2000 రూపాయలు నోటు ఉపసంహరణ వలన సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర 2000 రూపాయల నోటు లేదు. అసలు ఈ నోటు చూసి చాలా రోజులైంది. బ్యాంకుల్లో, ఏటిఎమ్ లో కూడా ఈ నోటు రావడం లేదు. ఎవరో ఈ నోట్లను ఇంట్లో దాచుకుంటే తప్ప ఎవరి వద్ద ఈ నోట్లు లేవు. పెద్ద మొత్తంలో డబ్బును ఎవరు ఇంటిలో దాచుకోరు. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుంటారు కాబట్టి సామాన్య ప్రజలకు 2000 రూపాయల నోటు రద్దు వలన ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
2016 లో లాగా బ్యాంకుల్లో వరుసలో నిలబడి నోట్లను మార్చుకునేందుకు పడిన అవస్థలు ఇప్పుడు ఉండవు. ఎందుకంటే అప్పుడు 1000, 500 నోట్లు రద్దు చేసారు తమ డబ్బు ఎక్కడ చెల్లుబాటు కాదో అని తమ దగ్గర ఉన్న నోట్లను ప్రజలు మార్చుకునేందుకు బ్యాంకులకు పరిగెత్తారు.అప్పుడు కూడాఏలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఎవరు కూడా పెద్ద మొత్తంలో డబ్బును తమ ఇంట్లో ఉంచుకోరు. బ్యాంకులోనే దాచుకుంటారు.
ఇక అప్పుడు బ్యాంకుల వద్ద పెద్ద మొత్తంలో జనాలు పరిగెత్తి ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల నల్లధనాన్ని దాచుకున్న బడాబాబుల వల్లే బ్యాంకుల వద్ద హడావిడి పెరిగింది.
తమ వద్ద ఉన్న కోట్ల రూపాయల నోట్లను సామాన్య ప్రజలకు ఇచ్చి మార్చుకునే ప్రయత్నం చేసారనిపిస్తుంది. అందువల్ల కొంత ఇబ్బంది కలిగింది. సామాన్యుల వద్ద మహా అయితే ఓ పదివేలు ఉంచుకుంటారు లక్షలు, కోట్లు ఇంట్లో ఉంచుకోరు కదా.
ఇబ్బందులు కలిగేదల్లా అక్రమార్కుల వల్లే ఎలాగైనా నోట్లు మార్చుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అందుకు సామాన్య ప్రజలకు కొంత డబ్బు ఆశ చూపించి పాతనోట్లను వారి ఖాతాల్లో జమ చేయించడం వలన బ్యాంకుల వద్ద జనాలు బారులు తీరారు.
ఇప్పుడు కూడా 2000 రూపాయల నోటు రద్దుతో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. కోట్ల రూపాయల నల్లధనాన్ని సామాన్య ప్రజలకు ఇచ్చి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కాని అందుకు పరిమితి ఉంది రోజుకు ఇరవై వేలు మాత్రమే ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది జనాల చేత నోట్ల మార్పిడి చేయించే అవకాశం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా ఒక్క 2000 రూపాయల నోటు లేదు. ఉంటే రాజకీయ నాయకుల వద్ద మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద మాత్రమే ఈ నోట్ల కట్టలు ఉంటాయి.
2019 నుండే 2000 రూపాయల నోటును ముద్రించడం ఆపేసారు. అలాగే బ్యాంకులకు డిపాజిట్ రూపంలో వచ్చిన నోట్లను తిరిగి జనాలకు ఇవ్వలేదు. అప్పటి నుంచి జనాల్లో 2000 నోటు అందుబాటులో లేకుండా పోయింది. కేవలం వందల కోట్లు అక్రమంగా సంపాదించిన వారివద్దే ఈ నోట్ల కట్టలు ఉంటాయి.
వచ్చే ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో ఈ నోట్లను పంచడానికి రాజకీయ నాయకులు దాచి ఉంటారు. ఇలాంటి వారికి పెద్ద సమస్యే. కాని ఎలాగోలా వారు నోట్లను మార్చుకుంటారు. ఎలాగంటే రాజకీయ నాయకులు అంటే అవినీతికి నిలువెత్తు నిదర్శనం. ఏ రూపంలో అయినా అవినీతి చేస్తూనే ఉంటాడు. అసలు రాజకీయం చేసేదే అవినీతి అక్రమ సంపాదన కోసం. వారికి ఎన్నో దారులు ఉంటాయి. ప్రజలను ఇబ్బందులకు గురిచేసైనా తమ అవినీతి కొనసాగిస్తారు. ఇక నోట్ల మార్పిడి వారికి సులువే తమ పలుకుబడి ఉపయోగించి చేసుకుంటారు. లేదంటే కార్యకర్తలకు, జనాలకు తలా ఇంత డబ్బు ఇచ్చి మార్చుకుంటారు అది వీలుకాకుంటే దౌర్జన్యం చేసి అయినా మార్చుకుంటారు.
