ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. బయట తిరగలేం ఇంట్లో ఉండడానికే ఎక్కువగా ఇష్టపడుతాం. ఇంట్లో ఏసీలు, ఫ్యాన్ లు, కూలర్ లు ఆన్ చేసుకుని హాయిగా ఉంటాం. కాని అవి అందరికి సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్ళు కాంక్రీట్ తో నిర్మించినది కావు ఎవరి స్థోమతకు తగ్గట్టు వారు ఇళ్ళను వివిధ రకాలుగా నిర్మించుకుంటారు. అప్పట్లో ఇళ్ళు తాటాకులతో గడ్డితో నిర్మించేవారు కొందరు నాపరాయితో ఇళ్ళ పైకప్పులు నిర్మించేవారు. కొందరు మిద్దెలు నిర్మించేవారు.ఈ ఇళ్ళల్లో ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది. మరియు అన్ని కాలాలకు అనుకూలంగా ఉండేవి.కాలక్రమేణ ఇలాంటి ఇళ్ళు మాయమైపోతున్నాయి. అందరు కాంక్రీట్ ఇళ్ళనే నిర్మించుకుంటున్నారు. కాంక్రీట్ ఇళ్ళు నిర్మించుకునే స్థోమతలేని వారు రేకులతో ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.
ఈ రేకుల ఇండ్లను కొందరు సింమెంటు రేకులతో నిర్మించుకుంటే మరికొందరు ఇనుప రేకులతో నిర్మించుకుంటున్నారు. కొంతవరకు సిమెంట్ రేకులు నయం కాని ఇనుపరేకుల ఇండ్లల్లో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది.కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు కూడా ఈ ఇనుప రేకుల ఇళ్ళళ్ళో పనిచేయవు. ఎందుకంటే ఈ రేకులతో నిర్మించిన ఇళ్ళు ఏ కాలానికి అనుకూలంగా ఉండవు. మొగలి రేకులు అనే సీరియల్ ను లక్షా ఎపిసోడ్ లు చూస్తాం కాని ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఒక్కరోజు కూడా ఉండలేం.
ఇనుప రేకులు అన్ని కాలాల వాతావరణాన్ని రెట్టింపు చేసి అందులో నివసించే వారికి చుక్కలేం ఖర్మ పాలపుతలను కూడా టెలిస్కోప్ లేకుండా చూపిస్తుంది.
ఎండాకాలంలో బయటి కంటే కూడా వేడి ఎక్కువగా ఉంటుంది.
బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే లోపల 45 డిగ్రీలు ఉంటుంది.
ఇక ఫ్యాన్ వేసుకుంటే బోనస్ గా మరో ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి టోటల్ గా 50 డిగ్రీలవుతుంది.
వానాకాలంలో వర్షం పడుతుంటే భారి శబ్ధంతో ఏమి వినపడదు.
5 సెం.మీ. వర్షం పడితే లోపల మాత్రం 20 సెం.మీ. వర్షం కురిసినంత శబ్ధం వస్తుంది.
ఇక చలికాలంలో అయితే బయట ఉష్ణోగ్రత 20 డిగ్రీలు ఉంటే లోపల 10 డిగ్రీలు ఉంటుంది.
సాదారణంగా చలికాలంలో మంచుకురుస్తుంది.
ఇనుప రేకుల ఇళ్ళల్లో మాత్రం పైనుండి చల్లని నీళ్ళు కురుస్తుంటాయి. ఇళ్ళంతా వర్షం పడుతున్నట్టు ఉంటుంది.
ఏమని చెప్పాలండీ ఇనుపరేకుల ఇళ్ళల్లో నివసించేవారి బాధలు ఏ కాలానికి కూడా ఈ రేకులు పనికి రావు పైగా ఆ కాలంలో మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అందరికి నేను చెప్పేది ఏంటంటే వీలుంటె కాంక్రీటుతో ఇళ్ళు నిర్మించుకోండి అంత స్థోమతలేని వారు కనీసం తాటాకులతోనైనా ఇళ్ళు నిర్మించుకోండి అంతేకాని ఇనుప రేకులతో నిర్మించుకోవద్దు. ఎందుకంటే ఇనుపరేకులు అన్నికాలాలకునకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
ఎండాకాలంలో వేడిని రెట్టింపు చేస్తుంది.
వానాకాలంలో వాన శబ్ధాన్ని రెట్టింపు చేస్తుంది.
చలికాలంలో చలిని రెట్టింపు చేస్తుంది.
ఎందుకు ఈ రేకులను పైకప్పుగా వేసుకున్నామా అనిపిస్తుంది.
దీనికంటే గడ్డితో కప్పుకున్న గుడిసే ఇళ్ళు 100 రెట్లు నయం. ఎందుకంటే గుడిసెలో ఏ కాలంలో అయిన మనకు అనుకూలంగా ఉంటుంది. గుడిసె అని చిన్న చూపు చూస్తారుగాని ఇవి అన్ని కాలాలకు అనుకులం పర్యావరణ హితంగా ఉంటాయి.
ఇనుప రేకుల ఇళ్ళతో ఇన్ని అవస్థలు పడేకంటే సిమెంటు రేకులు వేయవచ్చు కదా అంటే సిమెంట్ రేకులంటే భయం. ఎందుకంటే ఎవరైన ఇంటిమీద రాళ్ళేస్తారని భయం. అందుకే ఎంత అసౌకర్యంగా ఉన్నా ఇనుప రేకులతోనే ఇంటి పైకప్పు నిర్మించుకుంటున్నారు.
మరి ఇనుప రేకుల ఇళ్ళళ్ళో ఇన్ని అసౌకర్యాలు భరిస్తూ ఉండాల్సిందేనా దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. అదేలాగంటే థర్మకోల్ సీలింగ్. ఈ థర్మకోల్ సీలింగ్ ని ఇంట్లో బిగించుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎండా,వానా,చలి కాలాలలో ఎలాంటి ఇబ్బందిలేకుండా రేకుల ఇంట్లో ఉండొచ్చు. దీనివల్ల ఇళ్ళు అందంగాను ఉంటుంది.
దీనిని తక్కువ ఖర్చుతో మనమే ఇంట్లో బిగించుకోవచ్చు.
1 కామెంట్:
ఇనుపరేకుల ఇళ్లలో దుర్భరం బతుకు
కామెంట్‌ను పోస్ట్ చేయండి