భానోదయం: ఏమి ఎండలు దేవుడా! దీనికి కారణం ఎవరు?

19, మే 2023, శుక్రవారం

ఏమి ఎండలు దేవుడా! దీనికి కారణం ఎవరు?

 ఎండలు మండిపోతున్నాయి ఏం ఎండలు దేవుడా ఇవి అని అంటున్నారు. బయట తిరగాలంటేనే భయం వేస్తుంది. మా గ్రామంలోనే 38 డీగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఇక నగరాల్లో అయితే 45 నుండి డీగ్రీలు ఉంటుంది.

 మరో పది ఏళ్ళలో 50 నుండి 55డిగ్రీలు దాటిపోతుంది. ఇందుకు కారణం ఎవరో కాదు అందరు కారణమే.  చెట్లు, అడవులను నరికేస్తున్నారు. కొండలు, గుట్టలు తవ్వేస్తున్నారు. సామాన్య ప్రజలు ఎవరు కొండలు, గుట్టలు తవ్వేయ్యరు కదా అనొచ్చు.

 

 కొండలను తవ్వేది ఇప్పుడు సామాన్యుల కోసమే. ఇంటి నిర్మాణంలో ఇప్పుడు ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు ఇంటి ఫ్లోరింగ్ కి గ్రానైట్ వాడాల్సిందే. డబ్బు ఎంతైనా పర్వాలేదు. అప్పు చేసైనా గ్రానైట్ వాడాల్సిందే. మరి ఆ గ్రానైట్ కావాలంటే కొండలను కోయాల్సిందే. కంకర, డస్ట్ ఇలా అన్ని ఈ కొండలనుండే తయారు అవుతాయి కదా. ఒకప్పుడు ఈ కొండలు పచ్చని చెట్లతో అంత్తెత్తునా ఆహ్లాదకరంగా ఉండేవి. ఆ ప్రాంతంలో ఎంత ఎండాకాలంలో అయినా చల్లగా ఉండేది. మరి ఇప్పుడో ఆ ప్రాంతంలో క్రషర్లతో కొండలను పిండి చేస్తున్నారు. పచ్చని ప్రాంతం అంతా వెలవెలబోతోంది దుమ్ము ధూళితో విపరీతమైన వేడితో అక్కడ చుట్టు పక్కల నిలవలేని పరిస్థితి.


ఇళ్ళు కట్టుకోవాలంటే కొండలను తవ్వాల్సిందే వేరే దారి లేదంటే అక్కడ జరుగుతున్న విద్వంసానికి మరోచోట చేట్లను పెంచితే కొంతవరకైనా పర్యావరణం కాపాడవచ్చు. 


ఎక్కడ చూసినా కాంక్రీటు మయం అయిపోయింది ఎండాకాలం వచ్చిందంటే కాంక్రీటు వలన  వేడి ఇంకా పెరిగిపోతుంది. వానాకాలం నీరు భూమిలోకి ఇంకిపోక వరదలు వస్తున్నాయి అలాగే భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి కరువు ఏర్పడుతుంది.



మనకు ఎవరికి ఇవి  పట్టవు మనకు కావలసింది అభివృద్ధి మాత్రమే. ప్రకృతి ఏమైతే మాకేంటి. ఎండలు మండిపోయి, త్రాగడానికి నీరులేని దుస్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది పర్యావరణం విలువ.


ఇలా పచ్చని ప్రకృతి అందాలు ద్వంసం అవడానికి కారణం ఏ ఒక్కరో కాదు అందరు కారణమే. మనం వాడుతున్నాం కాబట్టి వాడు కొండలు తవ్వేస్తున్నాడు. మరీ ఇప్పుడు ఇళ్ళు కాంక్రీటుతో కట్టకుండా ఎలా కడతాం అనుకోవచ్చు. ఇప్పుడు ఇళ్ళు కట్టుకోవడానికి కాంక్రీటు తప్ప వేరే దారిలేదు కాబట్టి అలా కొండలను తవ్వుతూ వెళ్ళాల్సిందే చివరకు ఎప్పుడో అప్పుడు ప్రకృతే సమతుల్యం చేస్తుంది. 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీరు వ్రాసినది సత్యం. లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన కొండలు గత వంద ఏళ్లలో మాయం అయిపోయాయి. కొండలు, పర్వతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

అధిక జన సాంద్రత వల్ల ప్రకృతి వనరుల విధ్వంసం ఎక్కువగా జరుగుతున్నది. మీరన్నట్టు ప్రకృతి స్వయంగా సమతుల్యం చేయాలి.

భానోదయం చెప్పారు...

మనలాంటి వారు ఈ విధ్వంసాన్ని ఆపలేరు అది సాద్యం కాదు కూడా. అందుకే ప్రకృతే స్వయంగా సమతుల్యం చేయాల్సిందే.