రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. పప్పులు, కూరగాయలు, బియ్యం, డీజిల్, పెట్రోల్, రవాణా చార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవి మనకు ప్రతీరోజు అవసరమే. వీటి ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ఈ ధరల పెరుగుదల దల వల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్య ప్రజలు. అంటే రోజు కూలీలు, చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కిరాణా షాపుల్లో, బట్టల షాపుల్లో పనిచేసే వారికి నెలకు పదివేల దాటి జీతం రాదు.
ఇప్పుడున్న ధరలకు నెలకు పదివేల రూపాయల జీతం ఏ మూలకు సరిపోతుంది. ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చిన్న చితక పనులు చేసే వారికి జీతాలు మాత్రం పెరగవు.
ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఎక్కువగా భారం పడేది సామాన్యులకు మాత్రమే.
ఇక మిగితా వారిపై ఈ ధరల ప్రభావం అంత ఉండదు ఎందుకంటే వీరికి వచ్చే నెల జీతాలు భారిగానే ఉంటాయి కాబట్టి వారిపై ధరల పెరుగుదల ప్రభావం ఏమాత్రం ఉండదు.
ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుంటే ఏ చిన్న ప్రభుత్వ ఉద్యోగకైనా తక్కువలో తక్కువ నెల జీతం 30,000 రూపాయలు ఉంటుంది ఇది కనీసం గరిష్టంగా లక్ష రూపాయల జీతం కూడా వచ్చే ఉద్యోగులు ఉన్నారు. వీరికి జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. PF, ESI, లాంటి సౌకర్యాలు ఉంటాయి. మరియు ప్రతీ మూడూ నెలలకోసారి ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇలా మూడు నెలలకోసారి జీతాలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు వీరికి ఏమాత్రం భారం పడదు.
ఇక ప్రైవేటు ఉద్యోగాలకు కూడా జీతాలు భారీగానే ఉంటాయి. అలాగే అలవెన్సులు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ధరలు పెరుగుదల వల్ల ఎలాంటి భారం పడదు.
వ్యాపారస్తులకు కూడా ధరలు పెరుగుదల ఎలాంటి భారం పడదు. పైగా వీరికి ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను కొని ఎక్కువ మొత్తంలో నిలువ చేసుకుంటారు. వాటి ధరలు పెరిగినప్పుడు అధిక మొత్తానికి విక్రయించి కోట్లు సంపాదించుకుంటున్నారు.
ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరగడం సహజం.
కాని వ్యాపారస్తులు కృత్రిమంగా నిత్యవసర వస్తువల కొరత సృష్టించి ధరలు పెంచేసి కోట్లు సంపాదిస్తున్నారు.
నిత్యవసర వస్తువల ధరలు ఏ విధంగా పెరిగిన చివరకు భారం పడేది సామాన్యులకు మాత్రమే.
వీళ్ళను పట్టించుకునే నాథుడే ఉండడు. వీళ్ళు ఎలాగోలా బతుకు బండిని ముందుకు లాగాల్సిందే..
అదే ప్రభుత్వ ఉద్యోగులయితే తమకు జీతం సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారికి కావాల్సిన డిమాండ్లను సాదించుకుని ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నారు.
ఉదాహరణకు మొన్నటి వరకు సమ్మె చేసిన ఆర్టీసి వారినే తీసుకుందాం. 55 రోజులు సమ్మె చేసి ఇటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసారు. సమ్మె చేసినప్పుడు ఇబ్బందులకు పడింది సామాన్యులే. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసింది ఇప్పుడు కూడా భారం పడేది సామాన్యులకే. ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. పని చేయకుండా 55 రోజులు సమ్మె చేసిన వారికి జీతాలు ఇస్తున్నారు. ఇంకా వీరికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారు. ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన డబ్బు ఎలా వస్తుందండి. సామాన్యుల ముక్కు పిండి వసూలు చేయాల్సిందే కదా??
ఆర్టీసీ ఉద్యోగులు తమకు జీతాలు సరిపోవడం లేదని సమ్మెలు చేసి వారి డిమాండ్లను సాధించుకున్నారు. మరీ చిన్న చితక ఉద్యోగులు, రోజు కూలీలు ఎవరిని అడిగి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ దేశంలో గూర్తింపు ఉన్న ఉద్యోగులు మాత్రమే బతకాలా?? సామాన్యుల బతుకులు ఏమైనా పరవాలేదా ? వీళ్ళ గోడు ఎవడు పట్డించుకుంటాడు? ఏ నాయకుడు వింటాడు?
ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎవరు కూడా ధరల పెరుగుదల భారం వారిపై పడనీయరు. సామాన్యులపై వేసి వారి నడ్డి విరిచి పాతాళానికి తొక్కే స్తున్నారు. వాళ్ళు మాత్రం పైకెదుగుతున్నారు.
ఇలాంటప్పుడు సమాజంలో ఆర్థిక అసమానతలు ఎలా తొలగిపోతాయి.
నా విన్నపం ఏమిటంటే చిన్న చితక పనులు, రోజు కూలీలు,కిరాణా షాపులు, బట్టల షాపులు, చిన్న పరిశ్రమలలో పనిచేసే వారందరూ ఒక యూనియన్ గా ఏర్పడి మన సమస్యలను పరిష్కరించుకోవాలి. మనకు కూడా ఇంక్రిమెంట్లు, అలవెన్సులు, PF, ESI వంటి సదుపాయాలు ఉండేలా చూసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, పెద్ద పెద్ద పరిశ్రమల ఉద్యోగులు తమ సమస్యల కోసం సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. అలాంటిది ఎలాంటి గుర్తింపు లేని ఈ ఉద్యోగాలు చేస్తూ ఎన్ని రోజులు ఇలా చాలి చాలని జీతాలతో బ్రతుకుతారు. మనం లేనిదే అక్కడ పని జరగదు. ఏ యాజమాని కూడా పని వాళ్ళు లేనిదే వ్యాపారం చేయలేడు. అందువల్ల మనం కూడా సమ్మెలు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలి...