళ్ళీ ప్రధాని కావాలని జనం కోరుకుంటున్నారు.

ఇక రాహుల్ గాంధీ ఈ దేశాన్ని పాలించగలడని ప్రజల్లో నమ్మకం లేదు. ఈ సారి కాదు కదా ఇంకో ఇరవై ఏళ్ళయిన మోడినే ప్రధాని గా గెలుస్తారు.

అన్ని పార్టీలు ఏకమైన మోడి  విజయాన్నీ ఎవరు ఆపలేరు. ఈదేశానికి కావలసింది ధమ్మున్న నాయకుడు. పప్పూలు కాదు.

సో 2019 లో  భారత ప్రధానిగా మళ్ళీ నరేంద్ర మోది గారు గెలుస్తారు.




22, మే 2019, బుధవారం

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు..??

   మనదేశంలో అటు పార్లమెంటు ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరికి ఆసక్తికర అంశం ఎవరు గెలుస్తారు అని. కేంద్రం సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలుగు ప్రజలందరిలో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ గారు ఈ ముగ్గురి మధ్యే పోటి నెలకొంది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆయనకు వచ్చే సీట్లు అంకెలకే పరిమితమవుతాయి కాబట్టి ఆయన సీఎం కాలేరు ఒకవేళ కింగ్ మేకర్ అవుతాడనుకుంటే ఆయన పార్టీకి వచ్చే సీట్లతో అది సాధ్యం కాదు.
ఇక చంద్రబాబు గారు మరియు జగన్ గారి మధ్యే అసలైన పోటి. వీరిద్దరిలో జగన్ కు అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సారి మాత్రం జగన్ సీఎం అవడం పక్క.

చంద్రబాబు, జగన్, పవన్ ఈ ముుగ్గురిలో ప్రజలు ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు. ఎందుకుఅనేది ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబు: అనుకూలతలు

సీనియర్ రాజకీయ నాయకుడు.
మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని స్థాపించి హైదరాబాదును ప్రపంచవ్యాప్తం చేసాడు.

ఇక రాష్ట్రం విడిపోయాక రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాడు.

ఆంధ్రుల ఎన్నో ఏళ్ళ స్వప్నం పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాడు.

కియా కార్ల కంపెనీని రాష్ట్రంలో నెలకొల్పాడు.

సెల్ఫోన్ తయారి కంపెనీలు రాష్టరంలో ఏర్పాటు చేసాడు.

చంద్రబాబు ప్రతికూలతలు:

ఉమ్మడి రాష్ట్రాన్ని 9 ఏండ్లు పాలించినప్పుడు కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సాహించి మిగిత రంగాలను పట్టించుకోలేదు.


వ్యవసాయం దండగ అన్నాడు. వ్యవసాయ రంగాన్ని, రైతులను అవమానించాడు.

కరెంట్ అడిగిన పాపానికి రైతులపై కాల్పులు జరిపించాడు.

అన్ని రంగాలను తుంగలో తొక్కి కేవలం ఐటీ రంగాన్ని మాత్రమే ప్రోత్సహించి హైదరాబాదును అభివృద్ది చేసానని చెప్పుకుంటాడు.

ఉమ్మడి రాష్ట్రం చాలా పెద్దది కేవలం హైదరాబాదును అభివృద్ది చేసి నేను ఈరాష్ట్రాన్ని అభివృద్ది చేసానని పదే పదే చెప్పుకుంటాడు. సరే హైదరాబాదును అభివృద్ది చేసాడు మిగితా ప్రాంతాల పరిస్థితి ఏంటి.?  అక్కడ ప్రజలకు ఉపాది అవకాశాలు ఏంటి.

హైదరాబాద్ లో అభివృద్ది కూడా కేవలం ఐటీ రంగంలోనే చేసాడు. మరి మిగితా రంగాల పరిస్థితి ఏంటి..? అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా వారికి ఉపాది అవకాశాలు ఎలా??

హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టింది నేనే అనే చంద్రబాబు గారు ఒకసారి మూసీ నదిని కూడా ప్రపంచ పటంలో పెట్టి ఆయన  చేసిన అభివృద్దిని ప్రపంచానికి చూపాలి..

చంద్రబాబు గారు 9ఏండ్లు సీఎం గా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రానికి చేసింది ఒక ఐటీ తప్ప మిగితాదంతా శూన్యం.

ఇక రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు గారు చేసింది రాజధాని నిర్మాణం అది సాగుతూనే ఉంటుంది సింగపూర్ ల చేస్తా అని చెప్పుకుంటున్నారు. అది పూర్తయ్యేదెప్పుడో.

పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నానని గొప్పలు చెప్పే బాబుగారు ఆ ప్రాజెక్ట్ ను ప్రాజెక్ట్ ఐదేళ్ళలో పూర్తి చేయలేదు ఎందుకు ??  ఎందుకంటే చంద్రబాబు  మళ్ళీ గలవకపోతే   ప్రాజెక్ట్ పూర్తవదని జనాలు అనుకుని మళ్ళీ గెలిపిస్తారని ఆయన భ్రమ.

ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మాట్లడుతారు.

ఇక గొప్ప కార్ల కంపెని కియా ను రాష్ట్రంలో ఏర్పాటు చేసాను. ఇలాంటి కంపెనీలు చంద్రబాబు వల్లే సాధ్యం అని ప్రజలు భావించి మళ్ళీ తనని గెలిపిస్తారని అనుకుంటున్నాడు. ఓకే..   కార్ల కంపెని వచ్చింది రాష్ట్రానికి. దానివల్ల ఎవరికి ప్రయోజనం
స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని అనుకోవచ్చు కాని అందులో పెద్ద ఉద్యోగాలు అన్ని ఇతర దేశాలు లేదా ఇతర రాష్ట్రాల వారికే వస్తాయి. చిన్న చితక ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారు. అందులోను గొడ్డు  చాకిరి చేయించుకుంటారు. ఇలాంటి గొడ్డు పనులు ఎలాగు  మనవాళ్ళు చేయరు అందువలన ఇతర రాష్ట్రాలు ఒడిశా, బీహార్ లాంటి రాష్ట్రాల వారిని  తెప్పించి వారితో చేయించుకుంటారు. ఇప్పుడు చెప్పండి స్థానికులకు ఉద్యోగాలు ఎక్కడివి. ఇలాంటి కంపెనీల వలన ఎవరికి ప్రయోజనం.

మిగితా కంపెనీలైనా సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ కంపెనీలలో కూడా ఇదే పరిస్థితి స్థానికులకు ఉద్యోగాలు శూన్యం. పేరుకు ఉద్యోగాలు ఇస్తారు కాని మనవాళ్ళ చేత గొడ్డు చాకిరి చేయించి పొమ్మనలేక పొగ పెట్టిన చందాన వ్యవహరించి బయటికి వెళ్ళేలా చేసి ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు చెప్పండి ఇదేనా అభివృద్ది అంటే ఈ కంపెనీల వల్ల స్థానికులకు ప్రయోజనం లేకపోగా కాలుష్యం మాత్రం దండిగా ఉంటాది. కాలుష్యం స్థానికులకి ఉద్యోగాలు ఇతర రాష్ట్రాల వారికి ఇది చంద్రబాబు అభివృద్ధి.

ఇక రైతుల విషయానికి వస్తే చంద్రబాబు గారు చేసింది అప్పుడు శూన్యమే ఇప్పుడు పరమ శూన్యం.  రైతులకు , కార్మికులకు,పేదవారికి, మధ్యతరగతి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చని బాబు గారు మళ్ళీ ఎలా ముఖ్యమంత్రిగా గెలుస్తారు.
చంద్రబాబు గారికి ఓటు వేసేది కేవలం ఐటీ ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు మాత్రమే.

ఇక జగన్ విషయానికి వస్తే

ప్రతికూలతలు:

అక్రమ ఆస్తుల కేసులు ఒక్కటే ఆయనపై ఉన్న ఉన్న ప్రతికూల అంశం.

ఇంకోకటి పరిపాలన అనుభవం లేకపోవడం.

 అనుకూలతలు:

రాష్ట్రమంతట పాదయాత్ర చేసి
ఒంటి చెత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయిన  మహా నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కూమారుడిగా ప్రజల్లో జగన్ అంటే అభిమానం.

దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల జనాల హృదయాలు గెలుకున్న నేత ప్రియతమ రాజశేఖర్ రెడ్డిగారు.

రాష్ట్ర ప్రజల సేవలో నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవలోనే తన జీవితాన్ని త్యాగం చేసిన మహావ్యక్తి వైయస్ రాజశేఖర్ రెడ్డిగారు. ముఖ్యమంత్రి పదవికే వన్నే తెచ్చిన మహానేత.
అలాంటి మహానేత కుమారుడు  ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజశేఖర్ రెడ్డిగారిలా రాష్ట్రాన్ని పాలిస్తాడని జనాలు విశ్వసిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల ద్వారా లభ్ధి పొందారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్మరణీయం.

  మహానేత  రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాడని జనాలు విశ్వసిస్తున్నారు.

మరో విషయం ఏంటంటే  జగన్ రాష్ట్రమంతట పాదయాత్రలు చేసి ఆయా ప్రాంతాల పరిస్థితులను  అక్కడి సమస్యలను దగ్గరుండి చూసాడు కాబట్టి జగన్ సీఎం అయితే అక్కడి సమస్యలు పరిష్కారం అవుతాయని జనం జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

జగన్ సీఎం అయితే  రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్ని మళ్ళీ ప్రారంభించి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతాడని ప్రజలు జగనే సీఎం కావాలనుకుంటున్నారు.

ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నూటికి నూరు శాతం వైయస్ జగన్ గారే.

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే లగడపాటి  సర్వే ఏపి ఎన్నికల విషయంలో తప్పు చెప్పిన పవన్ కళ్యాణ్ గారి గురించి కరెక్ట్ గా చెప్పారు.   ఒకటి నుండి మూడు సీట్లు మహా అయితే అంకెలు దాటి సంఖ్యలకు వెళ్ళవు ఆయన పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య. కాబట్టి పవన్ ఈసారి పోటిలో ఉన్న ముఖ్యమంత్రి అన్న పదానికి ఇంకో 20 ఏండ్లు వేచిచూడాలి.

పవన్ పరిస్థితి  ఎలా ఉందంటే పూనకం వచ్చినప్పడు ఊగిపోయి పప్రంగిస్తుంటాడు. ఆయనకు అంత ఆవేశం ఎందుకో ఆయన అభిమానులకే అర్థం కాదు.

రాజకీయాల పట్ల అవగాహన లేదు. పరిపాలన పట్ల అంతకన్నా లేదు ఇలాంటి వ్యక్తి సీఎం అవడం కష్టం. ఇది సినిమా కాదు జీవితం సినిమాల్లో లాగా డైలాగులు కొడితే ఈలలు పడుతాయే తప్ప ఓట్లు పడవు. జనాలకు కావాలసింది పంచ్ డైలాగులు కొట్టేవాడు కాదు. సమర్థవంతంగా రాష్ట్రాన్ని పాలించేవాడు. ఆ నమ్మకం ఈసారి ప్రజలు జగన్ పై ఉంచారు.

2019 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్.