ఇక మొత్తానికి 2000 రూపాయల నోటను రద్దు చేయడం మంచి పనిచేసారు. అదికూడా ఈ సమయంలో. దీనివల్ల సామాన్య ప్రజలకు ఏలాంటి ఇబ్బంది లేదు. అక్రమంగా సంపాదించిన అవినీతి పరులకే ఇబ్బంది..
నల్లధనాన్ని అరికట్టాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. చాలామంది అక్రమార్కులు 2016 నోట్లు రద్దు తర్వాత జాగ్రత్తలు పడుతున్నారు డబ్బును నిలువ ఉంచుకోకుండా భూములు కొనడం మొదలు పెట్టారు. ఇలా తమ అక్రమ సంపాదనతో వందల ఎకరాల భూమి కొంటున్నారు. ఇలా వందల ఎకరాల భూమి కొనే వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అసలు ఒక వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కొనే హక్కు ఇవ్వకూడదు. అప్పుడే నల్లధనాన్ని కొంతవరకు అరికట్టగలం...
10 కామెంట్లు:
బాగా వ్రాశారు.
2016 లో చేసిన 500, 1000 నోట్ల రద్దు విఫలం అయింది. 15.41 లక్షల కోట్ల పెద్ద నోట్లు 2016 నవంబరు లో చలామణీ లో ఉండగా 15.31 లక్షల కోట్ల విలువ గల నోట్లు వెనక్కు వచ్చాయి. అంటే కేవలం 10700 కోట్లు మాత్రమే మిగిలి పోయాయి.
పై పెచ్చు 2000 రు నోట్లు ప్రవేశ పెట్టడం ఒక తప్పిదం. ఇప్పుడు అవి రద్దు చేయడం సరైనదే.
ఇప్పుడు 2000 నోటు రద్దు చేయడం ద్వారా నల్లధనం బయటకు వచ్చే అవకాశం ఉంది.
మీ అమాయకత్వానికి నవ్వొస్తోందండీ
ఎందుకు అలా నవ్వొస్తుంది..
ఎందుకంటే ఏమి చెప్పను
ఎందుకంటే ఎలా చెప్పను :)
2016 నోట్ల రద్దు చేసినప్పుడు వెనక్కు వచ్చిన నల్లధనం నామమాత్రమే. ఇప్పుడు 2000 రద్దుతో వచ్చేది కూడా వేరుశనగ పప్పు మాత్రమే అని నవ్వు వచ్చిందేమో ఒకటో అజ్ఞాతకు.
I think you yourself giving contradictory statements, look at last 2 and 3 paragraphs, one para you are saying there will be some inconvenience to people who earned money illegally, but in other para you said politicians will get their money changed by hook or crook, the point we highlight is people who earned money illegally would make a deal with politicians and get their money also changed...so the decision of banning rs 2000 is good for nothing... Same thing happened during initial demonization also, normal people died dogs death waiting in queues and all politicians and illegal money earners got their money converted through back door by sitting in their A C rooms - kaalu meeda kaalu vesukoni... I think this is the reason for agnatha's comment of "Mee amayakatvaniki navvu vastundi"
డబ్బు ఆశ చూపిస్తే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చటం చాలా తేలిక అంటారు.
Mari anthe gada mastaru, shatha koti daridralaki anatha koti vupayaalu Ani peddalu vootake cheppara 😀
<<ఒక వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కొనే హక్కు ఇవ్వకూడదు. అప్పుడే నల్లధనాన్ని కొంతవరకు అరికట్టగలం...<<<
హైదరాబాద్ లో 5 ఎకరాలకు కే సి ఆర్ గారికి కోటి రూపాయల ఆదాయం వస్తుంది. ఆదిలాబాద్ లో 5 ఎకరాలకు 5000 కూడా రాదు. మరి ఒక మనిషికి 5 ఎకరాలు ఎలా సరిపోతుంది ?
మనలాంటి వాళ్ళను చూసే విజయ్ మాల్యా ఆర్థికశాస్త్రము చదవండి అని వెక్కిరిస్తూ చక్కా పోయాడు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి